గ‌్లోబల్ మార్కెట్‌లలోకి Xiaomi 15 అల్ట్రాతోపాటు Xiaomi 15.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi 15 Ultraను బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2025) ముందు గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 27న చైనాలో ఆవిష్కరించరించగా, స్టాండర్డ్, ప్రో మోడల్‌లను అక్టోబర్ 2024లో లాంఛ్ చేసింది. Xiaomi 15 సిరీస్‌లో 16GB వరకు RAMతో అటాచ్ చేయబడిన Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లకు LTPO AMOLED డిస్‌ప్లేలతోపాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో, సిలికాన్ కార్బన్ బ్యాటరీలను అందించారు.