Nokia 300 4G Power Bank : ఇది బటన్ ఫోన్ కాదు సామీ.. ఇతర గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసే చిన్నపాటి పవర్ ప్లాంట్

ఈ ఫోన్ ప్రధాన ప్రత్యేకత దీని రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఆప్షన్. దీనికోసం ఫోన్ బాడీపై ప్రత్యేకంగా ఒక బటన్‌ను అందించారు

Nokia 300 4G Power Bank : ఇది బటన్ ఫోన్ కాదు సామీ.. ఇతర గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసే చిన్నపాటి పవర్ ప్లాంట్

Photo Credit: X/@smashx_60

Nokia 300 Power Bank

ముఖ్యాంశాలు
  • ఫోనే పవర్ బ్యాంక్‌లా మారే వినూత్న ఫీచర్
  • ఐఫోన్ 16 ప్రో కంటే రెట్టింపు వెలుగు ఇచ్చే పవర్‌ఫుల్ టార్చ్ లైట్
  • ఏకంగా 45 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో సరికొత్త రికార్డ్!
ప్రకటన

Nokia 300 4G Power Bank : స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తున్న నేటి కాలంలోనూ తమదైన రఫ్ అండ్ టఫ్ మోడళ్లతో ఆకట్టుకునే నోకియా, మార్కెట్లోకి ఎంతో వినూత్నమైన ఫీచర్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. నోకియా 300 4G పవర్ బ్యాంక్ పేరుతో ఈ ఫోన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. పేరులో ఉన్నట్లే ఇది కేవలం సాధారణ కాల్స్ మాట్లాడే ఫోన్‌గా మాత్రమే కాకుండా, అత్యవసర సమయాల్లో వేరే గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసే పవర్ బ్యాంక్‌లా కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఆన్‌లైన్ లిస్టింగ్‌ల ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి.

ఫోనే పవర్ బ్యాంక్‌లా మారే వినూత్న ఫీచర్
ఈ ఫోన్ ప్రధాన ప్రత్యేకత దీని రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఆప్షన్. దీనికోసం ఫోన్ బాడీపై ప్రత్యేకంగా ఒక బటన్‌ను అందించారు. ఆ బటన్ ప్రెస్ చేయగానే ఈ ఫోన్ పవర్ బ్యాంక్‌లా మారిపోతుంది. 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మనం వాడే బ్లూటూత్ ఈయర్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు లేదా అత్యవసర సమయంలో ఇతర స్మార్ట్‌ఫోన్లకు కూడా దీని నుంచి ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు. లాంగ్ ట్రైన్స్, క్యాంపింగ్, అవుట్‌డోర్ ట్రిప్స్‌కి వెళ్లేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ బ్యాకప్ డివైజ్‌గా ఉపయోగపడుతుంది.

 ఏకంగా 45 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో సరికొత్త రికార్డ్ 
సాధారణంగా ఫీచర్ ఫోన్లలో 1000mAh లేదా 1500mAh బ్యాటరీలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ నోకియా 300 మోడల్‌లో ఏకంగా 3700mAh సామర్థ్యం గల భారీ జంబో బ్యాటరీని అమర్చారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది ఏకంగా 45 రోజుల పాటు స్టాండ్‌బై టైమ్‌ను, 26 గంటల సుదీర్ఘ టాక్‌టైమ్‌ను ఇస్తుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

నోకియా మైండ్ బ్లాకింగ్ దాడి 
ఈ ఫోన్‎లో మరొక క్రేజీ ఫీచర్ దీని హై ఇంటెన్సిటీ టార్చ్ లైట్. సాధారణ ఫీచర్ ఫోన్‌తో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువ వెలుగునిస్తుందని, ప్రసిద్ధ ఐఫోన్ 16 ప్రో ఫ్లాష్ లైట్ కంటే కూడా ఏకంగా రెట్టింపు ప్రకాశవంతంగా వెలుగుతుందని నోకియా పెద్ద దావా వేసింది. ఈ టార్చ్ లైట్‌ను వరుసగా 23 గంటల పాటు నిరంతరాయంగా వెలిగించినా బ్యాటరీ సరిపోతుందని కంపెనీ వెల్లడించింది.


Honor Robot Phone : మార్కెట్లో హల్‌చల్ చేయనున్న హానర్ రొబోటిక్ ఫోన్.. చైనాలో ప్రీ-ఆర్డర్లు షురూ

రఫ్ అండ్ టఫ్ యూసేజ్ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్ 
ఫోన్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది చేతి నుంచి జారిపోకుండా గ్రిప్ ఇచ్చే యాంటీ స్లిప్ రగ్గడ్ బాడీతో డిజైన్ చేయబడింది. దుమ్ము, ధూళి, నీటి చినుకుల నుంచి రక్షణ పొందేందుకు IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను అందించారు. ఇందులో 2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే, వెనుక వైపు 0.3 మెగాపిక్సెల్ కెమెరా, పాటల కోసం 32GB వరకు పెంచుకోగలిగే మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్ లభిస్తాయి. అదనంగా ఎఫ్‌ఎమ్ రేడియో, బ్లూటూత్, 3.5mm ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 4G VoLTE కనెక్టివిటీ ఉన్నాయి.

ఫిలిప్పీన్స్ మార్కెట్లో ప్రీ-ఆర్డర్లు షురూ
నోకియా 300 4G పవర్ బ్యాంక్ ఫోన్‌ను కంపెనీ ప్రస్తుతం ఫిలిప్పీన్స్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అక్కడ దీని ధర PHP 1,990 (భారత కరెన్సీలో దాదాపు రూ.2,700 నుంచి రూ.3,000 మధ్య) గా నిర్ణయించారు. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ షోపీ ద్వారా దీనిని ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, గోల్డ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర ఆసియా దేశాల్లో కూడా ఇది లాంచ్ కానుంది.
 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Portronics Pure Sound Pro X2 : ఇంటికే థియేటర్ అనుభూతి.. భారత్‌లో 'పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2' లాంచ్!
  2. Samsung : జూలై 22న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్.. కొత్త ఫోల్డబుల్ ఫోన్లు సిద్ధం
  3. Truth Social : ట్రంప్ ట్వీట్ ముందే కావాలా? నెలకు రూ. 85 లక్షలు కట్టాల్సిందే
  4. Oppo A7 Pro Max : మార్కెట్లోకి ఒప్పో A7 ప్రో మాక్స్ ఎంట్రీ.. 10,000mAh బ్యాటరీతో సరికొత్త రికార్డు
  5. Motorola : జూలై 31న భారత్‌లోకి మోటో ప్యాడ్ 70 గ్రూవ్ ఎంట్రీ.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
  6. iPhone 15 : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 పై భారీ ఆఫర్.. ఏకంగా రూ.26,000 పైగా డిస్కౌంట్
  7. Smartphone Comparison : మార్కెట్లోకి రియల్‌మీ C100x లాంచ్.. రెడ్‌మీ, శామ్‌సంగ్ బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ
  8. Xiaomi Camera : కరెంట్, వైఫైతో పనిలేదు.. సోలార్ ఎనర్జీతో పనిచేసే షావోమీ సరికొత్త స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా
  9. Nokia 300 4G Power Bank : ఇది బటన్ ఫోన్ కాదు సామీ.. ఇతర గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసే చిన్నపాటి పవర్ ప్లాంట్
  10. Infinix Note 60 Pro : లుక్‌తో పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్.. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో రెండు కొత్త రంగుల్లో లాంచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »