బ్రెజిల్ మార్కెట్లో విడుదలైన ఈ మోటో జీ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ధరను BRL 2,519గా నిర్ణయించారు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.46,000గా ఉంటుంది.
Photo Credit: Motorola
Moto G Max
Moto G Max : ప్రముఖ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా తన పాపులర్ జీ సిరీస్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ మార్కెట్లోకి సరికొత్త మొబైల్‌ను పరిచయం చేసింది. అదే మోటో జీ మ్యాక్స్. అత్యంత ఆకర్షణీయమైన, ప్రీమియం ఫీచర్లతో రూపొందించబడిన ఈ ఫోన్‌ను కంపెనీ ప్రస్తుతం బ్రెజిల్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. బడ్జెట్, మిడ్-రేంజ్ విభాగంలో వినియోగదారులకు బెస్ట్ టెక్నాలజీని అందించాలనే లక్ష్యంతో మోటోరోలా ఈ సరికొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది.
బ్రెజిల్ మార్కెట్లో విడుదలైన ఈ మోటో జీ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ధరను BRL 2,519గా నిర్ణయించారు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.46,000గా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో కస్టమర్ల కోసం లిస్ట్ చేసింది. దీనిని బ్లూ, గ్రేఫైట్ అనే రెండు విభిన్నమైన, స్టైలిష్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. బ్రెజిల్‌లో విడుదలైన ఈ ఫోన్ చాలా త్వరలోనే భారతదేశంతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఫీచర్ల పరంగా చూస్తే మోటో జీ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దీనిలో 6.8 ఇంచుల పెద్ద AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1.5K రెజల్యూషన్ (1272x2772 పిక్సెల్స్), స్మూత్ 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని డిస్‌ప్లే బ్రైట్‌నెస్. దీనిలో ఏకంగా 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. దీనివల్ల ఎండలో లేదా అవుట్‌డోర్‌లో ఫోన్ స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, స్క్రీన్ రక్షణ కోసం బలమైన Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్‌ను ఇచ్చారు.
Photo Credit: Motorola Brazil
FIFA World Cup 2026 : భారత్‌లో ‘ఫిఫా వరల్డ్ కప్ 2026' హంగామా.. ఉచితంగా చూసే ఛాన్స్ ఎక్కడంటే?
ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి తోడుగా 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజ్‌ను అందించారు. ఇందులో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది, దీని ద్వారా ఫోన్ వేగాన్ని మరింత పెంచుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ సిరీస్‌లో లేటెస్ట్ ఓఎస్‌తో వచ్చిన మొదటి ఫోన్‌లలో ఇది ఒకటి కావడం విశేషం.
కెమెరా లవర్స్ కోసం మోటోరోలా ఈ ఫోన్‌లో ఊహించని రేంజ్ సెటప్‌ను ఇచ్చింది. వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. దీనివల్ల ఫోటోలు చాలా క్లియర్ గా వస్తాయి. దీనితో పాటు 120 డిగ్రీల వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూని సపోర్ట్ చేసే 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు, ఇది 30fps ఫ్రేమ్ రేట్ వద్ద 2K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేయగలదు.
మోటో జీ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 5,200mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ ఏకంగా 35 గంటల వరకు నాన్‌స్టాప్ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. అంతేకాకుండా, ఫోన్‌కు పూర్తి రక్షణ కల్పించేందుకు IP66, IP68, IP69 వంటి మూడు రేటింగ్‌లను ఇచ్చారు. దీనివల్ల ఫోన్ దుమ్ము, నీటి ధారలు, అధిక పీడనం గల నీటి నుంచి సురక్షితంగా ఉంటుంది. వీటికి తోడుగా మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికేషన్ కూడా దీని సొంతం. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, NFC, బ్లూటూత్ 5.4, డ్యూయల్ 5G సిమ్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన