Realme : ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి ధమాకా ఆఫర్.. భారీగా తగ్గిన నార్జో పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర

రియల్‌మి నార్జో పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రూ.35,999 లంచ్ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Realme : ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి ధమాకా ఆఫర్.. భారీగా తగ్గిన నార్జో పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర

Photo Credit: Realme

Realme Narzo Power 5G

ముఖ్యాంశాలు
  • ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్
  • సోనీ 50MP కెమెరా, 144Hz అమోలెడ్ డిస్ప్లే
  • రియల్‌మి కొత్త ఫోన్ ఫీచర్లు అదరహో!
ప్రకటన

Realme : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి మార్చి 2026లో భారత మార్కెట్లోకి విడుదల చేసిన మోస్ట్ పాపులర్ మొబైల్  రియల్‌మి నార్జో పవర్ 5జీ పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. లాంచ్ అయిన రోజు నుంచే తన అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ఈ ఫోన్.. ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. ఏకంగా 31 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కస్టమర్ల కోసం లిస్ట్ చేశారు.

రియల్‌మి నార్జో పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రూ.35,999 లంచ్ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే ప్రారంభ ఆఫర్ల కింద దీనిని రూ.27,999కి విక్రయించారు. కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న ప్రత్యేక డిస్కౌంట్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ ఏకంగా రూ.24,991కే అందుబాటులో ఉంది. అంటే లాంచ్ ధరపై నేరుగా రూ.3,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తోంది. పవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారికి ఇది నిజంగా ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్లు కూడా ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. వారికి అదనంగా రూ.1,250 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లన్నీ కలుపుకుంటే ఫోన్ అసలు ధర కంటే మొత్తం రూ.4,258 వరకు తక్కువకే లభిస్తుంది. దీనితో ఈ స్మార్ట్‌ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.23,741గా మారుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీనిలో ఉన్న బ్యాటరీ సామర్థ్యం. రియల్‌మి నార్జో పవర్ 5జీ లో ఏకంగా 10,001 mAh సామర్థ్యం కలిగిన టైటాన్ బ్యాటరీని అమర్చారు. భారతదేశంలోనే ఒక స్మార్ట్‌ఫోన్‌లో ఇంత పెద్ద బ్యాటరీని ఇవ్వడం ఇదే మొదటిసారి అని కంపెనీ స్పష్టం చేసింది. ఈ భారీ బ్యాటరీ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత యూజర్లు పవర్‌బ్యాంక్‌లను వాడాల్సిన అవసరమే ఉండదు. అంతేకాకుండా, ఈ బ్యాటరీ అధునాతన సాంకేతికతతో రూపొందించబడింది, దీని వల్ల 4 సంవత్సరాల నిరంతర వాడకం తర్వాత కూడా బ్యాటరీ తన 80 శాతం హెల్త్ సామర్థ్యాన్ని అలాగే కాపాడుకుంటుంది.

FIFA World Cup 2026 : భారత్‌లో ‘ఫిఫా వరల్డ్ కప్ 2026' హంగామా.. ఉచితంగా చూసే ఛాన్స్ ఎక్కడంటే?

 
ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్ప్లేను అందించారు. ఇది 1280 × 2800 పిక్సెల్స్ రెజల్యూషన్, అల్ట్రా స్మూత్ 144Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. దీనికి తోడుగా మాలి G615 MC2 గ్రాఫిక్స్ కార్డ్‌ను ఇచ్చారు. గేమర్ల కోసం ప్రత్యేకంగా దీనిలో HyperVision+ AI చిప్‌ను వాడారు. ఇది BGMI వంటి భారీ గ్రాఫిక్స్ గేమ్స్‌ను కూడా 90fps హై-ఫ్రేమ్ రేట్‌తో ఎలాంటి లాగ్స్ లేకుండా ఆడటానికి సహాయపడుతుంది, అలాగే పవర్ కన్జప్షన్‌ను చాలా వరకు తగ్గిస్తుంది.

ఈ ఫోన్ 8GB LPDDR4X ర్యామ్‌తో పాటు 128GB, 256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. అదనంగా వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా దీనిని మరో 14GB వరకు పెంచుకునే సదుపాయం కూడా ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే, వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్ మరియు 2-Axis OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను అమర్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సోనీ IMX480 కెమెరాను ఇచ్చారు, ఇది 1080p క్వాలిటీతో వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

#తాజా కథనాలు
  1. Vi 5G : వోడాఫోన్ ఐడియా యూజర్లకు పండగే.. తమిళనాడులోని మరో మూడు పెద్ద నగరాల్లో Vi 5G లాంచ్
  2. Realme : ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి ధమాకా ఆఫర్.. భారీగా తగ్గిన నార్జో పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర
  3. Moto G Max : మోటోరోలా నుంచి సరికొత్త మోటో జీ మ్యాక్స్ లాంచ్.. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు
  4. FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫుట్‌బాల్ మోడ్.. ఎలా వాడాలో తెలుసా?
  5. FIFA World Cup 2026 : భారత్‌లో ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ హంగామా.. ఉచితంగా చూసే ఛాన్స్ ఎక్కడంటే?
  6. YouTube : లింకులు కాపీ చేసే శ్రమ తప్పింది.. ఇకపై యూట్యూబ్‌లోనే డైరెక్ట్ మెసేజ్ పంపొచ్చు
  7. Lenovo Yoga Earbuds : లెనోవో నుంచి సరికొత్త యోగా ఇయర్‌బడ్స్.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్
  8. Lingam OTT Release : ఓటీటీలోకి మరో మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్.. లింగం సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
  9. OnePlus N6 : భారత్‌లోకి వన్‌ప్లస్ సరికొత్త బడ్జెట్ ఫోన్.. వన్‌ప్లస్ N6 లాంచ్ అప్‌డేట్
  10. Tecno Pova 8 Review : అదిరిపోయే లుక్స్.. భారీ బ్యాటరీ.. కానీ ఆ రేటు పెట్టొచ్చా ?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »