Hisense Launches E8S 144Hz ULED Mini-LED TV: స్మార్ట్ టీవీ లవర్స్ కి గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్స్‎తో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హైసెన్స్ E8S సిరీస్

Hisense Launches E8S 144Hz ULED Mini-LED TV: ఈ సరికొత్త E8S సిరీస్ టీవీలలో ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీతో కూడిన ULED మినీ-ఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఉపయోగించారు.

Hisense Launches E8S 144Hz ULED Mini-LED TV: స్మార్ట్ టీవీ లవర్స్ కి గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్స్‎తో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హైసెన్స్ E8S సిరీస్

Hisense TV

ముఖ్యాంశాలు
  • స్మార్ట్ టీవీ లవర్స్ కి గుడ్ న్యూస్
  • రూ.57,990 లకే లగ్జరీ హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్
  • 144Hz డిస్‌ప్లేతో హైసెన్స్ కొత్త టీవీలు
ప్రకటన

Hisense Launches E8S 144Hz ULED Mini-LED T: ప్రముఖ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ హైసెన్స్  భారతీయ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి సరికొత్త ప్రీమియం మోడళ్లను ప్రవేశపెట్టింది. తన అప్‌కమింగ్ లైనప్ లో భాగంగా హైసెన్స్ E8S 144Hz ULED Mini-LED టీవీ సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. వినోదంతో పాటు అల్ట్రా-స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఈ స్మార్ట్ టీవీలను కంపెనీ రూపొందించింది. ఈ సరికొత్త సిరీస్ మొత్తం నాలుగు రకాల విభిన్న స్క్రీన్ సైజులలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

హైసెన్స్ E8S స్మార్ట్ టీవీ సిరీస్ 55-ఇంచులు, 65-ఇంచులు, 75-ఇంచులు, భారీ స్క్రీన్ ఇష్టపడే వారి కోసం 85-ఇంచుల సైజుల్లో లభిస్తుంది. ఈ సరికొత్త టీవీ సిరీస్ ప్రారంభ ధరను కంపెనీ రూ.57,990 గా నిర్ణయించింది. ఈ టీవీ మోడల్స్ అన్నీ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లతో పాటు దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా కస్టమర్ల కోసం 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ  సౌకర్యంతో పాటు ప్రత్యేక డిస్కౌంట్లను కూడా ఇస్తున్నారు.

ఈ సరికొత్త E8S సిరీస్ టీవీలలో ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీతో కూడిన ULED మినీ-ఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఉపయోగించారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ టెక్నాలజీ స్క్రీన్ వెనుక ఉండే వేర్వేరు బ్యాక్‌లైట్ జోన్‌లను చాలా పకడ్బందీగా కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల కంటికి ఆహ్లాదాన్నిచ్చే బెస్ట్ కాంట్రాస్ట్ మరియు లగ్జరీ బ్లాక్ లెవెల్స్ స్క్రీన్ పై కనిపిస్తాయి. దీనితో పాటు ఇందులో ఉపయోగించిన Hi-QLED Colour టెక్నాలజీ ప్రతి రంగును అత్యంత సహజంగా, స్పష్టంగా చూపిస్తుంది.

హై-ఎండ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడేవారి కోసం ఈ టీవీలో 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. దీనివల్ల వేగంగా కదిలే యాక్షన్ సీన్లు లేదా రేసింగ్ గేమ్స్ ఆడేటప్పుడు స్క్రీన్ ఎక్కడా బ్లర్ అవ్వకుండా చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. అలాగే టీవీ పర్ఫార్మెన్స్ ను పెంచడానికి ఇందులో Hi-View AI Engineను అమర్చారు. ఇది రియల్ టైమ్‌లో పిక్చర్ క్వాలిటీ, కాంట్రాస్ట్, కలర్ సెట్టింగులను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. కాగా ఈ సిరీస్ లోని టాప్ ఎండ్ 85-ఇంచుల మోడల్‌లో మరింత పవర్‌ఫుల్ Hi-View AI Engine Pro ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

Smartphone Comparison : రూ.30 వేల బడ్జెట్‌లో మూడు బెస్ట్ ఆప్షన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

సినిమా చూసేటప్పుడు పిక్చర్ తో పాటు సౌండ్ కూడా అదిరిపోవాలనుకునే వారి కోసం హైసెన్స్ ఈ టీవీలలో ఫేమస్ ఆడియో బ్రాండ్ డెవియాలెట్ చేత ట్యూన్ చేయబడిన ఇన్-బిల్ట్ సబ్‌వూఫర్‌ను అందించింది. ఇది కస్టమర్లకు హెవీ బేస్ తో కూడిన లౌడ్, ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. వీటితో పాటు హోమ్ థియేటర్ ఫీలింగ్ కోసం HDR10+ అడాప్టివ్, డాల్బీ విజన్ ఐక్యూ, డైరెక్టర్లు అనుకున్న విధంగా సినిమాను చూపించే  ఫిల్మ్‌మేకర్ మోడ్ వంటి ఫీచర్లను కూడా ఈ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేస్తుంది.

హైసెన్స్ E8S స్మార్ట్ టీవీ సిరీస్ లేటెస్ట్ VIDAA Smart OS ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. దీనివల్ల అన్ని రకాల ఓటీటీ యాప్స్ చాలా వేగంగా ఓపెన్ అవుతాయి. ఇందులో రిమోట్ అవసరం లేకుండా కేవలం మన వాయిస్ తో కంట్రోల్ చేసే  హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ ఫీచర్ ఉంది. అలాగే ఇందులో ప్రత్యేకంగా AI RGB లైట్ సెన్సార్ ను ఇచ్చారు, ఇది మనం టీవీ చూసే గదిలోని లైటింగ్‌ను బట్టి స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఆటోమేటిక్‌గా మార్చేస్తుంది. ప్యాంటోన్ వాలిడేషన్తో వస్తున్న ఈ టీవీలు ప్రీమియం లైనప్‌లో కస్టమర్లకు ఒక బెస్ట్ ఆప్షన్ గా నిలవనున్నాయి.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »