యూజర్ల మధ్య ఇంటరాక్షన్‌ను, కమ్యూనికేషన్‌ను మరింత పెంచే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
YouTube
YouTube : ప్రపంచంలోనే నెంబర్ వన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన యూట్యూబ్ తన యూజర్ల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో తాము నిలిపివేసిన ఒక అద్భుతమైన ఫీచర్‌ను సరికొత్త హంగులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదే ఇన్-యాప్ డైరెక్ట్ మెసేజింగ్(DM) ఫీచర్. దీని ద్వారా యూజర్లు యూట్యూబ్ యాప్‌ను వదలి బయటకు వెళ్లకుండానే.. యాప్ లోపల ఒకరికొకరు నేరుగా మెసేజ్‌లు పంపుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు. యూజర్ల మధ్య ఇంటరాక్షన్‌ను, కమ్యూనికేషన్‌ను మరింత పెంచే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
9టు5గూగుల్ నివేదిక ప్రకారం.. ఈ సరికొత్త ఇన్-యాప్ మెసేజింగ్ సిస్టమ్ అందుబాటులోకి రావడం వల్ల యూజర్లకు ఒక పెద్ద శ్రమ తప్పనుంది. సాధారణంగా మనకు నచ్చిన ఏదైనా వీడియో లేదా షార్ట్స్ లింకును ఫ్రెండ్స్‌కు షేర్ చేయాలంటే.. దానిని కాపీ చేసి వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర మెసేజింగ్ యాప్‌ల ద్వారా పంపించాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం లేదు. యూట్యూబ్ యాప్ లోనే నేరుగా మీ ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అయి, ఒకే ఒక్క క్లిక్‌తో మీకు నచ్చిన వీడియోలను, షార్ట్స్‌ను, లైవ్ స్ట్రీమ్స్‌ను వారితో పంచుకోవచ్చు. దీనివల్ల 1:1 చాటింగ్ చేయడం చాలా సులభం అవుతుంది.
కొత్త మెసేజింగ్ ఐకాన్ ఎక్కడ ఉంటుంది?
ఈ కొత్త ఫీచర్ అప్‌డేట్ అయిన తర్వాత, యూజర్లకు యూట్యూబ్ యాప్ హోమ్ స్క్రీన్‌పై పైన కుడి వైపున ఒక సరికొత్త మెసేజింగ్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీ కాంటాక్ట్స్‌లో ఉన్న వారితో నేరుగా సంభాషణలు ప్రారంభించవచ్చు. ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు కింద ఉండే షేర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. అక్కడ మీ యూట్యూబ్ ఫ్రెండ్స్ లిస్ట్ కనిపిస్తుంది. వారిని సెలెక్ట్ చేసుకుని నేరుగా వీడియోను మెసేజ్ రూపంలో పంపించేయవచ్చు. ఈ ఫీచర్‌ను వాడటానికి ముందుగా మనం అవతలి వ్యక్తికి ఒక ఇన్వైట్ లింక్ పంపాల్సి ఉంటుంది. వారు దానిని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇద్దరి మధ్య చాటింగ్ విండో ఓపెన్ అవుతుంది.
2019లో ఎందుకు బంద్ చేశారు?
నిజానికి యూట్యూబ్ ఈ డైరెక్ట్ మెసేజ్ ఫీచర్‌ను మొదటిసారి 2017లో ప్రవేశపెట్టింది. కానీ ఆ సమయంలో యూజర్లు వీడియో లింకులను షేర్ చేయడానికి ఎక్కువగా వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడంతో.. 2019లో ఈ ఫీచర్‌ను యూట్యూబ్ పూర్తిగా నిలిపివేసింది. అయితే మారుతున్న కాలంతో పాటు యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, గత ఏడాది దీనిపై మళ్లీ టెస్టింగ్ మొదలుపెట్టింది. ఇప్పుడు మరింత మెరుగైన సెక్యూరిటీ వెర్షన్‌తో దీనిని మళ్లీ రీ-లాంచ్ చేసింది.
ఏ దేశాల్లో అందుబాటులో ఉంది?
యూట్యూబ్ తెచ్చిన ఈ కొత్త డీఎం ఫీచర్‌లో యూజర్ల భద్రతకు పెద్దపీట వేశారు. ఒకవేళ పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే.. దానిని డిలీట్ చేసే అన్‌సెండ్ ఆప్షన్‌ను కల్పించారు. అలాగే ఇబ్బంది పెట్టే కస్టమర్లను సులభంగా బ్లాక్ చేసే సదుపాయం కూడా ఉంది. ఈ ఫీచర్ కచ్చితంగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ పరిధిలోనే పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను కేవలం 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. గత నవంబర్ నుంచి యూరప్‌లో విజయవంతంగా టెస్టింగ్ పూర్తి చేసుకున్న ఈ ఫీచర్‌ను.. ప్రస్తుతం అమెరికా, యూకే, బ్రెజిల్, సింగపూర్ వంటి ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో రోల్ అవుట్ చేస్తున్నారు. త్వరలోనే భారతదేశంతో పాటు మిగిలిన గ్లోబల్ మార్కెట్లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
iPhone 20 Pro Could Get a Major Display Redesign With Quad-Curved Panel