Redmi Turbo 5 : 100W ఫాస్ట్ చార్జింగ్, డైమెన్సిటీ 8500 ఆల్ట్రా ప్రాసెసర్.. భారత మార్కెట్లోకి రెడ్‌మి కొత్త పవర్‌హౌస్

రెడ్‌మి టర్బో 5 రెండు వేరియంట్లలో లభిస్తోంది. దీని బేస్ వేరియంట్ అయిన 8GB రామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ.37,999 గా ఉంది.

Redmi Turbo 5 : 100W ఫాస్ట్ చార్జింగ్, డైమెన్సిటీ 8500 ఆల్ట్రా ప్రాసెసర్.. భారత మార్కెట్లోకి రెడ్‌మి కొత్త పవర్‌హౌస్

Photo Credit: Redmi

Redmi Turbo 5

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి రెడ్‌మి కొత్త పవర్‌హౌస్
  • ఏకంగా 7540mAh మైటీ బ్యాటరీ
  • 100W ఫాస్ట్ చార్జింగ్, డైమెన్సిటీ 8500 ఆల్ట్రా ప్రాసెసర్
ప్రకటన

Redmi Turbo 5 : భారతదేశంలో బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్‌మి బ్రాండ్, తన సరికొత్త టర్బో సిరీస్‎ను భారతీయులకు పరిచయం చేసింది. ఈ సిరీస్ లో భాగంగా మొట్టమొదటి మొబైల్ రెడ్‌మి టర్బో 5‎ను అధికారికంగా లాంచ్ చేసింది. గతంలోనే చైనా మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ అక్కడ సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఇండియన్ యూజర్లను టార్గెట్ చేస్తూ అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో దీన్ని మనదేశంలోకి తీసుకొచ్చారు.

రెడ్‌మి టర్బో 5 ధర, ఆఫర్ల వివరాలు
ధరల విషయానికి వస్తే, రెడ్‌మి టర్బో 5 రెండు వేరియంట్లలో లభిస్తోంది. దీని బేస్ వేరియంట్ అయిన 8GB రామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ.37,999 గా ఉంది. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12GB రామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర దాదాపు రూ.40,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ, టర్బో వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. జూన్ 19 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్, అఫీషియల్ వెబ్‌సైట్ Mi.com లతో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో దీని సేల్స్ ప్రారంభమయ్యాయి. లాంచ్ ఆఫర్ కింద సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.2,000 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

అద్భుతమైన ఫ్లూయిడ్ డిస్‌ప్లే, ప్రొటెక్షన్
ఈ ఫోన్ యొక్క డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఇందులో 6.59 ఇంచుల 1.5K ఫ్లూయిడ్ డిస్‌ప్లేను అందించారు, ఇది 2712×1220 పిక్సెల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. స్క్రీన్ స్మూత్‌నెస్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్‌డీఆర్10+ (HDR10+), డాల్బీ విజన్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను ఇచ్చారు. స్క్రీన్ పగలకుండా రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను వాడారు. వీటన్నింటితో పాటు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69K లాంటి పటిష్టమైన రేటింగ్స్ ఇందులో ఉన్నాయి.

7540mAh మైటీ బ్యాటరీ, చార్జింగ్ పవర్
రెడ్‌మి టర్బో 5  అతిపెద్ద హైలైట్ దాని బ్యాటరీ లైఫ్. ఇందులో ఏకంగా 7540mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. హెవీగా ఫోన్ వాడే వారికి సైతం ఈ బ్యాటరీ చాలా రోజుల పాటు బ్యాకప్ ఇస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీని త్వరగా చార్జ్ చేయడానికి 100W సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ను కూడా అందించారు. ఇది మాత్రమే కాకుండా, మీ ఫోన్ ద్వారా ఇతర చిన్న చిన్న డివైజ్‌లను చార్జ్ చేసుకోవడానికి వీలుగా 27W రివర్స్ వైర్డ్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం.

టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్, కూలింగ్ సిస్టమ్
హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఆల్ట్రా ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది అల్ట్రా-ఫాస్ట్ LPDDR5X రామ్, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వర్చువల్ రామ్ ఎక్స్‌పాన్షన్ ఫీచర్ ద్వారా ఫోన్ రామ్ ను అదనంగా మరో 12GB వరకు పెంచుకోవచ్చు. ఫోన్ ఎక్కువసేపు వాడినా లేదా గేమింగ్ ఆడినా వేడెక్కకుండా కంట్రోల్ చేయడానికి ఇందులో స్పెషల్  3D ఐస్-లూప్ కూలింగ్ సిస్టమ్‎ను ఏర్పాటు చేశారు.

Google : గూగుల్ అదిరిపోయే గుడ్ న్యూస్.. అధికారికంగా వచ్చేసిన సరికొత్త ఆండ్రాయిడ్ 17 ఓఎస్

అదిరిపోయే కెమెరా క్వాలిటీ, సాఫ్ట్‌వేర్
ఫోటోగ్రఫీ పరంగా చూస్తే రెడ్‌మి టర్బో 5 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, EIS సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీー కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 పై రన్ అవుతుంది. ప్రీమియం లుక్ కోసం ఎయిరోస్పేస్-గ్రేడ్ మెటల్ ఫ్రేమ్ వాడినప్పటికీ, ఫోన్ మందం కేవలం 8.18mm మాత్రమే ఉంటుంది. టీవీలు, ఏసీలను కంట్రోల్ చేయడానికి వీలుగా ఇందులో ఐఆర్ బ్లాస్టర్ ఫీచర్ ని కూడా యథావిధిగా కొనసాగించారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల జాతర.. దృశ్యం 3తో పాటు క్రేజీ సినిమాలు, సిరీస్‌లు
  2. OnePlus Nord Buds : వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్.. భారత్‌లో లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ
  3. Google : ఇకపై అవతలి వాళ్ల భాషతో టెన్షన్ లేదు.. రియల్ టైమ్‎లో వాయిస్‎ను మార్చేసే అద్భుత టెక్నాలజీ
  4. Redmi Turbo 5 : 100W ఫాస్ట్ చార్జింగ్, డైమెన్సిటీ 8500 ఆల్ట్రా ప్రాసెసర్.. భారత మార్కెట్లోకి రెడ్‌మి కొత్త పవర్‌హౌస్
  5. Sharp AQUOS R11 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్.. షార్ప్ ఆక్వోస్ ఆర్11 లాంచ్
  6. Samsung : ఒక్కసారి చార్జ్ చేస్తే 22 గంటల బ్యాకప్.. శాంసంగ్ ప్రీమియం లాప్‌టాప్ ఫీచర్లు అదరహో
  7. Airtel : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.4,000 విలువైన అడోబ్ ప్రీమియం సేవలు ఫ్రీ
  8. Hisense TV : స్మార్ట్ టీవీ లవర్స్ కి గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్స్‎తో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హైసెన్స్ E8S సిరీస్
  9. Smartphone Comparison : రూ.30 వేల బడ్జెట్‌లో మూడు బెస్ట్ ఆప్షన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
  10. Samsung : రూ.60 వేల లోపే శామ్‌సంగ్ ఫ్లిప్ ఫోన్.. అమెజాన్‌లో అదిరిపోయే బంపర్ డిస్కౌంట్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »