ఈ నూతన స్మార్ట్‌ఫోన్ క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్‌తో రాబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌లో కంపెనీ పేర్కొంది.
Photo Credit: Boltt
Boltt Evo 4G
Boltt Evo 4G : భారతీయ వేరబుల్స్, స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న ఫైర్-బోల్ట్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల రంగంలోకి అడుగుపెట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను బోల్ట్ బ్రాండ్ పేరుతో భారత మార్కెట్లో పరిచయం చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బోల్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. ఈ ఫోన్‌ను రాబోయే ఆగస్టు 25, 2026న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు మైక్రోసైట్ ద్వారా స్పష్టమవుతోంది.
డిజైన్, ఫ్లిప్‌కార్ట్ టీజర్ వివరాలు
ఈ నూతన స్మార్ట్‌ఫోన్ క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్‌తో రాబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌లో కంపెనీ పేర్కొంది. ఇందులో ఎలాంటి అవాంఛిత బ్లోట్‌వేర్ ఉండబోదని స్పష్టమవుతోంది. ఫోన్ ఫ్రంట్ డిజైన్ పరంగా.. డిస్‌ప్లే పైభాగంలో సెల్ఫీ కెమెరా కోసం హోల్-పాంచ్ కటౌట్ ఉంది. స్క్రీన్ చుట్టూ సైడ్ బెజెల్స్ సన్నగా ఉన్నప్పటికీ, కింది భాగం కాస్త మందంగా ఉంది. ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అమర్చబడి ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్‌ను కలిగి ఉంది.
EV Sales : ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డులు.. జులైలో ఏకంగా 81.6 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
రూ. 20 వేల బడ్జెట్ విభాగంలో గట్టి పోటీ
ఫైర్-బోల్ట్ సంస్థ తన స్మార్ట్‌ఫోన్ల లైన్‌అప్‌ను ఏస్, ఈవో సిరీస్‌లుగా తీసుకురానుంది. ఇందులో 4G తో పాటు 5G మోడళ్లు కూడా ఉంటాయి. అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏమిటంటే.. ఈ ఫోన్లన్నీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా భారతదేశంలోనే తయారు చేయబడతాయి. మొదట్లో రూ. 20,000 కంటే తక్కువ ధర ఉండే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపైనే ఫైర్-బోల్ట్ దృష్టి పెట్టనుంది. ఇదే గనుక జరిగితే ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న లావా, ఒప్పో, వివో, శామ్‌సంగ్, రియల్‌మీ వంటి దిగ్గజ బ్రాండ్లకు ఫైర్-బోల్ట్ నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుంది.
గీక్‌బెంచ్ లీక్స్.. లీకైన ప్రాసెసర్, ఫీచర్లు
లాంచ్‌కు ముందే ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్‌లో బోల్ట్ బ్రాండ్ ఫస్ట్ ఫోన్ Boltt Evo 4G పేరుతో లిస్ట్ అయింది.
ప్రాసెసర్, ఓఎస్: గీక్‌బెంచ్ వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో యూనిసాక్ T7250 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
బెంచ్‌మార్క్ స్కోర్లు: గీక్‌బెంచ్ సింగిల్-కోర్ టెస్ట్‌లో 440 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 1,470 పాయింట్ల స్కోర్‌ను ఈ ఫోన్ సాధించింది.
చిప్‌సెట్ వివరాలు: ఈ యూనిసాక్ ఎంట్రీ లెవల్ చిప్‌సెట్‌లో 1.82 GHz క్లాక్ స్పీడ్‌తో నడిచే 2 ప్రైమరీ కోర్లు, 1.61 GHzతో నడిచే 6 ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. ఇదే తరహా ప్రాసెసర్‌ను రియల్‌మీ P4x, ఒప్పో A6c, పోకో C81 ప్రో, ఐటెల్ జెనో 200 మోడళ్లలోనూ ఉపయోగించారు.
ప్రకటన
ప్రకటన
Microsoft Reportedly Making Xbox 360 Games Backwards Compatible on PC and Project Helix