మెటా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్‌లో ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా లైవ్ చాట్స్ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.
Photo Credit: Meta
The features are rolling out across Meta's suite of social media apps
FIFA World Cup 2026 : ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా గురువారం ఒక భారీ ప్రకటన చేసింది. తమ అధీనంలోని థ్రెడ్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్ యాప్స్‌లో ప్రత్యేకంగా ఫుట్‌బాల్ ఆధారిత ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. దీనికోసం అధికారిక బ్రాడ్‌కాస్టర్లు, జాతీయ జట్లు, ప్రముఖ ఆటగాళ్లు, క్రియేటర్లతో మెటా చేతులు కలిపింది.
థ్రెడ్స్ యాప్‌లో లైవ్ చాట్స్ హంగామా
మెటా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్‌లో ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా లైవ్ చాట్స్ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీని ద్వారా మ్యాచ్ జరుగుతున్న సమయంలో లేదా మ్యాచ్‌కు ముందు, తర్వాత ప్రముఖ ఫుట్‌బాల్ విశ్లేషకులు, క్రీడాకారులతో యూజర్లు నేరుగా చర్చల్లో పాల్గొనవచ్చు. మాజీ అర్జెంటీనా స్టార్ స్ట్రైకర్ సెర్గియో అగ్యురో, ఇంగ్లాండ్ మాజీ ఫార్వర్డ్ ప్లేయర్ ఇయాన్ రైట్ వంటి దిగ్గజాలు ఈ లైవ్ సెషన్లను హోస్ట్ చేయనున్నారు. అంతేకాకుండా, థ్రెడ్స్‌లో లైవ్ స్కోర్లు చూసే సదుపాయంతో పాటు ప్రొఫైల్‌పై తమకు నచ్చిన టీమ్ ఫ్లెయిర్లను ప్రదర్శించుకునే వీలుంటుంది.
ఫేస్‌బుక్‌లో అదిరిపోయే ఫుట్‌బాల్ మోడ్, AI జెర్సీ
ఫేస్‌బుక్ యూజర్ల కోసం మెటా ఒక సరికొత్త ఫుట్‌బాల్ మోడ్‌ను డిజైన్ చేసింది. మీ ఫేస్‌బుక్ ఫీడ్ పైభాగంలో ఉండే ఫేస్‌బుక్ లోగోను రెండు సార్లు ట్యాప్ చేయడం ద్వారా ఈ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకమైన ఫుట్‌బాల్ ఎమోజీ రియాక్షన్లు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్, ఒక చిన్న ఫుట్‌బాల్ గేమ్ ఆడేందుకు యాక్సెస్ ఇస్తుంది. దీనితో పాటు వేర్ ఇట్ అనే సరికొత్త AI ఫీచర్‌ను కూడా తెచ్చారు. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన జాతీయ జట్టు జెర్సీని వర్చువల్‌గా ధరించి, ఆ ఫోటోలను తమ ప్రొఫైల్ పిక్చర్లుగా లేదా స్టోరీలుగా షేర్ చేసుకోవచ్చు.
FIFA World Cup 2026 : భారత్‌లో ‘ఫిఫా వరల్డ్ కప్ 2026' హంగామా.. ఉచితంగా చూసే ఛాన్స్ ఎక్కడంటే?
ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్స్‌లో గోల్! యానిమేషన్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుట్‌బాల్ కంటెంట్ కోసం ప్రత్యేకంగా ఒక హబ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ వరల్డ్ కప్‌కు సంబంధించిన క్యూరేటెడ్ రీల్స్, స్టోరీలు మరియు బ్రాడ్‌కాస్టర్ల వీడియోలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజెస్ (DMs) లో ఒక సరికొత్త వాయిస్ ఎఫెక్ట్‌ను జోడించారు. యూజర్లు తమ వాయిస్ మెసేజ్‌లలో Goal! ఎఫెక్ట్‌ను ఉపయోగించినప్పుడు, చాట్ స్క్రీన్‌పై అద్భుతమైన ఫుట్‌బాల్ థీమ్ యానిమేషన్ కనిపిస్తుంది. అలాగే సరికొత్త స్టిక్కర్లు, ఎమోజీలతో చాటింగ్‌ను మరింత రసవత్తరంగా మార్చనున్నారు.
వాట్సాప్ ఎమోజీ మరియు మెసెంజర్ అప్‌డేట్స్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ టోర్నమెంట్ కోసం ప్రసిద్ధ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వాట్సాప్‌లోని సాధారణ ఫుట్‌బాల్ ఎమోజీ స్థానంలో, వరల్డ్ కప్‌లో వాడే అఫీషియల్ ట్రియోండా మ్యాచ్ బాల్ ఎమోజీ తాత్కాలికంగా దర్శనమివ్వనుంది. వాట్సాప్ వీడియో కాల్స్ కోసం ప్రత్యేక ఫుట్‌బాల్ ఫిల్టర్లు, గ్రూప్ చాట్స్ కోసం మెసెంజర్‌లో లైవ్ అప్‌డేట్స్ (గోల్స్, రెడ్ కార్డ్ అలర్ట్స్) రానున్నాయి. చివరిగా, వరల్డ్ కప్ క్రేజ్‌ను వాడుకుని జరిగే టికెట్ స్కామ్‌లు, ఆన్‌లైన్ మోసాలు, అబ్యూస్‌లను అరికట్టేందుకు మెటా యాప్స్ అన్నింటిలోనూ కఠినమైన సేఫ్‌గార్డ్స్, సెక్యూరిటీ నోటీసులను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Great Indian Festival 2026: Gaming Headset Deals Under Rs. 5,000
Amazon Great Indian Festival 2026 Sale: Best Gaming Monitors Under Rs. 20,000
Amazon Great Indian Festival 2026: Best Power Bank Deals