Lava Agni 3 Specifications

Lava Agni 3 Specifications - ख़बरें

  • దీనికి అదనంగా ఫ్రీ హోం రీప్లేస్మెంట్ సర్వీస్ కూడా అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
    భారతదేశంలో నవంబర్ 20న లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న Lava Agni 4, గతంలో వచ్చిన Lava Agni 3 5G మోడల్‌కు తరువాతి వేరియంట్‌గా రానుంది. ఈసారి కంపెనీ ఫోన్ నిర్మాణంలో మార్పులు చేసింది, సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్ బాడీకి బదులుగా అల్యూమినియం ఫ్రేమ్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
  • ఇందులో రెండు 50 మెగాపిక్సల్ సెన్సర్లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
    Lava Agni 4 భారత మార్కెట్లో నవంబర్‌లో లాంచ్ కానుంది. ఇది Lava Agni 3 5G కి సక్సెసర్‌గా రాబోతుంది. ఈ ఫోన్‌లో ఉండబోయే ఒక ముఖ్యమైన ఫీచర్‌ను కంపెనీ ఇప్పటికే టీజ్ చేసింది. హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో హారిజొంటల్ పిల్-షేప్ మాడ్యూల్‌లో డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉండబోతుంది.
  • ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే 6.78-అంగుళాల Full HD+ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది
    అందుతున్న సమాచారం ప్రకారం లావా అగ్ని 4 భారత మార్కెట్లో సుమారు రూ. 25,000 ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ధర లావా అగ్ని 3లో ఉపయోగించిన చిప్‌సెట్‌ను, మరియు దాని మార్కెట్ ధరను బట్టి అంచనా వేసినట్టు తెలుస్తోంది.
  • డిసెంబర్ 16న Lava Blaze Duo ఇండియాలో లాంచ్.. డిజైన్‌తోపాటు కీలక ఫీచర్లు వ‌చ్చేశాయి
    త్వ‌ర‌లోనే Lava Blaze Duo స్మార్ట్‌ఫోన్ భార‌త్‌లో లాంచ్ కానుంది. ఇప్ప‌టికే, కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ విడుదల తేదీని వెల్ల‌డించింది. అలాగే, ఫోన్ డిజైన్, క‌ల‌ర్ ఆప్ష‌న్స్‌తోపాటు కీల‌క‌మైన స్పెసిఫికేష‌న్స్‌ను ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లో రాబోయే స్మార్ట్ ఫోన్ RAM వేరియంట్‌ల‌తోపాటు డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెస‌ర్‌, బ్యాటరీ, OSల పూర్తి వివ‌రాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ఈ అక్టోబరు నెల‌లో ఇండియ‌న్ మార్కెట్‌లో లాంచ్ అయిన Lava Agni 3 మోడల్ ఫోన్‌కు సంబంధించిన‌ డిజైన్ పోలి ఉండేలా వెనుక ప్యానెల్‌పై అమ‌ర్చిన‌ సెకండరీ డిస్‌ప్లేతో ఇది అందుబాటులోకి రానుంది
  • మినీ AMOLED స్క్రీన్‌తో దేశీయ మార్కెట్‌లోకి లాంచ్ అయిన Lava Agni 3 ధ‌ర ఎంతో తెలుసా
    Lava స్మార్ట్‌ఫోన్ కంపెనీ తాజాగా త‌న మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Lava Agni 3ని దేశీయ మార్కెట్‌లోకి గ్రాండ్‌గా విడుద‌ల చేసింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌తో వ‌స్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 1.74-అంగుళాల AMOLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో పాటు కొన్ని స‌రికొత్త‌ ఫీచర్లకు యాక్సెస్‌ను ఇస్తోంది. Lava Agni 3.. MediaTek Dimensity 7300X ప్రాసెస‌ర్‌తోపాటు 8GB RAM, Android 14పై రన్ అవుతూ.. 66W వద్ద ఛార్జ్ చేయగల 5,000mAh బ్యాటరీ సామ‌ర్థ్యాన్ని కలిగి ఉంది
  • రూ. 30వేల లోపు ధ‌ర‌తో Lava Agni 3: ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ సుమిత్ సింగ్
    Lava కంపెనీ నుండి వ‌స్తోన్న‌ Agni సిరీస్ సరసమైన ధరల‌తో అత్యుత్తమైన‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను అందిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సిరీస్ మంచి పనితీరు, సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్‌లను అందించడం ద్వారా టెక్ ఔత్సాహికులతోపాటు మొబైల్ ప్రియుల‌ను ఆక‌ర్షిస్తోంది. ఈ సిరీస్ కొన‌సాగింపుగా Lava Agni 3 స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లోకి అక్టోబర్ 04న తీసుకువ‌చ్చేందుకు కంపెనీ స‌న్న‌ద్ధ‌మైంది. Lava ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ సుమిత్ సింగ్.. గాడ్జెట్స్ 360తో ప్రత్యేకమైన ఇంటరాక్షన్ సందర్భంగా Lava Agni 3 అధికారిక లాంచ్‌కు ముందు కొన్ని కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను వెల్ల‌డించారు
  • అక్టోబ‌ర్ 4న దేశీయ మార్కెట్‌లోకి Lava Agni 3 5G లాంచింగ్‌
    అక్టోబర్ మొదటి వారంలో దేశీయ మార్కెట్‌లోకి Lava Agni 3 5G అడుగుపెట్ట‌నున్న‌ట్లు X (గతంలో ట్విట్టర్) వేదిక‌గా కంపెనీ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఈ 5G ఫోన్‌కు సంబంధించిన డిజైన్, కెమెరా వివరాలను అధికారిక టీజ‌ర్లు వెల్లడిస్తున్నాయి. గ‌త సంవ‌త్స‌రం విడుద‌లైన Lava Agni 2 5G మాదిరిగానే ఈ కొత్త మోడ‌ల్ కూడా ఫీచ‌ర్స్‌ను క‌లిగి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. Lava నుంచి రాబోయే Agni 3 స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా సెటప్‌తో ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ రెండు రంగుల‌లో రానుంది. ఇది అమెజాన్ ద్వారా విక్రయించబడుతుందని కంపెనీ ధృవీకరించింది
ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »