వోడాఫోన్ ఐడియా తాజాగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం.. తమిళనాడులోని కోయంబత్తూర్, తిరుపూర్, వెల్లూరు నగరాల్లో Vi 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి.
VI 5G
Vi 5G : భారతీయ టెలికాం రంగంలో తన ఉనికిని చాటుకునేందుకు ప్రముఖ ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంలో తన నెట్‌వర్క్ పరిధిని మరింత బలోపేతం చేస్తూ, తమిళనాడులోని మూడు ప్రధాన నగరాల్లో సరికొత్త 5జీ సేవలను అధికారికంగా ప్రారంభించింది. ఈ విస్తరణ ద్వారా ఆయా నగరాల్లోని కస్టమర్లకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆ మూడు ప్రధాన నగరాలు ఇవే
వోడాఫోన్ ఐడియా తాజాగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం.. తమిళనాడులోని కోయంబత్తూర్, తిరుపూర్, వెల్లూరు నగరాల్లో Vi 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు నగరాలు కూడా రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రాంతాలు కావడం విశేషం. కాగా, ఈ నగరాల కంటే ముందే కంపెనీ రాజధాని చెన్నైతో పాటు పుదుచ్చేరి, తిరుచిరాపల్లి, సేలం నగరాల్లో తన 5జీ నెట్‌వర్క్‌ను విజయవంతంగా విస్తరించిన సంగతి తెలిసిందే.
డేటా వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపైనే ఫోకస్
టెలికాం విశ్లేషకుల ప్రకారం.. వోడాఫోన్ ఐడియా తన 5జీ నెట్‌వర్క్ ఏర్పాటు కోసం ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎక్కడైతే మొబైల్ డేటా వినియోగం విపరీతంగా ఉంటుందో, అటువంటి నగరాలకే కంపెనీ మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో నెట్‌వర్క్ రద్దీ తగ్గి, వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేని హై-స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది.
పారిశ్రామిక, విద్యా రంగాలకు కొత్త ఊపు
ఈ 5జీ లాంచ్ వల్ల ఆయా నగరాల రంగాలు ఊపందుకోనున్నాయి. తమిళనాడులో కోయంబత్తూర్, తిరుపూర్‌లను ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలుగా పరిగణిస్తారు. అలాగే వెల్లూరు నగరం ప్రపంచ స్థాయి వైద్య సేవలు, నాణ్యమైన విద్యా సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో Vi 5G రాకతో ఇక్కడి స్థానిక నివాసితులకు, ఐటీ నిపుణులకు, వ్యాపారవేత్తలకు, నిరంతరం ప్రయాణాలు చేసే వారికి రోజువారి డిజిటల్ అవసరాల్లో సరికొత్త వేగం లభించనుంది.
యూజర్లకు లభించనున్న అద్భుతమైన ఫీచర్లు
ట్విట్టర్ వేదికగా Vi న్యూస్ అధికారికంగా షేర్ చేసిన సమాచారం ప్రకారం.. ఈ రోలౌట్‌తో తమిళనాడు అంతటా వోడాఫోన్ ఐడియా తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకోనుంది. ఈ 5జీ నెట్‌వర్క్ ద్వారా కస్టమర్లు సూపర్ ఫాస్ట్ డౌన్‌లోడ్స్, బఫరింగ్ లేని వీడియో స్ట్రీమింగ్, ల్యాగ్ ఫ్రీ ఆన్‌లైన్ గేమింగ్, క్లియర్ వీడియో కాల్స్, రియల్ టైమ్ క్లౌడ్ యాక్సెస్‌ను సులభంగా పొందవచ్చు. పెరుగుతున్న డిజిటల్ వాడకానికి అనుగుణంగా ఈ సేవలు ఇక్కడి ప్రజల జీవనశైలిని మరింత స్మార్ట్‌గా మార్చనున్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999