భారత్‌లో Samsung Galaxy S24 Ultra, Galaxy S24 Enterprise Editionలు లాంచ్.. ధర ఎంతంటే
భారత్‌లో Samsung కంపెనీ ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాతోపాటు గెలాక్సీ ఎస్24ను లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే ఉన్న ఒరిజినల్ గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 అల్ట్రాతో సమానమైన స్పెసిఫికేషన్‌లతో అందిస్తోంది. అయితే, Enterprise Edition మోడళ్లు ఎంటర్‌ప్రైజ్-ఫోకస్డ్ టూల్స్‌తో వస్తున్నాయి. అంతేకాదు, Galaxy AI ఫీచర్లను ఈ Galaxy S24, Galaxy S24 అల్ట్రా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ వెర్షన్‌లలో అందిస్తున్నారు. అలాగే, ఒక సంవత్సరం నాక్స్ సూట్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా కలిగి ఉంటాయి