How to Recover Hacked Whatsapp: అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం రాగానే.. కంగారు పడకుండా మొదట మీ మొబైల్ నుంచి ##21# అనే USSD కోడ్‌ను డయల్ చేయాలని ఆయన సూచించారు.
Photo Credit: Unsplash/ Grant Davies
How to recover hacked whatsapp: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్‌లో వాట్సాప్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. పర్సనల్ చాటింగ్స్ మాత్రమే కాకుండా ఆఫీస్ ఫైల్స్, బ్యాంకింగ్ వివరాలు, అత్యంత రహస్యమైన సమాచారాన్ని కూడా మనం వాట్సాప్ ద్వారానే పంచుకుంటున్నాం. అయితే ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఈ మధ్య కాలంలో వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అవుతున్న కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ సడన్‌గా లాగ్అవుట్ అయిపోయి, వేరే ఎవరిదో డివైజ్‌లో రన్ అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు భయపడకుండా కొన్ని కీలకమైన స్టెప్స్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం.
వాట్సాప్ హ్యాకింగ్ బారిన పడినప్పుడు యూజర్లు ఏం చేయాలో ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ (IFSO) జాయింట్ సీపీ రజనీష్ గుప్తా వివరించారు. అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం రాగానే.. కంగారు పడకుండా మొదట మీ మొబైల్ నుంచి ##21# అనే USSD కోడ్‌ను డయల్ చేయాలని ఆయన సూచించారు. ఈ కోడ్ డయల్ చేయడం వల్ల మీ ఫోన్‌లో యాక్టివ్‌గా ఉన్న అన్ని రకాల కాల్ ఫార్వార్డింగ్ మరియు మెసేజ్ ఫార్వార్డింగ్ సర్వీసులు వెంటనే బ్లాక్ అయిపోతాయి. హ్యాకర్లు చాలా సందర్భాల్లో మీ వాట్సాప్ లాగిన్ ఓటీపీ లేదా వెరిఫికేషన్ మెసేజ్‌లను వారి నంబర్లకు ఫార్వార్డ్ చేసుకునేలా సెట్ చేస్తారు. ఈ కోడ్ డయల్ చేయడం వల్ల వారి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది.
మీ ఫోన్ లో కాల్ ఫార్వార్డింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిలిపివేసిన తర్వాత, వాట్సాప్ అధికారిక సపోర్ట్ పేజీకి వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ అఫీషియల్ హెల్ప్ సెంటర్‌లోని కాంటాక్ట్ అస్ ఫామ్‌ను ఓపెన్ చేసి, మీ మొబైల్ నంబర్, మీ అకౌంట్ హ్యాక్ అయినట్లు పూర్తి వివరాలను అక్కడ టైప్ చేయాలి. దీనితో పాటు మీ పేరు, సరైన ఈమెయిల్ ఐడీని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
Apple MacBook Neo : యాపిల్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న చౌకైన మ్యాక్‌బుక్ నియో
మీరు ఫిర్యాదు ఫారమ్‌ను సబ్మిట్ చేసిన తర్వాత వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగుతుంది. మీ అకౌంట్ హిస్టరీని, అందులోని అనధికారిక లాగిన్ యాక్సెస్‌ను వారు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మీ అకౌంట్ నిజంగానే హ్యాక్ అయిందని నిర్ధారణకు వచ్చిన వెంటనే.. హ్యాకర్ డివైజ్ నుంచి మీ వాట్సాప్ అకౌంట్‌ను బలవంతంగా లాగ్అవుట్ చేస్తారు. ఆ తర్వాత మీ మొబైల్‌కు వచ్చే సరికొత్త ఓటీపీ సహాయంతో మీ వాట్సాప్ అకౌంట్‌ను మీ ఫోన్‌లో మళ్లీ సులభంగా రీ-లాగిన్ చేసుకోవచ్చు.
వాట్సాప్ అకౌంట్ భవిష్యత్తులో హ్యాక్ కాకుండా ఉండటానికి సైబర్ భద్రతా నిపుణులు కొన్ని ముఖ్యమైన చిట్కాలను పంచుకున్నారు. మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెంటనే టూ-స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం చాలా ఉత్తమం. దీనివల్ల హ్యాకర్లకు ఓటీపీ దొరికినా కూడా మీరు సెట్ చేసుకున్న 6 అంకెల పిన్ నంబర్ లేనిదే అకౌంట్ ఓపెన్ చేయడం అసాధ్యం అవుతుంది. అంతేకాకుండా, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకులు క్లిక్ చేయడం, అపరిచిత ఓటీపీలు ఇతరులకు చెప్పడం లేదా ఎనీడెస్క్, టీమ్‌వ్యూయర్ లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ ద్వారా మీ ఫోన్ స్క్రీన్‌ను ఇతరులకు చూపించడం అస్సలు చేయకూడదు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999