టీవీఎస్ ఐక్యూబ్ 3.5 kWh బ్యాటరీ వేరియంట్‌పై అత్యధికంగా రూ. 9,000 పెంచారు. దీంతో దీని ప్రారంభ ధర రూ. 1.33 లక్షల నుంచి రూ. 1.42 లక్షలకు చేరింది.
TVS iQube
TVS Motor: దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో భారీ మార్కెట్ వాటా కలిగి ఉన్న ప్రముఖ సంస్థ టీవీఎస్ మోటార్ కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన ఐక్యూబ్, కొత్తగా వచ్చిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గడిచిన కొన్ని నెలలుగా టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్న సమయంలోనే కంపెనీ ఈ ధరల పెంపును వర్తింపజేయడం గమనార్హం.
టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్ల వారీగా పెరిగిన ధరల వివరాలు
మీడియా నివేదికల ప్రకారం.. టీవీఎస్ ఐక్యూబ్ 3.5 kWh బ్యాటరీ వేరియంట్‌పై అత్యధికంగా రూ. 9,000 పెంచారు. దీంతో దీని ప్రారంభ ధర రూ. 1.33 లక్షల నుంచి రూ. 1.42 లక్షలకు చేరింది.
ఇక మిగిలిన వేరియంట్ల వివరాలు చూస్తే
* 2.2 kWh బ్యాటరీ వేరియంట్: ఈ మోడల్‌పై రూ. 5,000 పెరగడంతో, కొత్త ధర రూ. 1.11 లక్షల నుంచి రూ. 1.16 లక్షలకు చేరింది.
* 4.7 kWh బ్యాటరీ వేరియంట్: దీనిపై రూ. 6,000 పెరగడంతో, ధర రూ. 1.55 లక్షల నుంచి రూ. 1.61 లక్షలకు పెరిగింది.
* ఐక్యూబ్ ST (5.3 kWh బ్యాటరీ - టాప్ రేంజ్): అత్యధిక రేంజ్ ఇచ్చే ఈ మోడల్‌పై రూ. 3,000 పెరగడంతో ధర రూ. 1.75 లక్షలకు చేరింది.
* అయితే, వినియోగదారులకు ఊరట కలిగించే విషయమేమిటంటే.. ఐక్యూబ్ 3.1 kWh బ్యాటరీ వేరియంట్ ధరలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు.
ఆర్బిటర్ మోడల్ ధరలు, బాస్ సేవలు
ఇటీవలే టీవీఎస్ ఐక్యూబ్ ఏకంగా 10 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది అగ్రస్థానంలో ఉంది. మరోవైపు టీవీఎస్ పోర్ట్‌ఫోలియోలోని ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను కూడా పెంచారు. ఆర్బిటర్ V1 మోడల్ ధర రూ. 3,700 పెరగ్గా, ఆర్బిటర్ V2 ధర రూ. 3,900 పెరిగింది. ఇటీవల కంపెనీ ఈ స్కూటర్ కోసం బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్‌ను కూడా తెచ్చింది. ఈ విధానం ద్వారా వాహనం ప్రారంభ ధర తగ్గుతుంది.. కానీ బ్యాటరీకి నెలవారీ రెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
Amazon Great Freedom Day Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ డే సేల్ ధమాకా.. ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ. 22,350 భారీ తగ్గింపు
ఈవి మార్కెట్లో టీవీఎస్ మోటార్ హవా
గత నెల ఎలక్ట్రిక్ టూ-వీలర్ విక్రయాల మార్కెట్లో టీవీఎస్ మోటార్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఒకే నెలలో ఏకంగా 52,538 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం భారతదేశ ఈవి టూ-వీలర్ మార్కెట్లో టీవీఎస్ సంస్థ దాదాపు 27.15 శాతం మార్కెట్ వాటాను ఆక్రమించింది. నెలవారీ ప్రాతిపదికన కంపెనీ సేల్స్ 10.8 శాతం మేర వృద్ధి చెందడం గమనార్హం.
ప్రకటన
ప్రకటన
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands
Samsung Galaxy S26 FE Design Revealed in Fresh Leak Ahead of Launch