Mobile Phone Manufacturing Scheme: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లకు కేంద్రం ఊతం.. రూ.62,500 కోట్లతో కేంద్రం కొత్త పథకం!

Indian Govt. Approves Rs.62,500 Crore for Mobile Phone Manufacturing Scheme: కేంద్ర మంత్రివర్గం ఇటీవల మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్(MPMS)కు ఆమోదం తెలిపింది.

Mobile Phone Manufacturing Scheme: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లకు కేంద్రం ఊతం.. రూ.62,500 కోట్లతో కేంద్రం కొత్త పథకం!

Smartphones

ముఖ్యాంశాలు
  • భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లకు కేంద్రం ఊతం
  • యాపిల్, శామ్‌సంగ్‌లతో పాటు రేసులో నిలవనున్న మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్లు
  • మేకింగ్, కాంపోనెంట్స్ లోకలైజేషన్‌పై ఇన్సెంటివ్‌ల వర్షం
ప్రకటన

Indian Govt. approves Rs.62,500 Crore for Mobile Phone Manufacturing Scheme: భారతదేశంలో గడిచిన కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ల తయారీ రష్యా, అమెరికా సహా ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ దిగ్గజాలైన యాపిల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలు భారత గడ్డపై అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. అయితే ప్రపంచ స్థాయిలో మేడ్ ఇన్ ఇండియా హవా నడుస్తున్నప్పటికీ, మన స్వదేశీ భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల విక్రయాలు మాత్రం మార్కెట్లో క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ లోపాన్ని సరిదిద్ది, అంతర్జాతీయ మార్కెట్‌లో మన దేశీయ బ్రాండ్లకు బలమైన స్థానాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

లోకల్ బ్రాండ్లకు గ్లోబల్ రీచ్ పెంచడమే లక్ష్యం

కేంద్ర మంత్రివర్గం ఇటీవల మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్(MPMS)కు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్(PLI) పథకం స్థానంలో ఈ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చారు. గతంలో అమలు చేసిన పీఎల్ఐ పథకం వల్ల భారతదేశం నుంచి ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి, ఎగుమతులు భారీగా పెరిగాయి. అయితే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వేగంగా మారుతున్న ట్రెండ్స్‌ను అందుకోవడంలో భారతీయ బ్రాండ్లు కొంత వెనుకబడ్డాయి. ఈ కొత్త పథకం ద్వారా ఆ సాంకేతిక లోపాలను సరిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.

కేంద్రం కీలక ప్రకటన

కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ, మొదటి స్కీమ్ ద్వారా వచ్చిన అనుభవాలు, ఫలితాల ఆధారంగా ఈసారి మరింత దృష్టి కేంద్రీకరించి ఎంపీఎంఎస్  పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. భారతదేశం ప్రస్తుతం తన తయారీ రంగానికి సంబంధించిన అంతర్జాతీయ ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకుందని,  మేడ్ ఇన్ ఇండియా లేబుల్‌తో ఉన్న స్మార్ట్‌ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. రాబోయే రోజుల్లో విదేశీ కాంట్రాక్ట్ తయారీదారులు లేదా కేవలం ఫోన్ల విడిభాగాలను అమర్చే స్థాయికే భారత కంపెనీలు పరిమితం కాకుండా, సొంత బ్రాండ్లతో గ్లోబల్ లీడర్లుగా ఎదగడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Realme P4 Lite 5G : బడ్జెట్ ప్రియులకు రియల్‌మీ బిగ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ P4 లైట్ 5Gపై భారీ డిస్కౌంట్

2.25 నుంచి 5 శాతం వరకు ప్రోత్సాహకాలు

మంత్రివర్గం ఆమోదించిన ఈ బృహత్తర పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.62,500 కోట్లు వెచ్చించనుంది. ఈ స్కీమ్ ద్వారా దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ, వాల్యూ అడిషన్ పెంచడంతో పాటు సప్లై చైన్‌ను మరింత బలోపేతం చేయనున్నారు. దేశీయ బ్రాండ్లు కొత్త టెక్నాలజీని సొంతం చేసుకునేందుకు మరియు వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యక్షంగా సహాయం చేస్తుంది. ఇందులో భాగంగా, భారత్‌లో జరిగే విక్రయాల ఆధారంగా తయారీదారులకు 2.25 శాతం నుంచి 5 శాతం వరకు క్యాష్ ఇన్సెంటివ్‌లు అందిస్తారు. స్థానికంగా లభించే విడిభాగాలను ఉపయోగించే కంపెనీలకు అదనపు బోనస్ ఇన్సెంటివ్‌లు కూడా లభిస్తాయి.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Truth Social : ట్రంప్ ట్వీట్ ముందే కావాలా? నెలకు రూ. 85 లక్షలు కట్టాల్సిందే
  2. Oppo A7 Pro Max : మార్కెట్లోకి ఒప్పో A7 ప్రో మాక్స్ ఎంట్రీ.. 10,000mAh బ్యాటరీతో సరికొత్త రికార్డు
  3. Motorola : జూలై 31న భారత్‌లోకి మోటో ప్యాడ్ 70 గ్రూవ్ ఎంట్రీ.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
  4. iPhone 15 : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 పై భారీ ఆఫర్.. ఏకంగా రూ.26,000 పైగా డిస్కౌంట్
  5. Smartphone Comparison : మార్కెట్లోకి రియల్‌మీ C100x లాంచ్.. రెడ్‌మీ, శామ్‌సంగ్ బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ
  6. Xiaomi Camera : కరెంట్, వైఫైతో పనిలేదు.. సోలార్ ఎనర్జీతో పనిచేసే షావోమీ సరికొత్త స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా
  7. Nokia 300 4G Power Bank : ఇది బటన్ ఫోన్ కాదు సామీ.. ఇతర గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసే చిన్నపాటి పవర్ ప్లాంట్
  8. Infinix Note 60 Pro : లుక్‌తో పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్.. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో రెండు కొత్త రంగుల్లో లాంచ్
  9. Motorola Edge 70 Max Sale begins: భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ సేల్స్ ప్రారంభం.. ఆన్‌లైన్‌లో కొనుగోలుకు సిద్ధం!
  10. Honor X7E Plus 5G Launched: నీళ్లలో పడినా, వర్షంలో తడిసినా చెక్కుచెదరని హానర్ X7e ప్లస్ 5G.. గ్రాండ్ లాంచ్!
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »