నీలేష్ ఈకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఫేసెస్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ కైవసం చేసుకుంది.
Photo Credit: Sun NXT
This film is now available to stream exclusively on Sun NXT.
OTT : మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. కథలో ఉండే సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేయడంలో మాలీవుడ్ డైరెక్టర్లు ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా అలాంటి కేటగిరీలోనే వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మోస్ట్ అవేటెడ్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఫేసెస్ ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్స్ పైకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకులను, సినీ విమర్శకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా.. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీలో ఏకంగా 8.9/10 మైండ్ బ్లాకింగ్ రేటింగ్‌ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. థియేటర్లలో మిస్ అయిన సినిమా లవర్స్ కోసం ఈ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది.
నీలేష్ ఈకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఫేసెస్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ కైవసం చేసుకుంది. ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్ అఫీషియల్ యాప్, వెబ్‌సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సూపర్ హిట్ సైకలాజికల్ డ్రామాను ఆన్‌లైన్ లో వీక్షించాలనుకునే యూజర్లకు సన్ నెక్స్ట్ లో యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఉండటం తప్పనిసరి. థియేటర్లలో మార్చి 6, 2026 న గ్రాండ్‌గా విడుదలై రికార్డు రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌కు కూడా ఒక పర్ఫెక్ట్ వీకెండ్ విజువల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఈ సినిమా కథ అంతా నిత్య (హన్నా రెజీ కోశి) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. నిత్య, మైఖేల్ (కాలేష్ రామానంద్) అనే యువకుడు ఇద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటూ లైవ్-ఇన్ రిలేషన్‌షిప్(సహజీవనం)లో ఉంటారు. అంతా హ్యాపీగా సాగిపోతున్న సమయంలో వీరి జీవితంలో ఒక ఊహించని ప్రమాదం జరుగుతుంది. ఒక భయంకరమైన గ్యాస్ సిలిండర్ పేలుడులో నిత్య తీవ్రమైన మానసిక గాయానికి గురవుతుంది. ఈ ప్రమాదం కారణంగా ఆమె తలలో ఒక వింతైన, అత్యంత అరుదైన మెమరీ డిజార్డర్ మొదలవుతుంది. ఆ వ్యాధి వల్ల నిత్యకు ఒక వింత భ్రమ కలగడం స్టార్ట్ అవుతుంది.
Vivo S60 : ఐఫోన్ల కంటే పవర్‌ఫుల్ ఫీచర్లు.. ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీతో వివో S60 సిరీస్ లాంచ్
ఆ మానసిక వ్యాధి ముదిరిపోవడంతో నిత్యకు బయట ఏ మగాడు కనిపించినా, ఏ కొత్త వ్యక్తిని చూసినా.. వాళ్లందరి ముఖాలు సరిగ్గా తన ప్రియుడు మైఖేల్ లాగే కనిపిస్తుంటాయి. ఈ వింత పరిస్థితితో ఆమె తీవ్రమైన గందరగోళంలో పడిపోతుంది. ఈ క్రమంలోనే ఒకరోజు నిత్య జీవితంలో అసలైన భూకంపం వస్తుంది. ఆమెతో పాటు ఇంట్లోనే ఉంటున్న ఒరిజినల్ బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ అకస్మాత్తుగా మాయమైపోతాడు. అసలు మైఖేల్ ఎక్కడికి వెళ్లాడు? నిజంగానే మాయమయ్యాడా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? చుట్టూ ఉన్న మగాళ్లందరిలోనూ తన బాయ్‌ఫ్రెండ్ ముఖాన్ని చూస్తున్న నిత్య.. ఈ మిస్టరీని ఎలా ఛేదించింది? ఈ కథ వెనుక ఉన్న ఒక చీకటి కుట్ర ఏంటి? అనేదే ఈ సినిమా ముగింపు.
ఈ చిత్రానికి నీలేష్ ఈకేతో పాటు నౌఫల్ హుస్సేన్, ఫేబీ ఆంటోనీ కలిసి అద్భుతమైన స్క్రీన్‌ప్లే, కథను అందించారు. లీడ్ రోల్స్ లో హన్నా రెజీ కోశి, కాలేష్ రామానంద్ తమ నటనతో ప్రాణం పోశారు. ముఖ్యంగా మెమరీ డిజార్డర్ ఉన్న యువతిగా హన్నా నటన థియేటర్లలో అందరినీ ఏడిపించింది, భయపెట్టింది. వీరికి తోడు సపోర్టింగ్ కాస్ట్‌లో అర్జున్ గోపాల్, ఆర్‌జే విజిత, బిట్టో డేవిస్ వంటి ప్రతిభావంతులైన నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాకు మరో అతిపెద్ద ప్లస్ పాయింట్.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఆయన ఇచ్చిన బీజీఎమ్ ప్రతి సీన్ లోనూ ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. కొలిన్స్ జోస్ అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.
ప్రకటన
ప్రకటన
Activision to Shut Down Call of Duty: Warzone on PS4, Xbox One After Modern Warfare 4 Launch