F35 సిరీస్‌తో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒప్పో ఫైండ్ X9s ప్రొ మోడల్‌ను కూడా కంపెనీ త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Oppo F33 5G
Oppo F35 Series : చైనీస్ దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లో తన ప్రాచుర్యం పొందిన 'F' సిరీస్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలోనే భారత మార్కెట్లో ఒప్పో F35 సిరీస్‌ను అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉందని లీకుల ద్వారా సమాచారం వెలువడింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు నిర్వహించే అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభానికి ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ దేబాయన్ రాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా పంచుకున్నారు.
ఒప్పో ఫైండ్ X9s ప్రొ కూడా త్వరలోనే ఎంట్రీ
F35 సిరీస్‌తో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒప్పో ఫైండ్ X9s ప్రొ మోడల్‌ను కూడా కంపెనీ త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారంపై కంపెనీ ఇంకా అధికారిక ముద్ర వేయలేదు. ప్రస్తుతం Bureau of Indian Standards (BIS) వంటి భారతీయ సర్టిఫికేషన్ వేదికలపై ఈ స్మార్ట్‌ఫోన్‌ల లిస్టింగ్ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి రాబోయే కొన్ని వారాల్లో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి లీకులు, స్పష్టమైన అధికారిక వివరాలు వెలువడే అవకాశముంది.
ఒప్పో F33 సిరీస్ ప్రీవియస్ సక్సెస్,స్పెసిఫికేషన్లు
ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ ఒప్పో F33 5G, ఒప్పో F33 ప్రో 5G మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఒప్పో F33 5G: ఈ ఫోన్ 6.57-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 MAX ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్ అందించారు. డ్యూయల్ రియర్ కెమెరాలో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, ఫ్రంట్‌లో 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లోని భారీ 7,000 mAh బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Boltt Evo 4G : ఐఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బోల్ట్ ఫోన్ రెడీ.. ఫస్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్
ఒప్పో F33 ప్రో 5G: ఈ ప్రో మోడల్‌లో కూడా 6.57-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6360 Max చిప్‌సెట్‌లను వాడారు. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరాలో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు, ఫ్రంట్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం పవర్ ఫుల్ 50MP కెమెరాను పొందుపరిచారు.
కొత్త F35 మోడల్‌పై భారీ అంచనాలు
గతంలో వచ్చిన F33 సిరీస్ డిజైన్, కెమెరా పరంగా మంచి ఆదరణ పొందడంతో, రాబోయే కొత్త ఒప్పో F35 సిరీస్‌పై వినియోగదారులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త మోడళ్లలో మరింత మెరుగైన బ్యాటరీ లైఫ్, అప్‌గ్రేడెడ్ కెమెరా సెన్సార్లు, సరికొత్త ప్రాసెసర్‌ను అందిస్తారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పండుగ వాతావరణం రాబోతున్న నేపథ్యంలో ఒప్పో ఈ కొత్త సిరీస్‌తో భారీ స్థాయి విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రకటన
ప్రకటన
Microsoft Reportedly Making Xbox 360 Games Backwards Compatible on PC and Project Helix