భారతీయ మార్కెట్లో Infinix Note 60 Pro Pininfarina Edition స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక్క ప్రీమియం వేరియంట్‌లో లభిస్తోంది.
Photo Credit: Infinix
Infinix Note 60 Pro Pininfarina Edition
Infinix Note 60 Pro : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ భారతీయ మొబైల్ ప్రియుల కోసం గత వారం సరికొత్త లగ్జరీ వేరియంట్ Infinix Note 60 Pro Pininfarina Editionను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రతిష్టాత్మక స్మార్ట్‌ఫోన్ ఈ రోజు నుంచి దేశీయ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ డిజైన్ హౌస్ పినిన్‌ఫారినాతో కలిసి ప్రత్యేకమైన లుక్‌తో ఈ ఫోన్‌ను ఇన్ఫినిక్స్ రూపొందించింది. ఈ మొబైల్‌లో 50 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ కెమెరాతో పాటు భారీ బ్యాటరీని అందించారు. స్టైలిష్ లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లను టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చారు.
ధర ఎంత? ఆఫర్లు ఏమున్నాయి?
భారతీయ మార్కెట్లో Infinix Note 60 Pro Pininfarina Edition స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక్క ప్రీమియం వేరియంట్‌లో లభిస్తోంది. 8GB రామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ వేరియంట్ ధరను రూ.37,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ సేల్స్ ఈ రోజు నుంచే ఇన్ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లో ప్రారంభమయ్యాయి. లాంచ్ ఆఫర్ల కింద కస్టమర్లకు మంచి డిస్కౌంట్లు లభిస్తున్నాయి. నిర్దేశిత బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనితో పాటు, మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా అదనంగా మరో రూ.2,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.
కళ్లు చెదిరే డిస్‌ప్లే, ప్రాసెసర్ ఫీచర్లు
ఈ సరికొత్త ఇన్ఫినిక్స్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.78 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 2644x1208 పిక్సెల్స్ రెజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో వస్తుంది. ముఖ్యంగా ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 8GB LPDDR5X రామ్, 256GB UFS 2.2 స్టోరేజ్‌తో జత చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
AI Data Centers : ప్రపంచ టెక్ రంగాన్ని వణికిస్తున్న గ్లోబల్ వార్మింగ్.. ఏఐ డేటా సెంటర్లను ముంచెత్తుతున్న హీట్‌వేవ్స్
భారీ బ్యాటరీ, కెమెరా సెటప్
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ లైఫ్. ఇందులో ఏకంగా 6500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది కేవలం కొద్ది నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయ్యేలా 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, వైర్‌లెస్ ఛార్జింగ్ ఇష్టపడే వారి కోసం 30W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. కెమెరాల విషయానికి వస్తే, ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
భద్రత కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. అలాగే ధూళి, నీటి నుంచి ఫోన్‌కు రక్షణ కల్పించేందుకు IP64 రేటింగ్‌ను అందించారు. కనెక్టివిటీ పరంగా ఈ మొబైల్‌లో 5G నెట్‌వర్క్, డ్యూయల్ 4G VoLTE, లేటెస్ట్ బ్లూటూత్ 5.4, వై-ఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి అన్ని రకాల ఆధునిక ఫీచర్లను చేర్చారు.
ప్రకటన
ప్రకటన
Redmi K90 Ultra Launched With Snapdragon 8 Elite Chipset, Cooling Fan and 8,550mAh Battery: Price, Specifications