ఇందులో సౌండ్ బై బోస్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల యూజర్లు నెక్స్ట్ లెవెల్ ప్రీమియం ఆడియో క్వాలిటీని ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.
Photo Credit: Skullcandy
Skullcandy Method 360 ANC
Skullcandy : ప్రముఖ అంతర్జాతీయ ఆడియో పరికరాల తయారీ సంస్థ స్కల్‌క్యాండీ, భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త ప్రీమియం ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ స్కల్‌క్యాండీ మెథడ్ 360 ANCను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడియో రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బోస్ సంస్థ భాగస్వామ్యంతో స్కల్‌క్యాండీ ఈ సరికొత్త ఇయర్‌బడ్స్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఇందులో సౌండ్ బై బోస్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల యూజర్లు నెక్స్ట్ లెవెల్ ప్రీమియం ఆడియో క్వాలిటీని ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. లగ్జరీ సౌండ్, అద్భుతమైన ఫీచర్లు కోరుకునే టెక్ ప్రియులను టార్గెట్ చేస్తూ ఈ బడ్స్‌ను మార్కెట్లోకి తెచ్చారు.
ధర విషయానికి వస్తే.. ఈ ప్రీమియం ఇయర్‌బడ్స్ అసలు ధర రూ.16,999గా ఉంది. అయితే, సరికొత్త లాంచ్ ఆఫర్ కింద కస్టమర్లకు భారీ డిస్కౌంట్ అందిస్తూ కేవలం రూ.12,499 ప్రారంభ ధరకే వీటిని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సరికొత్త బడ్స్ స్కల్‌క్యాండీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలోనూ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వీటిని బ్లాక్, బోన్, ప్రైమర్, ప్లాస్మా, లెపర్డ్ అనే ఐదు విభిన్నమైన మరియు స్టైలిష్ కలర్ ఆప్షన్లలో విక్రయిస్తున్నారు.
ఈ ఇయర్‌బడ్స్‌లోని ప్రధాన హైలైట్ ఏంటంటే.. ఇందులో హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను అందించారు. దీని సహాయంతో యూజర్లు బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా రైడింగ్‌లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వచ్చే ఎలాంటి శబ్దాలు వినపడకుండా ప్రశాంతంగా మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు, ఈ ఏఎన్‌సీని యూజర్లు తమ అవసరానికి తగినట్లుగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. దీనితో పాటు స్టే-అవేర్ మోడ్‌ను కూడా ఇచ్చారు. దీనివల్ల ఇయర్‌బడ్స్ పెట్టుకున్నప్పటికీ, అవసరమైనప్పుడు చుట్టుపక్కల వారు మాట్లాడే మాటలను లేదా వాహనాల హారన్ శబ్దాలను స్పష్టంగా వినడానికి వీలవుతుంది.
బ్యాటరీ పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ బడ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి ఉంచినప్పుడు, ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ కేస్ కలిపి ఏకంగా 40 గంటల వరకు సుదీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. ఒకవేళ ఏఎన్‌సీ ఆన్ చేసి వాడితే, మొత్తం 32 గంటల పాటు నిరంతరాయంగా రన్ అవుతాయి. ఇందులో అమర్చిన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మరో అదనపు ఆకర్షణ. కేవలం 10 నిమిషాల పాటు చిన్న ఛార్జ్ ఇస్తే చాలు, సుమారు 2 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ వస్తుందని కంపెనీ గట్టిగా క్లెయిమ్ చేస్తోంది.
Instagram : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్.. మీ అనుమతి లేకుండానే మీ ఫోటోలతో AI ఇమేజ్ జనరేషన్
డిజైన్ పరంగా స్కల్‌క్యాండీ ఇందులో ఒక కొత్త ప్రయోగం చేసింది. ఈ బడ్స్ కోసం ఇన్‌బిల్ట్ ఓ-రింగ్ క్లిప్‌తో కూడిన సరికొత్త స్లైడర్ ఛార్జింగ్ కేస్ను పరిచయం చేసింది. చెవుల్లో పర్ఫెక్ట్‌గా అమరడం కోసం బోస్ లైసెన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన వివిధ సైజుల ఫిట్ ఫిన్స్, ఇయర్ జెల్స్‌ను కూడా బాక్స్‌తో పాటు ఇస్తున్నారు. దీనివల్ల చెవుల నుంచి బడ్స్ జారిపోకుండా ఉండటమే కాకుండా సౌండ్ ఐసోలేషన్ అద్భుతంగా ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్‌ను స్కల్-ఐక్యూ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. యాప్‌ని ఉపయోగించి యూజర్లు ఈక్వలైజర్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు, బటన్ కంట్రోల్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు.
కాలింగ్ విషయానికి వస్తే, ఇందులో క్లియర్ వాయిస్ స్మార్ట్ మైక్‌ను అమర్చారు. ఇది ఫోన్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లో వచ్చే అనవసరపు శబ్దాలను పూర్తిగా తగ్గించి, అవతలి వ్యక్తికి మీ వాయిస్ చాలా స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. ఇవి కాకుండా వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ కోసం IPX4 రేటింగ్, వీయర్ డిటెక్షన్, గేమింగ్ కోసం లో-లేటెన్సీ ఆడియో, గూగుల్ ఫాస్ట్ పేర్, స్పాటిఫై టాప్, బ్లూటూత్ 5.3, మల్టీపాయింట్ కనెక్టివిటీ వంటి ఎన్నో నెక్స్ట్ జనరేషన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999