Credit Card : మీ ఏటీఎం, క్రెడిట్ కార్డ్ పోయిందా..? అయితే వెంటనే ఈ పని చేయండి

పొరపాటున మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఎక్కడైనా పడిపోయినా లేదా దొంగతనానికి గురైనా.. క్షణాల వ్యవధిలో మీ జీవితకాల సంపాదన మాయమయ్యే ఛాన్స్ ఉంది.

Credit Card : మీ ఏటీఎం, క్రెడిట్ కార్డ్ పోయిందా..? అయితే వెంటనే ఈ పని చేయండి

Photo Credit: Unsplash/ rupixen

Here's how you can block your credit or debit card

ముఖ్యాంశాలు
  • మీ క్రెడిట్ కార్డ్ పోయిందా..? అయితే వెంటనే ఈ పని చేయండి
  • మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా నిమిషాల్లో కార్డ్ బ్లాక్
  • వెంటనే బ్లాక్ చేయకపోతే జైలు పాలయ్యే ప్రమాదం!
ప్రకటన


Credit Card : ప్రస్తుత డిజిటల్ యుగంలో జేబులో కరెన్సీ నోట్లు పెట్టుకుని తిరిగే రోజులకంటే.. చేతిలో డెబిట్, క్రెడిట్ కార్డులు పట్టుకుని తిరిగేందుకే జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుండటం, ఈ-కామర్స్ సైట్లు, షాపింగ్ మాల్స్‌లో ఈ కార్డులపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇస్తుండటంతో వీటి వాడకం విపరీతంగా పెరిగింది. ఎంత పెద్ద మొత్తంలోనైనా కేవలం ఒక్క స్వైపింగ్‌తో పేమెంట్స్ చేసే వీలుండటంతో నగదు మోసుకెళ్లే తలనొప్పి తప్పింది. అయితే, నాణేనికి రెండో వైపు ఉన్నట్టే.. ఈ కార్డుల వల్ల ఎంత సౌకర్యం ఉందో, అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది. పొరపాటున మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఎక్కడైనా పడిపోయినా లేదా దొంగతనానికి గురైనా.. క్షణాల వ్యవధిలో మీ జీవితకాల సంపాదన మాయమయ్యే ఛాన్స్ ఉంది. మరి అలాంటి ఆపద సమయంలో మీ అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే కార్డును ఎలా బ్లాక్ చేయాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కార్డు దొంగిలిస్తే ఏం జరుగుతుంది..?  
మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే వారు మీ అకౌంట్ లోని డబ్బులను గుంజడమే కాకుండా.. కార్డుపై ఉండే 16 అంకెల నంబర్, వెనుక ఉండే సీవీవీ (CVV) నంబర్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో అక్రమ కొనుగోళ్లు లేదా ఇల్లీగల్ వస్తువులను ఆర్డర్ చేసే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ ఏటీఎం పిన్ నంబర్ కూడా వాళ్లకు తెలిస్తే.. నేరుగా ఏటీఎం సెంటర్ల నుంచి క్యాష్ విత్‌డ్రా చేసేస్తారు. అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే.. దొంగిలించిన మీ కార్డుతో సైబర్ దొంగలు చేసే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్లన్నీ మీ పేరు మీదే బుక్ అవుతాయి. దీనివల్ల ఎలాంటి తప్పు చేయకపోయినా మీరు చట్టపరమైన ఇబ్బందుల్లో ఇరుక్కుని పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే కార్డ్ పోయిన వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా నిమిషాల వ్యవధిలోనే దానిని బ్లాక్ చేయడం అత్యంత ఉత్తమమైన మార్గం.

మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా నిమిషాల్లో కార్డ్ బ్లాక్ 
కార్డ్ పోయిన వెంటనే చాలా మంది కంగారు పడుతూ బ్యాంక్ బ్రాంచ్‌కు పరిగెడుతుంటారు. కానీ ప్రతిసారీ బ్యాంక్‌కు వెళ్లడం కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో మీ స్మార్ట్‌ఫోన్ లోనే ఉండే బ్యాంక్ అధికారిక యాప్ (ఉదాహరణకు HDFC బ్యాంక్ యాప్, ICICI బ్యాంక్ iMobile యాప్ వంటివి) ద్వారా కార్డును క్షణాల్లో బ్లాక్ చేయవచ్చు. దీనికోసం ముందుగా మీ బ్యాంక్ యాప్ లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అందులో ఉండే కార్డ్స్ సెక్షన్‌కు వెళితే.. మీ పేరు మీద ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల లిస్ట్ కనిపిస్తుంది. వాటి చివరి నాలుగు అంకెలను సరిచూసుకుని, ఏ కార్డు పోయిందో దానిపై క్లిక్ చేయాలి. అక్కడ మీకు మేనేజ్ కార్డ్ లేదా సపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే పర్మనెంట్ బ్లాక్ అండ్ రీఇష్యూ అనే ఆప్షన్ వస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే.. మీ పాత కార్డ్ శాశ్వతంగా బ్లాక్ అయిపోతుంది మరియు కొత్త కార్డ్ కోసం రిక్వెస్ట్ సబ్మిట్ అవుతుంది. కార్డ్ బ్లాక్ అవ్వగానే బ్యాంక్ నుంచి మీకు కన్ఫర్మేషన్ ఎస్ఎమ్ఎస్ వస్తుంది.

Vivo S60 : ఐఫోన్ల కంటే పవర్‌ఫుల్ ఫీచర్లు.. ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీతో వివో S60 సిరీస్ లాంచ్


ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా..? 
మీ ఫోన్ అందుబాటులో లేకపోయినా.. ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా కూడా కార్డును సులభంగా బ్లాక్ చేయవచ్చు. దీనికోసం ముందుగా మీ బ్యాంక్ అధికారిక నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అవ్వాలి. హోమ్ పేజీలో కనిపించే కార్డ్స్ లేదా సర్వీస్ రిక్వెస్ట్ సెక్షన్‌కు నావిగేట్ అవ్వాలి. మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఎంచుకుని.. పర్మనెంట్ బ్లాక్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. కొన్ని బ్యాంకులు కార్డ్ ఎందుకు బ్లాక్ చేస్తున్నారో కారణాన్ని (ఉదాహరణకు దొంగతనం లేదా కార్డ్ మిస్సింగ్) అడుగుతాయి. దానిని సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ నొక్కగానే మీ కార్డ్ బ్లాక్ చేయబడుతుంది.

 ఒక చిన్న SMS తో కార్డుకు తాళం వేసేయండి 
ఒకవేళ మీ వద్ద ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా లేదా మీరు నార్మల్ కీప్యాడ్ ఫోన్ వాడుతున్నా.. కేవలం ఒక చిన్న ఎస్ఎమ్ఎస్ పంపి కార్డును బ్లాక్ చేసే వెసులుబాటును బ్యాంకులు కల్పిస్తున్నాయి. ప్రతి బ్యాంక్‌కు ఒక నిర్దిష్టమైన SMS ఫార్మాట్, టోల్-ఫ్రీ నంబర్ ఉంటాయి. ఉదాహరణకు.. మీ వద్ద హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్ కార్డ్ ఉంటే, మీ మొబైల్ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి  BLOCK DC <మీ కార్డు చివరి 4 అంకెలు> అని టైప్ చేసి 7308080808 అనే నంబర్‌కు మెసేజ్ పంపాలి. ఇలా పంపిన వెంటనే మీ కార్డ్ పర్మనెంట్‌గా బ్లాక్ చేయబడిందని మీ మొబైల్‌కు రిటర్న్ మెసేజ్ వస్తుంది. ఈ ఎస్ఎమ్ఎస్ నంబర్లు. ఫార్మాట్ వివరాలు బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »