భారతదేశంలో రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగినప్పటికీ, ఎయిర్‌టెల్, జియో సంస్థలు రూ.1000 లోపు బడ్జెట్‌లో కస్టమర్ల కోసం అదిరిపోయే ప్రిపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.
Airtel vs Jio: Best Prepaid Recharge Plans Under Rs 1,000
Jio Vs Airtel : భారతదేశంలో రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగినప్పటికీ, ఎయిర్‌టెల్, జియో సంస్థలు రూ.1000 లోపు బడ్జెట్‌లో కస్టమర్ల కోసం అదిరిపోయే ప్రిపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే, మీకు ఎక్కువ డేటా కావాలా లేదా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కావాలా అనే దాన్ని బట్టి సరైన ప్లాన్ ఎంచుకోవడం కొంచెం కన్ఫ్యూజింగ్‌గా మారింది. అన్‌లిమిటెడ్ 5G డేటా, ఉచిత కాలింగ్, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, గూగుల్ జెమిని ప్రో వంటి అదనపు ప్రయోజనాలతో మార్కెట్లో పోటీ పడుతున్న ఎయిర్‌టెల్, జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ల పూర్తి వివరాలు మీకోసం.
రూ.979, రూ.649, రూ.579 రీఛార్జ్ విశేషాలు
ఎయిర్‌టెల్ కంపెనీ ఎక్కువ రోజుల వాలిడిటీ, వినోదాన్ని కోరుకునే వారి కోసం మూడు సూపర్ ప్లాన్‌లను రన్ చేస్తోంది. ఇందులో రూ.979 ప్లాన్ ద్వారా అత్యధికంగా 84 రోజుల వాలిడిటీ లభిస్తుంది. దీనితో పాటు ప్రతిరోజూ 2GB 5G డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లతో పాటు సోనీలివ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ఉచితంగా వస్తాయి. ఇక రూ.649 ప్లాన్ ఎంచుకుంటే 56 రోజుల వాలిడిటీతో పాటు రోజూ 2GB డేటా, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం లభిస్తుంది. అదే 56 రోజుల వాలిడిటీతో రోజూ 1.5GB డేటా మాత్రమే కావాలనుకుంటే రూ.579 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. దీనితో పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్ కూడా ఇస్తున్నారు.
హెవీ డేటా యూజర్స్ కోసం ఎయిర్‌టెల్ రూ.838 ప్లాన్
రోజువారీ ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉండే వారి కోసం ఎయిర్‌టెల్ రూ.838 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు 56 రోజుల వాలిడిటీ లభిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ప్రతిరోజూ అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు 3GB చొప్పున డేటా వస్తుంది. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే, అమెజాన్ ప్రైమ్ లైట్, సోనీలివ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే వంటి క్రేజీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా వాడుకోవచ్చు. రోజువారీ ఆఫీస్ పనులకు లేదా ఆన్‌లైన్ క్లాసుల కోసం ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి ఇది సరైన రీఛార్జ్ ప్లాన్.
ఎయిర్‌టెల్ రూ.429, రూ.379, రూ.199 ప్లాన్స్
ఒక నెల వాలిడిటీతో తక్కువ ధరలో రీఛార్జ్ చేయాలనుకునే వారికి ఎయిర్‌టెల్ రూ.429, రూ.379 ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. రూ.429 ప్లాన్ ద్వారా ఒక నెల వాలిడిటీతో పాటు ప్రతిరోజూ 2.5GB 5G డేటా, అడోబ్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే లభిస్తాయి. అదే రూ.379 ప్లాన్ తీసుకుంటే రోజూ 2GB డేటాతో పాటు ఆపిల్ మ్యూజిక్, గూగుల్ వన్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం బెనిఫిట్స్ వస్తాయి. ఇక కేవలం 28 రోజుల వాలిడిటీతో అత్యంత చౌకగా కావాలనుకుంటే రూ.199 ప్లాన్ ఉంది, ఇందులో మొత్తంగా 2GB డేటాతో పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే సేవలు లభిస్తాయి.
జియో 84 రోజుల ధమాకా ప్లాన్స్
జియో తన కస్టమర్ల కోసం 84 రోజుల సుదీర్ఘ వాలిడిటీతో రూ.949, రూ.859 ప్లాన్‌లను అందుబాటులో ఉంచింది. రూ.949 ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 2GB అన్‌లిమిటెడ్ 5G డేటా, ఉచిత కాల్స్, 100 ఎస్ఎమ్ఎస్‌లు వస్తాయి. దీనితో పాటు ప్రత్యేకంగా జియోహాట్‌స్టార్, జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు లభిస్తాయి. ఇక రూ.859 ప్లాన్ ద్వారా కూడా సరిగ్గా ఇవే ఫీచర్లు, 84 రోజుల వాలిడిటీ లభిస్తాయి. ఓటీటీ ప్రియులకు, ఎక్కువ రోజులు రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్లు బెస్ట్.
జియో రూ.500 మెగా కంటెంట్ ప్లాన్
కంటెంట్ స్ట్రీమింగ్, సినిమాలను ఎక్కువగా ఇష్టపడే వారి కోసం జియో ఒక అద్భుతమైన ప్లాన్‌ను డిజైన్ చేసింది, అదే రూ.500 మెగా కంటెంట్ ప్లాన్. దీని వాలిడిటీ 28 రోజులు మాత్రమే అయినప్పటికీ, ఇందులో లభించే ఓటీటీ ప్రయోజనాలు వేరే ఏ ప్లాన్‌లోనూ లేవు. ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 2GB 5G డేటాతో పాటు ప్రైమ్ వీడియో మొబైల్, యూట్యూబ్ ప్రీమియం, సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, జియోహాట్‌స్టార్ వంటి టాప్ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. ఒక్క రీఛార్జ్‌తో ఇన్ని ఓటీటీలు రావడం నిజంగా విశేషం.
జియో బడ్జెట్, మీడియం వాలిడిటీ ప్లాన్స్
జియో తన వినియోగదారుల కోసం వివిధ రకాల డేటా అవసరాలకు తగ్గట్లుగా ప్లాన్‌లను విభజించింది. రూ.629 ప్లాన్ ద్వారా 56 రోజుల వాలిడిటీతో రోజూ 2GB డేటా వస్తుంది. రూ.450 ప్లాన్ ద్వారా 36 రోజుల వాలిడిటీతో రోజూ 2GB డేటా లభిస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ జియోహాట్‌స్టార్, గూగుల్ జెమిని ప్రో బెనిఫిట్స్ ఉమ్మడిగా వస్తాయి. ఇక స్పోర్ట్స్ ప్రేమికుల కోసం రూ.399 ప్లాన్ ఉంది, ఇది 28 రోజుల వాలిడిటీతో రోజుకు 2.5GB డేటాతో పాటు ఫ్యాన్‌కోడ్, జియో గేమ్స్ మొబైల్ యాక్సెస్ ఇస్తుంది. అలాగే రూ.349 ప్లాన్ ద్వారా 28 రోజుల వాలిడిటీతో రోజుకు 2GB డేటా, జియోహాట్‌స్టార్, జెమిని ప్రో సేవలు లభిస్తాయి. అత్యంత చౌకగా 14 రోజుల వాలిడిటీతో కావాలనుకుంటే రూ.198 ప్లాన్ అందుబాటులో ఉంది, ఇందులో రోజుకు 2GB డేటా వస్తుంది.
ఫైనల్‌గా ఏ ప్లాన్ వాల్యూ ఫర్ మనీ?
మీరు రూ.1000 లోపు బెస్ట్ ప్లాన్ ఎంచుకోవాలనుకుంటే మీ అవసరమేంటో క్లారిటీ ఉండాలి. మీకు రోజువారీ ఇంటర్నెట్ వాడకం చాలా ఎక్కువగా ఉండి (ఉదాహరణకు రోజుకు 3GB డేటా) అమెజాన్ ప్రైమ్ కావాలనుకుంటే ఎయిర్‌టెల్ రూ.838 ప్లాన్ సూపర్ చాయిస్. అలా కాకుండా, మీకు లాంగ్ వాలిడిటీతో పాటు ఒకే ప్లాన్‌లో యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి రకరకాల ఓటీటీలు లేదా గూగుల్ జెమిని ఏఐ ఫీచర్లు కావాలనుకుంటే జియో ప్లాన్లు చాలా అట్రాక్టివ్‌గా, తక్కువ ధరలో ఎక్కువ లాభాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹1,999
Amazfit Cheetah 2 Ultra
Starts from ₹54,999
JBL Tune 780NC Wireless Headphones
Starts from ₹7,999
Philips 5G Smartphone India Launch Date Confirmed: Here’s What We Know
Boltt Reveals Software Update Policy for Ace 5G and Evo Ahead of September 1 Sale
Samsung Galaxy Tab S12 Ultra Allegedly Listed on Geekbench With MediaTek Dimensity 9500 Chipset