iPhone 16 Price Cut: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. భారీ డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 అమ్మకాలు!

Unbelievable iPhone 16 Price cut: ఆపిల్ లేటెస్ట్ మోడల్ అయిన ఐఫోన్ 16 పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ సేల్ నడుపుతోంది.

iPhone 16 Price Cut: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. భారీ డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 అమ్మకాలు!

Photo Credit: Apple

Apple iPhone 16

ముఖ్యాంశాలు
  • మధ్యతరగతి బడ్జెట్‌లో ఐఫోన్ కల
  • భారీ ప్రైస్ కట్‌తో అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ మోడల్
  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 16 సొంతం చేసుకునేందుకు సూపర్ ఛాన్స్
ప్రకటన

Grab Big Discounts and bank offers on iPhone 16 in Flipkart Now: ఈ రోజుల్లో బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు ఉండే ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా మధ్యతరగతి స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఐఫోన్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అటువంటి వారి కోసమే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. ఆపిల్ లేటెస్ట్ మోడల్ అయిన ఐఫోన్ 16 పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ సేల్ నడుపుతోంది. దీనివల్ల ఎక్కువ ధర పెట్టి ఐఫోన్ కొనలేని మిడిల్ క్లాస్ కస్టమర్లకు ఇదొక చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.

ఆపిల్ ఐఫోన్ 16 (128జీబీ స్టోరేజ్ వేరియంట్) సాధారణంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రస్తుతం రూ.67,900కి లిస్ట్ చేయబడింది. అయితే దీనిపై లభించే అద్భుతమైన బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే కస్టమర్లకు రూ.5,295 వరకు భారీ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో దీని ఎఫెక్టివ్ ధర కేవలం రూ.62,900కి తగ్గిపోతుంది. అంతేకాకుండా మీ వద్ద ఉన్న పాత వర్కింగ్ కండిషన్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.49,850 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఈ కారుచౌక ఎక్స్ఛేంజ్ విలువ మీరు ఇచ్చే పాత మొబైల్ మోడల్ మరియు కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్ 2024లో రూ.79,900కి లాంచ్ అయిన ఈ మోడల్, ఆఫర్ల అన్నింటినీ కలుపుకుంటే లాంచ్ ధర కంటే ఏకంగా రూ.17,295 వరకు చౌకగా లభిస్తోంది.

Google Pixel Watch : గూగుల్ పిక్సెల్ వాచ్ 5 ఫస్ట్ లుక్ లీక్.. అదిరిపోయే కలర్స్ లో సరికొత్త స్మార్ట్‌వాచ్

ఈ ఐఫోన్ 16 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.1-ఇంచుల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1179x2556 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో పాటు ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా ఏకంగా 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్ కోసం ఇందులో ఆపిల్ సరికొత్త A18 బయోనిక్ చిప్‌సెట్‎ను వాడారు. ఇది లేటెస్ట్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కనెక్టివిటీ పరంగా ఇది సూపర్ ఫాస్ట్ 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6E, బ్లూటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీతో పాటు ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంటుంది.

ఫోన్ ప్రొటెక్షన్ కోసం ఇందులో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌ను ఇచ్చారు. దీనివల్ల పొరపాటున ఫోన్ నీటిలో పడినా లేదా వర్షంలో తడిచినా పాడైపోతుందనే భయం ఉండదు. కెమెరా విభాగంలో ఆపిల్ దీనిని అద్భుతంగా తీర్చిదిద్దింది. దీని వెనుక భాగంలో f/1.6 అపెర్చర్ కలిగిన 48 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా, f/1.6 అపెర్చర్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్, f/2.2 అపెర్చర్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలను అమర్చారు. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో f/1.9 అపెర్చర్ కలిగిన 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ కేవలం 170 గ్రాముల బరువుతో, 7.8 మిమీ మందంతో చేతిలో పట్టుకోవడానికి ఎంతో లైట్ వెయిట్‌గా, ప్రీమియంగా ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Aggregator Policy 2026 : ఆఖరి నిమిషంలో క్యాబ్ క్యాన్సిల్ చేస్తే డ్రైవర్లకు చుక్కలే.. ఏకంగా 5 రెట్ల భారీ జరిమానా
  2. Moto Pad 70 : ఏకంగా 9 జేబీఎల్ స్పీకర్లు, 48W సౌండ్.. జూలై 31న మార్కెట్లోకి మోటో ప్యాడ్ 70 గ్రూవ్
  3. Samsung Galaxy F70 Pro : పాత ఫోన్ మార్చేద్దామనుకుంటున్నారా? శాంసంగ్ కొత్త ఫోన్ చూశాకే నిర్ణయం తీసుకోండి
  4. OnePlus N6x : అఫోర్డబుల్ ప్రైస్‌లో వన్‌ప్లస్ ధమాకా.. 7,000mAh బ్యాటరీ, ఆకట్టుకునే డిజైన్‌తో కొత్త ఫోన్
  5. Xiaomi Mijia Wireless Floor Cleaner 5C : ఇంటి తుడవడంలో భార్యతో గొడవలు బంద్.. షియోమీ నుంచి ఇల్లు మెరిపించే కొత్త గాడ్జెట్ 
  6. Cab Rules : ఓలా, ఉబర్, రాపిడోలకు కొత్త రూల్స్..ఇకపై మగవారితో కలిపి ప్రయాణించే పనిలేకుండా కొత్త ఆప్షన్
  7. Vivo X300 Pro : వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ధమాకా ఆఫర్.. వివో X300 ప్రోపై ఏకంగా రూ.10,000 డిస్కౌంట్
  8. Xiaomi Mix Fold 5 : 200MP కెమెరా, 6,000mAh బ్యాటరీతో షియోమి మిక్స్ ఫోల్డ్ 5.. లీకైన అదిరిపోయే ఫీచర్లు
  9. Nothing : గ్లోబల్ ఎగ్జిట్ వార్తలకు చెక్.. ఫేక్ న్యూస్ అని తేల్చిచెప్పిన నథింగ్ కో-ఫౌండర్
  10. Vivo S2 : ఏడేళ్ల తర్వాత వీవో సరికొత్త సంచలనం.. ఆగస్టు 6న భారత్‌లో Vivo S2 లాంచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »