ఇండియాలో iQOO Neo 10R లాంచ్ ఫిక్స్.. 144Hz స్క్రీన్, 90FPS గేమింగ్ సపోర్ట్‌తో వచ్చే అవకాశం..
త్వరలోనే iQOO Neo 10R భారత్‌లో లాంచ్ కానున్నట్లు స్పష్టమైంది. ఇది కంపెనీ ప్రత్యేక R బ్యాడ్జ్ కలిగిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. ఇప్పటికే కంపెనీ ఫోన్ లాంచ్‌ను ధృవీకరించడంతోపాటు కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. అలాగే, రాబోయే iQOO Neo 10R గురించిన పలు వివరాలను ఓ టిప్‌స్టర్ కూడా వెలుగులోకి తెచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ 1.5K OLED స్క్రీన్, 6,400mAh బ్యాటరీతోపాటు కంపెనీ X-యాక్సిస్ లీనియర్ మోటార్ ద్వారా శక్తినిచ్చే హాప్టిక్స్‌తో రావచ్చని భావిస్తున్నారు.