త్వరలోనే భారత్‌లో Oppo K13 5G లాంఛ్.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలు
త్వరలోనే Oppo K13 5G హ్యాండ్‌సెట్ భారత్‌లో లాంఛ్ అవుతుందని నిర్ధారణయ్యింది. ఒక పత్రికా ప్రకటన ద్వారా Oppo కొత్త K సిరీస్ స్మార్ట్ ఫోన్ రాకను వెల్లడించింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మన దేశంలో అమ్మకానికి రానుంది. అంతేకాదు, Oppo K13 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది గత ఏడాది వచ్చిన Oppo K12కి కొనసాగింపుగా రానుంది. స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ అవ్వడంతోపాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీతో దీనిని రూపొందించారు