Motorola Edge 70 Max Sale Begins in India: మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఎమ్మార్పీ ధర రూ.54,999 కాగా, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించారు.
Photo Credit: Motorola
Motorola Edge 70 Max
Motorola Edge 70 Max Sale begins in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా తమ మోస్ట్ అవెయిటెడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ అధికారిక సేల్స్‌ను ఈరోజు నుంచి భారత్‌లో ప్రారంభించింది. కస్టమర్లు ఈ ఫోన్‌ను మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అధునాతన డిస్‌ప్లే ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ మార్కెట్లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ కెపాసిటీ. ఇందులో ఏకంగా 7,100mAh సామర్థ్యం గల భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే కొన్ని రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం.
రూ.5,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ ఆఫర్లతో అదిరిపోయే డిస్కౌంట్లు
ధరల విషయానికి వస్తే, మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఎమ్మార్పీ ధర రూ.54,999 కాగా, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే ఏకంగా రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ప్రారంభ ధర రూ.49,999కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. కొనుగోలుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను కూడా కల్పిస్తున్నారు.
పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్
అసాధారణమైన స్పీడ్, పెర్ఫార్మెన్స్ కోసం ఈ డివైజ్‌లో అత్యంత పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UX ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో మోటోరోలా కొత్తగా పరిచయం చేసిన Motorola Qira AI అసిస్టెంట్‌ను కూడా అందించారు. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.
iQOO : ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. రాబోతున్న ఐకూ తొలి మిని టాబ్లెట్
7000 నిట్స్ బ్రైట్‌నెస్, 2K ఎక్స్‌ట్రీమ్ AMOLED డిస్‌ప్లే
ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల 2K Quad HD+ (1440x3168 పిక్సెల్స్) Extreme AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, ఏకంగా 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించడం వల్ల ఎండలో కూడా డిస్‌ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని ఉపయోగించారు. కెమెరా విభాగంలో వెనుక వైపు f/1.8 అపార్చర్, OIS సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్/మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌లో సరికొత్త రేంజ్
ఈ ఫోన్ రఫ్ అండ్ టఫ్ యూసేజ్ కోసం మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీని అందించే MIL-STD-810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా నీరు, దుమ్ము నుంచి అత్యున్నత రక్షణ కొరకు IP69, IP68, IP66 రేటింగ్‌లతో వస్తుంది. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ సిమ్, 5G, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లకు సపోర్ట్ చేస్తుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 Leak Reveals Major Chipset Upgrade Before Galaxy Unpacked
Samsung Galaxy S26 FE, Galaxy Tab S12 Reportedly Spotted in Google App Listing, Hinting at Imminent Launch
Oppo Find X10 Series Leak Reveals Chipset, Display Details; Find X10 Pro Max Tipped to Get Dimensity 9600 Pro