భారత్‌లో బోట్ ఎయిర్‌డోప్స్ ప్రొక్లిప్ ధరను కంపెనీ కేవలం రూ.1,599 గానే నిర్ణయించింది.
Photo Credit: boAt
boAt
boAt : భారతదేశపు ప్రముఖ ఆడియో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ boAt తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ సరికొత్త ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) హెడ్‌సెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బోట్ ఎయిర్‌డోప్స్ ప్రొక్లిప్ పేరుతో విడుదలైన ఈ ఇయర్‌ఫోన్స్ అదిరిపోయే డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. చెవులకు సౌకర్యవంతంగా ఉండేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సరికొత్త ఏఐ టెక్నాలజీతో కూడిన ఈ ఇయర్‌ఫోన్స్ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే బడ్జెట్ ధరలోనే లభిస్తోంది.
భారత్‌లో బోట్ ఎయిర్‌డోప్స్ ప్రొక్లిప్ ధరను కంపెనీ కేవలం రూ.1,599 గానే నిర్ణయించింది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్న ఈ ఇయర్‌ఫోన్స్ గ్రే, వైట్, వైన్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ సరికొత్త ఇయర్‌ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు బోట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశవ్యాప్తంగా సొంతం చేసుకోవచ్చు.
ఈ సరికొత్త బోట్ ఎయిర్‌డోప్స్ ప్రొక్లిప్ ఓపెన్-ఇయర్ ఎర్గోనామిక్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనికి ఉన్న మెటాలిక్ క్లిప్-ఆన్ ఫీచర్ వల్ల ప్రయాణాల్లో లేదా జిమ్‌లో వర్కౌట్స్ చేసేటప్పుడు ఇయర్‌ఫోన్స్ చెవుల నుండి అస్సలు జారిపడవు. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే.. ప్రతి బడ్‌లోనూ 12mm డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. దీనివల్ల బేస్, క్లారిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇయర్‌ఫోన్స్‌కు IPX4 రేటింగ్ ఉంది, అంటే ఇది చెమట, నీటి తుంపర్ల నుంచి సులభంగా రక్షణ పొందుతుంది.
కనెక్టివిటీ కోసం ఈ సరికొత్త ఇయర్‌బడ్స్‌లో అత్యాధునిక బ్లూటూత్ 6.0 టెక్నాలజీని అందించారు. దీనివల్ల స్మార్ట్‌ఫోన్‌కు చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది. ఇందులో ఉన్న అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ మల్టీపాయింట్ కనెక్టివిటీ. దీని సహాయంతో యూజర్లు ఒకే సమయంలో ఇయర్‌ఫోన్స్‌ను రెండు వేర్వేరు డివైజ్‌లకు (ఉదాహరణకు ఫోన్, ల్యాప్‌టాప్) పెయిర్ చేసుకోవచ్చు. గేమ్స్ ఆడేవారి కోసం ఇందులో బీస్ట్ మోడ్‌ను ఇచ్చారు, ఇది కేవలం 55ms లో-లేటెన్సీని అందిస్తూ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది.
Apple : ఆపిల్ ప్రియులకు భారీ షాక్.. త్వరలోనే ఐఫోన్, ఐప్యాడ్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం
ఈ బోట్ ఎయిర్‌డోప్స్ ప్రొక్లిప్ ఇయర్‌బడ్స్ బోట్ హియరబుల్స్ యాప్‌కు సపోర్ట్ చేస్తాయి. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఈ యాప్ ఓపెన్ చేసి ఇయర్‌ఫోన్స్ సెట్టింగ్స్‌ను మేనేజ్ చేయవచ్చు. వాయిస్ కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వచ్చే గోల ఏమీ వినపడకుండా ఉండేందుకు ఇందులో ఏఐ-పవర్డ్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) టెక్నాలజీని వాడారు. దీనితో పాటు కంపెనీ ఇందులో సోనిక్ సీల్ టెక్నాలజీని కూడా ఉపయోగించింది. దీనివల్ల ఇయర్‌బడ్స్ నుంచి ఆడియో బయటకు లీక్ కాకుండా కేవలం మీ చెవులకే స్పష్టంగా వినబడుతుంది.
బ్యాటరీ పరంగా బోట్ ఎయిర్‌డోప్స్ ప్రొక్లిప్ ఒక పవర్‌హౌస్ అని చెప్పవచ్చు. దీని ఓవల్ షేప్ చార్జింగ్ కేస్‌లో 500mAh బ్యాటరీ ఉండగా, ప్రతి ఇయర్‌బడ్‌లో 50mAh బ్యాటరీని అమర్చారు. 60 శాతం వాల్యూమ్ వద్ద ప్లే చేసినప్పుడు కేస్‌తో కలిపి ఇది ఏకంగా 52 గంటల టోటల్ ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఇయర్‌బడ్స్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 50 నిమిషాలు పడుతుంది, కేస్ చార్జ్ అవ్వడానికి 2 గంటల సమయం పడుతుంది. ఇందులో బోట్ సంస్థకు చెందిన ASAP Charge టెక్నాలజీ ఉంది. దీనివల్ల కేవలం 10 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే చాలు.. ఏకంగా 200 నిమిషాల (3 గంటల కంటే ఎక్కువ) ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Reddit to Require Users to Log in to Browse Platform, Testing to Begin Soon
Samsung Galaxy Fit 4 Features Allegedly Revealed Through Companion App Teardown