Amazon Great Summer Sale 2026 : ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు.. అమెజాన్లో రూ.40 వేల ఎస్‌ఎస్‌డీ కేవలం రూ.15 వేలకే

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 మే 8వ తేదీ నుంచే ప్రారంభమైన ఈ సేల్‌లో శామ్‌సంగ్, శాన్‌డిస్క్, వెస్ట్రన్ డిజిటల్ వంటి టాప్ బ్రాండ్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Amazon Great Summer Sale 2026 : ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు.. అమెజాన్లో రూ.40 వేల ఎస్‌ఎస్‌డీ కేవలం రూ.15 వేలకే

Photo Credit: Unsplash/Samsung Memory

The Amazon Great Summer Sale offers discounted SSDs from SanDisk, Samsung, EVM, and more

ముఖ్యాంశాలు
  • ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ సేల్ మే 8న ప్రారంభమైంది.
  • HDFC బ్యాంక్ కార్డుదారులు అదనంగా మరో 10 % తగ్గింపును పొందవచ్చు.
  • ప్రైమ్ సభ్యులు తమ కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లను కూడా పొందవచ్చు.
ప్రకటన

Amazon Great Summer Sale 2026 : మీ కంప్యూటర్ లేదా లాప్ ట్యాప్ స్లోగా ఉందా? డేటా స్టోరేజ్ కోసం మంచి ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్ వెతుకుతున్నారా? అయితే మీకు ఇదే బెస్ట్ టైం. ప్రస్తుతం మార్కెట్‌లో మెమరీ చిప్స్ కొరత వల్ల ఎస్‌ఎస్‌డీ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతేడాదితో పోలిస్తే 256GB, 512GB డ్రైవ్‌ల ధరలు రెండు మూడు రెట్లు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 టెక్ ప్రియులకు పెద్ద ఊరటనిస్తోంది. మే 8వ తేదీ నుంచే ప్రారంభమైన ఈ సేల్‌లో శామ్‌సంగ్, శాన్‌డిస్క్, వెస్ట్రన్ డిజిటల్ వంటి టాప్ బ్రాండ్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ సేల్‌లో ముఖ్యంగా 1TB స్టోరేజ్ సామర్థ్యం ఉన్న ఎస్‌ఎస్‌డీలపై భారీగా ధరలు తగ్గాయి. ఒకప్పుడు రూ.20 వేల పైచిలుకు ఉన్న శాన్‌డిస్క్ 1TB డ్రైవ్ ఇప్పుడు కేవలం రూ.14,999కే లభిస్తోంది. అలాగే గేమర్లు ఎక్కువగా ఇష్టపడే క్రూషియల్ P310 (1TB) పై ఏకంగా 60 శాతానికి పైగా డిస్కౌంట్ లభిస్తోంది. రూ.40,000 ఎంఆర్‌పీ ఉన్న ఈ ప్రొడక్ట్ ఆఫర్‌లో కేవలం రూ.15,299కే దొరుకుతుండటం విశేషం. ఇక రఫ్ అండ్ టఫ్ వాడకానికి పేరుగాంచిన శామ్‌సంగ్ T7 షీల్డ్ మోడల్ రూ.21,499 వద్ద అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో కావాలనుకునే వారి కోసం ఈవీఎం  ఎలైట్ ప్రో మోడల్ రూ.13,999కే లభిస్తోంది.

డైరెక్ట్ డిస్కౌంట్లే కాకుండా అదనపు తగ్గింపు పొందాలనుకునే వారికి అమెజాన్ మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులను ఉపయోగించే వారికి 10 శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీని ద్వారా గరిష్టంగా రూ.9,500 వరకు ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే మీకు మరిన్ని ఎక్స్‌క్లూజివ్ కూపన్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు దొరుకుతాయి. మెమరీ కొరత నేపథ్యంలో భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, స్టోరేజ్ డ్రైవ్‌లు కొనాలనుకునే వారు ఈ సమ్మర్ సేల్‌ను సద్వినియోగం చేసుకోవడం మంచిది.

చాలామంది ఇప్పటికీ పాత కాలపు హెచ్‌డీడీలనే వాడుతుంటారు. కానీ ఎస్‌ఎస్‌డీలు వాటికంటే పది రెట్లు వేగంగా పనిచేస్తాయి. మీరు బరువైన ఫైల్స్ కాపీ చేసినా, గేమింగ్ ఆడినా ఎస్‌ఎస్‌డీలు అద్భుతమైన స్పీడ్ అందిస్తాయి. అందుకే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు, వీడియో ఎడిటర్లు ఎక్కువగా వీటినే వాడుతుంటారు. అమెజాన్ సేల్‌లో వెస్ట్రన్ డిజిటల్ 1TB డ్రైవ్ రూ.16,999కే దొరుకుతుండటంతో వినియోగదారులు వీటిని కొనేందుకు ఎగబడుతున్నారు. స్టాక్ అయిపోకముందే మీకు నచ్చిన మోడల్‌ను బుక్ చేసుకోవడం ఉత్తమం.
 

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్: SSDలపై భారీ తగ్గింపు

Model List Price Effective Sale Price Buying Link
SanDisk (1TB) Rs. 20,800 Rs. 14,999 Buy Here
Samsung T7 Shield (1TB) Rs. 28,449 Rs. 21,499 Buy Here
SanDisk Extreme (1TB) Rs. 21,700 Rs. 19,999 Buy Here
EVM Elite EnSave Pro (1TB) Rs. 22,999 Rs. 13,999 Buy Here
Western Digital (1TB) Rs. 21,000 Rs. 16,999 Buy Here
Crucial P310 (1TB) Rs. 40,000 Rs. 15,299 Buy Here
#తాజా కథనాలు
  1. Credit Card : మీ ఏటీఎం, క్రెడిట్ కార్డ్ పోయిందా..? అయితే వెంటనే ఈ పని చేయండి
  2. OTT : ఓటీటీలోకి వచ్చేసిన మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫేసెస్..ఎక్కడ చూడాలో తెలుసా?
  3. Vivo S60 : ఐఫోన్ల కంటే పవర్‌ఫుల్ ఫీచర్లు.. ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీతో వివో S60 సిరీస్ లాంచ్
  4. Motorola Edge 70 Pro+ : రిలీజ్ కాకముందే సెన్సేషన్.. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ అఫీషియల్ ఫీచర్లు ఇవే
  5. Smartphones : మొబైల్ మార్కెట్లో మే నెలాఖరు ధమాకా... ఇండియాలో లాంచైన టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
  6. Wi-Fi Router : బఫరింగ్‌కు బై-బై చెప్పేయండి.. ఇంట్లో వైఫై స్పీడ్ పెంచే బెస్ట్ రూటర్లు ఇవే..!
  7. Xiaomi 17T : ఐఫోన్‌లకే చెమటలు పట్టించేలా షావోమి ప్లాన్.. 7,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్
  8. Motorola : జూన్ 4న మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ గ్రాండ్ ఎంట్రీ.. లీకైన మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు!
  9. Meta Subscribed : ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ఇకపై ఫ్రీగా వాడుకునే రోజులు ఖతం.. బాదుడు షురూ!
  10. Airtel : ఇక నో సిగ్నల్ టెన్షన్..ఇండియాలోనే మొదటిసారి ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »