Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ షురూ.. గెలాక్సీ S25 అల్ట్రా, ఐప్యాడ్లపై భారీ తగ్గింపు

ప్రతిష్టాత్మక అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026సేల్ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి

Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ షురూ.. గెలాక్సీ S25 అల్ట్రా, ఐప్యాడ్లపై భారీ తగ్గింపు

Amazon has teamed up with Samsung to bring deals on smartphones, TVs, other Samsung products

ముఖ్యాంశాలు
  • ప్రైమ్ సభ్యుల కోసం అమెజాన్ సమ్మర్ సేల్ లో స్పెషల్ ఆఫర్స్
  • HDFC Bank కార్డుదారులు అదనపు తగ్గింపులను పొందవచ్చు
  • అమెజాన్ సమ్మర్ సేల్ మే 9 నుండి అందరికి అందుబాటులో ఉంది
ప్రకటన

Amazon Great Summer Sale 2026 : వేసవి తాపాన్ని తగ్గించేలా అమెజాన్ అదిరిపోయే వార్త చెప్పింది. ప్రతిష్టాత్మక గ్రేట్ సమ్మర్ సేల్ 2026ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కళ్లు చెదిరే ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. కేవలం ధరల తగ్గింపు మాత్రమే కాకుండా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులు వాడే వారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (గరిష్టంగా రూ.9,500 వరకు) లభిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై కళ్లు చెదిరే డీల్ 
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ధర ఈ సేల్‌లో భారీగా తగ్గింది. రూ.1,29,999 విలువైన ఈ ఫోన్ ఇప్పుడు రూ.99,999 లకే లభిస్తోంది. అంతేకాకుండా, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.70,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అదనంగా రూ.2,000 కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది. అంటే ఆండ్రాయిడ్ కింగ్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

బడ్జెట్ ఫోన్లు, ఐప్యాడ్‌ల హవా..
తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్ కోసం చూస్తున్న వారికి రెడ్‌మీ A7 ప్రో 5G ఒక మంచి ఆప్షన్. రూ.15,999 విలువైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.11,999లకే అందుబాటులో ఉంది. ఇందులో 6,300mAh భారీ బ్యాటరీ ఉండటం విశేషం. ఇక ఆపిల్ ప్రియుల కోసం 11-అంగుళాల ఐప్యాడ్ (A16 చిప్) రూ.32,900 ధర వద్ద లభిస్తోంది. పాత వస్తువులను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ ధరను మరింత తగ్గించుకోవచ్చు.

ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలపై విందు..
విద్యార్థులు, ఆఫీస్ పనుల కోసం ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి అసూస్ వివోబుక్ 15 రూ.59,990 కే దొరుకుతోంది. ఇది 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ మరియు 16GB రామ్‌తో వస్తుంది. అటు వినోదం కోసం ఎదురుచూసే వారికి శాంసంగ్ 43-అంగుళాల క్రిస్టల్ UHD 4K విజన్ AI స్మార్ట్ టీవీపై రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. క్రెడిట్ కార్డు ఆఫర్లు కలిపితే దీనిని రూ. 28,990 కి సొంతం చేసుకోవచ్చు.

#తాజా కథనాలు
  1. Credit Card : మీ ఏటీఎం, క్రెడిట్ కార్డ్ పోయిందా..? అయితే వెంటనే ఈ పని చేయండి
  2. OTT : ఓటీటీలోకి వచ్చేసిన మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫేసెస్..ఎక్కడ చూడాలో తెలుసా?
  3. Vivo S60 : ఐఫోన్ల కంటే పవర్‌ఫుల్ ఫీచర్లు.. ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీతో వివో S60 సిరీస్ లాంచ్
  4. Motorola Edge 70 Pro+ : రిలీజ్ కాకముందే సెన్సేషన్.. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ అఫీషియల్ ఫీచర్లు ఇవే
  5. Smartphones : మొబైల్ మార్కెట్లో మే నెలాఖరు ధమాకా... ఇండియాలో లాంచైన టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
  6. Wi-Fi Router : బఫరింగ్‌కు బై-బై చెప్పేయండి.. ఇంట్లో వైఫై స్పీడ్ పెంచే బెస్ట్ రూటర్లు ఇవే..!
  7. Xiaomi 17T : ఐఫోన్‌లకే చెమటలు పట్టించేలా షావోమి ప్లాన్.. 7,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్
  8. Motorola : జూన్ 4న మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ గ్రాండ్ ఎంట్రీ.. లీకైన మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు!
  9. Meta Subscribed : ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ఇకపై ఫ్రీగా వాడుకునే రోజులు ఖతం.. బాదుడు షురూ!
  10. Airtel : ఇక నో సిగ్నల్ టెన్షన్..ఇండియాలోనే మొదటిసారి ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »