Motorola : మార్కెట్లోకి మోటోరోలా మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

భారతదేశంలో మోటోరోలా రేజర్ ఫోల్డ్ ధరలు దాని స్టోరేజ్ వేరియంట్లను బట్టి ఉన్నాయి. 12GB రామ్ + 256GB స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర రూ.1,49,999 గా నిర్ణయించారు.

Motorola : మార్కెట్లోకి మోటోరోలా మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Motorola has launched the Razr Fold in two colour options

ముఖ్యాంశాలు
  • మోటోరోలా బ్రాండ్ నుంచి మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్
  • ఇండియాలోకి మోటోరోలా రేజర్ ఫోల్డ్ ప్రళయం
  • 8.1 ఇంచుల డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో మోటోరోలా మైండ్ బ్లోయింగ్ ఫోన్
ప్రకటన

Motorola : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మోటోరోలా సరికొత్త సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన బ్రాండ్ చరిత్రలోనే మొట్టమొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ మోటోరోలా రేజర్ ఫోల్డ్‎ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే సందడి చేసిన ఈ ప్రీమియం ఫోన్‌ను ఇప్పుడు ఇండియాలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇప్పించింది. అదిరిపోయే ప్రాసెసర్, భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ధర, లాంచ్ ఆఫర్లు, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో మోటోరోలా రేజర్ ఫోల్డ్ ధరలు దాని స్టోరేజ్ వేరియంట్లను బట్టి ఉన్నాయి. 12GB రామ్ + 256GB స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర రూ.1,49,999 గా నిర్ణయించారు. అలాగే 16GB రామ్ + 512GB స్టోరేజ్ టాప్ వెర్షన్ ధర రూ.1,59,999 గా ఉంది. వీటితో పాటు స్పెషల్ గా ఫిఫా వరల్డ్ కప్ 26 కలెక్షన్ ఎడిషన్‌ను కూడా మోటోరోలా పరిచయం చేసింది, దీని ధర రూ.1,69,999. ఈ ఫోన్ పాంటోన్ బ్లాకెన్డ్ బ్లూ, పాంటోన్ లిల్లీ వైట్ అనే రెండు రాయల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

రూ.10,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ 
ఈ ఖరీదైన ఫోన్‌ను కస్టమర్లకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు మోటోరోలా క్రేజీ లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ కార్డుల ద్వారా నేరుగా రూ.10,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా అంతే మొత్తంలో ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీనితో పాటు ప్రముఖ బ్యాంకులతో 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. జూన్ 20 లోపు ఈ ఫోన్ కొనేవారికి ఒక సంవత్సరం లోపు ఒకసారి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ చేసే బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రీటైల్ స్టోర్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు.

జియో యూజర్లకు అదనపు బెనిఫిట్స్ 
మీరు గనుక జియో సిమ్ వాడుతుంటే, ఈ ఫోన్ కొన్నాక రూ.449 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అదిరిపోయే లాభాలు ఉంటాయి. ఇందులో భాగంగా 3 నెలల పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కింద ఏకంగా 5,000GB క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ ఇస్తున్నారు. దీనితో పాటు తీరా, అజియో, ఈజ్ మై ట్రిప్ వంటి పాపులర్ బ్రాండ్ల నుంచి అదనపు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ వోచర్లు లభిస్తాయి.

థియేటర్ లాంటి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ 
డిస్‌ప్లే విషయానికి వస్తే ఈ ఫోన్ లో రెండు అద్భుతమైన స్క్రీన్లను అమర్చారు. ఫోన్ మూసి ఉన్నప్పుడు వాడుకోవడానికి బయట 6.6-ఇంచుల LTPO pOLED కవర్ డిస్‌ప్లే ఉంటుంది, ఇది 165Hz రీఫ్రెష్ రేట్, 6,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇక ఫోన్ ఓపెన్ చేస్తే లోపల ఏకంగా 8.1-ఇంచుల భారీ 2K LTPO pOLED మెయిన్ స్క్రీన్ దర్శనమిస్తుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 6,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, అల్ట్రా థిన్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. సినిమా ప్రియులకు, గేమర్లకు ఈ స్క్రీన్లు నెక్స్ట్ లెవెల్ అనుభూతిని ఇస్తాయి.

Motorola : మోటోరోలా మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ లేటుగా ఎంట్రీ ఇవ్వడం వెనుక అసలు స్కెచ్ ఏంటి?

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్.. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ 
ఈ ఫోల్డబుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మై యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనికి ఏకంగా 7 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రామిస్ చేసింది. కారు వేగంతో పనిచేయడం కోసం ఇందులో క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 పవర్‌ఫుల్ చిప్‌సెట్‌ను అమర్చారు. దీనికి తోడు Adreno A829 జీపీయూ, 16GB వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ రామ్, 512GB వరకు అల్ట్రా ఫాస్ట్ యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ తోడవ్వడంతో మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది.

కెమెరాలో తగ్గేదే లే.. 50MP ట్రిపుల్ రియర్ సెటప్ 
ఫోటోగ్రఫీ కోసం మోటోరోలా రేజర్ ఫోల్డ్ లో వెనుక వైపు మూడు పవర్‌ఫుల్ కెమెరాలను ఇచ్చారు. అందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (Sony LYTIA సెన్సార్), 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, మరొక 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. ఈ రియర్ కెమెరాల ద్వారా 8K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఇక సెల్ఫీల విషయానికి వస్తే, కవర్ స్క్రీన్ పై 32 మెగాపిక్సెల్ కెమెరా మరియు లోపలి మెయిన్ స్క్రీన్ పై 20 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.

భారీ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 
సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది, కానీ మోటోరోలా ఇందులో ఏకంగా 6,000mAh భారీ బ్యాటరీని ప్యాక్ చేసింది. దీనికి తోడు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, వై-ఫై 7, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP49 రేటింగ్‌ను కలిగి ఉంది. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు కేవలం 4.7mm మందం, క్లోజ్ చేసినప్పుడు 10.04mm మందంతో 243 గ్రాముల బరువు ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Vivo X300 E : వివో నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. జీస్ కెమెరాతో వివో X300 E రాక
  2. Portronics Pure Sound Pro X2 Launch: ఇంటికే థియేటర్ అనుభూతి.. భారత్‌లో 'పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2' లాంచ్!
  3. Samsung Galaxy Unpacked Event: జూలై 22న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్.. కొత్త ఫోల్డబుల్ ఫోన్లు సిద్ధం
  4. Donald Trump Media: ట్రంప్ ట్వీట్ ముందే కావాలా? నెలకు రూ. 85 లక్షలు కట్టాల్సిందే
  5. Oppo A7 Pro Max Features Leaked: మార్కెట్లోకి ఒప్పో A7 ప్రో మాక్స్ ఎంట్రీ.. 10,000mAh బ్యాటరీతో సరికొత్త రికార్డు
  6. Moto Pad 70 Groove Set to Launch: జూలై 31న భారత్‌లోకి మోటో ప్యాడ్ 70 గ్రూవ్ ఎంట్రీ.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
  7. iPhone 15 Price cut: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 పై భారీ ఆఫర్.. ఏకంగా రూ.26,000 పైగా డిస్కౌంట్
  8. Realme C100X Comparison: మార్కెట్లోకి రియల్‌మీ C100x లాంచ్.. రెడ్‌మీ, శామ్‌సంగ్ బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ
  9. Xiaomi Smart Solar Camera 4 Pro: కరెంట్, వైఫైతో పనిలేదు.. సోలార్ ఎనర్జీతో పనిచేసే షావోమీ సరికొత్త స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా
  10. Nokia 300 4G Power Bank Phone: ఇది బటన్ ఫోన్ కాదు సామీ.. ఇతర గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసే చిన్నపాటి పవర్ ప్లాంట్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »