TIps to turn old smartphone into Home Security Camera: ఈ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను తయారు చేయడానికి మీకు రెండు స్మార్ట్‌ఫోన్లు అవసరమవుతాయి.
Photo Credit: Pexels/Adam Wilson
Security Camera
TIps to Turn Old Smartphone into Home Security Camera: స్మార్ట్‌ఫోన్ కంపెనీలు నిరంతరం కొత్త ఫీచర్లతో మొబైల్స్‌ను లాంచ్ చేస్తుండటంతో కస్టమర్లు కూడా తరచూ ఫోన్లు మారుస్తున్నారు. అయితే సరిగ్గా పనిచేస్తున్న పాత ఫోన్లను ఏం చేయాలో తెలియక చాలా మంది ఇళ్లలోనే ఉంచేస్తారు. ఇలాంటి ఫోన్లను తుప్పు పట్టనివ్వకుండా, మీ ఇంటి భద్రత కోసం ఒక వైర్‌లెస్ సెక్యూరిటీ కెమెరాగా ఉపయోగించుకోవచ్చు. దీని కోసం మీకు కావాల్సిందల్లా ఒక పాత ఫోన్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్, ఒక చిన్న సెక్యూరిటీ కెమెరా యాప్ మాత్రమే.
రెండు ఫోన్ల మ్యాజిక్ సెటప్..
ఈ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను తయారు చేయడానికి మీకు రెండు స్మార్ట్‌ఫోన్లు అవసరమవుతాయి. అందులో మీ పాత ఫోన్ కెమెరా లాగా పనిచేస్తుంది, దాన్ని మీరు నిఘా పెట్టాలనుకున్న చోట ఉంచాలి. ఇక మీ చేతిలో ఉండే కొత్త లేదా ప్రస్తుత ఫోన్ వ్యూయర్ లాగా పనిచేస్తుంది. దీని ద్వారా మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మీ పాత ఫోన్ క్యాప్చర్ చేస్తున్న లైవ్ వీడియోను మీ మొబైల్ స్క్రీన్ పై నేరుగా చూడవచ్చు. ఈ సెటప్ సజావుగా సాగాలంటే రెండు ఫోన్లలోనూ ఇంటర్నెట్ ఆన్ లో ఉండాలి.
సరైన యాప్ ఎంపిక, ఇన్‌స్టాలేషన్..
మొదటగా మీరు రెండు ఫోన్లలోనూ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఒకే రకమైన సెక్యూరిటీ కెమెరా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. మార్కెట్లో లైవ్ స్ట్రీమింగ్, మోషన్ డిటెక్షన్ (కదలికలను గుర్తించడం), టూ-వే ఆడియో (రెండు వైపులా మాట్లాడే సదుపాయం), లోకల్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్న యాప్స్ ఎన్నో ఉచితంగా దొరుకుతాయి. యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, రెండు ఫోన్లలోనూ ఒకే అకౌంట్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
కెమెరా, వ్యూయర్ కాన్ఫిగరేషన్..
యాప్ ఓపెన్ చేసిన తర్వాత కనెక్షన్ ప్రక్రియ చాలా సులభం. మీ పాత ఫోన్‌ను యాప్ సెట్టింగ్స్ లో కెమెరా డివైజ్‌గా సెలెక్ట్ చేయాలి. అలాగే మీ చేతిలో ఉండే ఫోన్‌ను వ్యూయర్ డివైజ్‌గా సెట్ చేసుకోవాలి. ఇందుకోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా అకౌంట్ సింక్ చేయడం ద్వారా రెండు ఫోన్లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయవచ్చు. ఈ కనెక్షన్ పూర్తయిన వెంటనే పాత ఫోన్ కెమెరా ఆన్ అయి లైవ్ ఫీడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది.
Google : గూగుల్ అదిరిపోయే గుడ్ న్యూస్.. అధికారికంగా వచ్చేసిన సరికొత్త ఆండ్రాయిడ్ 17 ఓఎస్
ఫోన్ అమర్చడం, పవర్ సప్లై జాగ్రత్తలు..
ఇప్పుడు మీ పాత ఫోన్‌ను ఇంట్లో మీరు ఏ ప్రాంతాన్ని అయితే మానిటర్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఉంచాలి. కారు పార్కింగ్, మెయిన్ గేట్ లేదా హాల్ మొత్తం కనిపించేలా ఫోన్‌ను కాస్త ఎత్తులో, లెన్స్ శుభ్రంగా ఉండేలా అమర్చాలి. అయితే, ఫోన్ నిరంతరం ఆన్ లో ఉండటం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అందుకే ఆ ఫోన్ కి ఎల్లప్పుడూ చార్జర్ కనెక్ట్ చేసి ఉంచడం మంచిది. ఒకవేళ అక్కడ ప్లగ్ పాయింట్ లేకపోతే, ఒక పవర్ బ్యాంక్‌ను దానికి జత చేయడం ద్వారా చార్జింగ్ సమస్యను అధిగమించవచ్చు.
ఇంటర్నెట్ కనెక్షన్, ఆప్టిమైజేషన్..
ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి బలమైన వై-ఫై లేదా ఇంటర్నెట్ కనెక్షన్ చాలా ముఖ్యం. ఇంటర్నెట్ స్లోగా ఉంటే వీడియో బఫరింగ్ అవ్వడం లేదా లైవ్ ఫీడ్ ఆలస్యంగా రావడం వంటి ఇబ్బందులు వస్తాయి. అంతా కనెక్ట్ అయిన తర్వాత మీ చేతిలో ఉన్న ఫోన్ లో లైవ్ వీడియో వస్తుందో లేదో చెక్ చేసుకోండి. యాప్ లో ఉండే సెట్టింగ్స్ ద్వారా మోషన్ డిటెక్షన్ సెన్సిటివిటీని పెంచుకోవచ్చు. దీనివల్ల ఇంట్లో ఎవరైనా కదిలినా లేదా దొంగలు వచ్చినా వెంటనే మీ ఫోన్ కి అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర మరిన్ని పాత ఫోన్లు ఉంటే, వాటన్నింటినీ ఒకే వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసి ఇంటి చుట్టూ మల్టిపుల్ కెమెరాల సెటప్ కూడా చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999