ఫీచర్ల పరంగా ఒప్పో ఎన్‌కో ఎయిర్ 5 ఇయర్‌బడ్స్ చాలా బలంగా ఉన్నాయి.
Photo Credit: Oppo
Enco Air 5
Oppo Enco Air 5 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్, ఆడియో యాక్సెసరీస్ తయారీ సంస్థ ఒప్పో భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఒప్పో ఎన్‌కో ఎయిర్ 5 పేరుతో విడుదలైన ఈ ఇయర్‌బడ్స్ తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నాయి. మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఇందులో పవర్‌ఫుల్ సౌండ్ టెక్నాలజీని ఉపయోగించారు. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, కంపెనీ వీటిని మిడ్‌నైట్ బ్లాక్, లావెండర్ పర్పుల్ వంటి రెండు ఆకర్షణీయమైన రంగులలో ప్రవేశపెట్టింది. ఈ ఇయర్‌బడ్స్ ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కస్టమర్లకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లో దీని ధరను కంపెనీ కేవలం రూ.3,200 గా నిర్ణయించింది.
ఫీచర్ల పరంగా ఒప్పో ఎన్‌కో ఎయిర్ 5 ఇయర్‌బడ్స్ చాలా బలంగా ఉన్నాయి. మ్యూజిక్ వినేటప్పుడు స్పష్టమైన, లౌడ్ సౌండ్ అందించడం కోసం ఇందులో 12mm డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. వినియోగదారులు తమకు నచ్చినట్లుగా ఆడియో సెట్టింగ్స్ మార్చుకునేందుకు వీలుగా 10-బ్యాండ్ కస్టమ్ ఈక్యూ సెట్టింగ్స్ ఫీచర్ కూడా ఉంది. వీటితో పాటు ఏఏసీ, ఎస్‌బీసీ ఆడియో కోడెక్స్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే, ఇందులో 52dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) టెక్నాలజీ ఉంది. ఇది చుట్టుపక్కల ఉండే అనవసరపు శబ్దాలను నియంత్రించి 5000Hz వరకు హై-ఫ్రీక్వెన్సీని కవర్ చేస్తుంది. ఫోన్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు అవతలి వారికి స్పష్టమైన వాయిస్ వెళ్లేందుకు ఇందులో ట్రిపుల్ మైక్రోఫోన్ సెటప్‌ను ఇచ్చారు.
iPhone 17 : ఆపిల్ సంచలన నిర్ణయం.. ఐఫోన్ 17 సిరీస్ ఉత్పత్తిని భారీగా తగ్గించనున్న టెక్ దిగ్గజం
బ్యాటరీ లైఫ్ విషయంలో ఈ ఇయర్‌బడ్స్ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. కేవలం ఇయర్‌బడ్స్ మాత్రమే వాడుకుంటే సింగిల్ ఛార్జ్‌పై 13 గంటల వరకు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ లభిస్తుంది. అదే చార్జింగ్ కేస్‌తో కలిపి ఉపయోగిస్తే ఏకంగా 54 గంటల వరకు సుదీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్ అందుతుందని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇందులో క్విక్ ఛార్జ్ ఫీచర్ కూడా ఉంది. అత్యవసర సమయాల్లో ఈ ఇయర్‌బడ్స్‌ను కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, ఏకంగా 11 గంటల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. దీనివల్ల లాంగ్ ట్రావెలింగ్ చేసే వారికి బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ అస్సలు ఉండదు.
కనెక్టివిటీ పరంగా ఈ డివైజ్‌లో సరికొత్త బ్లూటూత్ 6.1 వెర్షన్‌ను అందించారు. దీనివల్ల స్మార్ట్‌ఫోన్‌కు చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది. గేమింగ్ ఆడేవారి కోసం ఇందులో 47ms లో-లేటెన్సీ మోడ్ ఉంది, దీనివల్ల గేమ్ ఆడేటప్పుడు ఆడియో లాగ్ లేకుండా సౌండ్ వినిపిస్తుంది. ఇక డిజైన్ పరంగా చాలా తేలికగా ఉండే ఈ ఇయర్‌బడ్స్‌లో ప్రతి ఒక్క బడ్ బరువు కేవలం 4.3 గ్రాములు మాత్రమే ఉంటుంది. చెవుల్లో పెట్టుకున్నప్పుడు ఎలాంటి నొప్పి లేకుండా చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. వర్షంలో తడిసినా లేదా జిమ్‌లో వర్కవుట్ చేసేటప్పుడు వచ్చే చెమట వల్ల పాడవకుండా ఉండేందుకు వీటికి ఐపీ55 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్ ఇచ్చారు. అలాగే ఒప్పో ఫోన్లు (ColorOS 12.0 అంతకంటే ఎక్కువ వెర్షన్) వాడేవారి కోసం ఇందులో ప్రత్యేకంగా అలైవ్ ఆడియో అనే స్పెషల్ ఫీచర్ కూడా లభిస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999