గ‌్లోబల్ మార్కెట్‌లో హవా చాటిన స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 15.. కౌంటర్ పాయింట్ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల హవా కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మొబైల్ మార్కెట్ Apple మరోసారి తన సత్తా చాటింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ నివేదికలో.. 2024 మూడవ త్రైమాసికానికి (క్యూ3) గ్లోబల్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్‌ల జాబితాలో Apple అగ్రస్థానంలో నిలిచింది. ఈ టెక్ దిగ్గజం దాని ఐఫోన్ 15 సిరీస్ నుండి పలు మోడల్స్‌ను విడుదల చేయడం ద్వారా మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే, Samsung కూడా ఈ జాబితాలో అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంది. Galaxy S సిరీస్‌తో మొదటిసారిగా 2018 నుండి టాప్ 10 ర్యాంకింగ్‌లలోకి అడుగుపెట్టింది. ఈ టాప్ 10 మోడల్స్‌లో నిలిచిన మొత్తం స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లోని 19 శాతం వాటాను పొందాయి