స్పేస్ ఎక్స్ క్యాప్పూల్స్ ద్వారా భూమికి చేరుకోనున్న NASA వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న ఇద్దరు US వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ల విషయంలో NASA ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. మొదట ఎనిమిది రోజుల మిషన్ కోసం ఈ యాత్ర షెడ్యూల్ చేయబడింది. అయితే, బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా వారు తిరిగి రావడం ఆలస్యం అయింది. తాజాగా NASA చేసిన ప్రకటన ద్వారా ఆ ఇద్దరు వ్యోమగాములను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి స్పేస్ ఎక్స్ క్యాప్పూల్స్ ద్వారా తిరిగి భూమికి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇది అత్యంత సవాళ్లతో కూడుకున్న మిషన్ అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలను ధైర్యంగా ఎదుర్కొంటోన్న వారి ఆత్మస్థయిర్యాన్ని మెచ్చుకోవాలని కోరింది