Vivo T5 Lite 5G : బడ్జెట్ ధరలో వీవో కొత్త స్కెచ్.. త్వరలోనే ఇండియాలోకి వీవో టీ5 లైట్ 5జీ

వీవో టీ5 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6.74-ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

Vivo T5 Lite 5G : బడ్జెట్ ధరలో వీవో కొత్త స్కెచ్.. త్వరలోనే ఇండియాలోకి  వీవో టీ5 లైట్ 5జీ

Vivo T5 Lite 5G

ముఖ్యాంశాలు
  • త్వరలోనే ఇండియాలోకి ‘వీవో టీ5 లైట్ 5జీ’
  • 6500mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50 ఎంపీ కెమెరా
ప్రకటన

Vivo T5 Lite 5G : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్, మిడ్‌రేంజ్ విభాగంలో గట్టి పట్టు సాధించేందుకు ప్రముఖ మొబైల్ దిగ్గజం వీవో సరికొత్త ప్లాన్ సిద్ధం చేసింది. తన సక్సెస్‌ఫుల్ టీ-సిరీస్‎ను మరింత అప్‌డేట్ చేస్తూ.. త్వరలోనే వీవో టీ5 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయబోతోంది. ప్రముఖ మీడియా నివేదికల ప్రకారం.. ఈ అప్‌కమింగ్ మొబైల్ తక్కువ ధరలోనే అదిరిపోయే బ్యాటరీ లైఫ్, రోజువారీ పనులకు సరిపోయే పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

ఈ లీకైన వివరాల ప్రకారం.. వీవో టీ5 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6.74-ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రీఫ్రెష్ రేట్, ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో నమ్మకమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఫోన్ కస్టమర్లకు మూడు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అందులో బేస్ మోడల్ 4GB రేమ్ + 128GB స్టోరేజ్ కాగా, మిగతా రెండు మోడల్స్ 6GB + 128GB, 6GB + 256GB ఆప్షన్లతో లభించనున్నాయి.

సాధారణంగా బడ్జెట్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం 5000mAh వరకు ఉంటుంది. కానీ వీవో ఒకడుగు ముందుకు వేసి ఈ లైట్ మోడల్‌లో ఏకంగా 6,500 mAh భారీ బ్యాటరీని అమర్చబోతోంది. దీనికి తోడు ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేయడానికి 44W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన రియర్ కెమెరా యూనిట్ ఉండనుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఈ ఫోన్ ట్విలైట్ షాడో, వేవ్ బ్లూ అనే రెండు స్టైలిష్ కలర్ ఆప్షన్లలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.


Gmail Tips : జీమెయిల్‌లో దాగున్న సీక్రెట్ ఆప్షన్.. బ్లూ కలర్ సెండ్ బటన్ పక్కనే ఉంది గమనించారా?

ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో కేవలం లైట్ మోడల్ మాత్రమే కాకుండా.. వీవో టీ5, వీవో టీ5ఎక్స్ 5జీ, వీవో టీ5 ప్రో 5జీ మోడల్స్ కూడా అలరించనున్నాయి. వీటన్నింటిలో వీవో టీ5ఎక్స్ 5జీ మోడల్ ఫీచర్లు మరింత అద్భుతంగా ఉన్నాయి. ఇందులో 6.76-ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది కూడా 120Hz రీఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం ఇందులో సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌ను వాడారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 6 పై రన్ అవుతుంది.

వీవో టీ5ఎక్స్ 5జీ ఫోన్ కెమెరా, బ్యాటరీ పరంగా సూపర్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దీని వెనుక భాగంలో f/1.8 అపెర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం ఏకంగా 32 మెగాపిక్సెల్ హై-క్వాలిటీ ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం. అన్నింటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే.. ఈ ఫోన్ ఏకంగా 7,200 mAh మెగా పవర్‌హౌస్ బ్యాటరీతో వస్తుంది. దీనికి కూడా 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సేఫ్టీ కోసం ఫోన్ సైడ్ భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, మంచి పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ సరికొత్త వీవో సిరీస్ ఫోన్లు బెస్ట్ ఆప్షన్ కానున్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Redmi Turbo 5 :165Hz రీఫ్రెష్ రేట్, 9000mAh బ్యాటరీ.. భారత మార్కెట్లోకి రెడ్‌మీ టర్బో 5 గ్రాండ్ ఎంట్రీ
  2. Vivo T5 Lite 5G : బడ్జెట్ ధరలో వీవో కొత్త స్కెచ్.. త్వరలోనే ఇండియాలోకి వీవో టీ5 లైట్ 5జీ
  3. WhatsApp : నో స్క్రీన్‌షాట్, నో ఫార్వర్డ్.. వాట్సాప్‌లో ఒక్కసారి చదవగానే మాయమైపోయే సీక్రెట్ మెసేజ్ ఫీచర్
  4. Vacuum Cleaner : ఇంటి పనికి ఇక గుడ్‌బై.. భారత్‌లోకి డ్రీమీ సరికొత్త రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్
  5. LYNE : కేవలం రూ. 1,649 ధరకే.. 10,000mAh బ్యాటరీ సామర్థ్యం.. LYNE Startup 87 లాంచ్
  6. Social Media Ban : బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 16 ఏళ్ల లోపు వారికి నో ఫేస్‌బుక్, నో ఇన్‌స్టా
  7. Tesla : ఒక్క చార్జ్‌తో 681 కిలోమీటర్ల ప్రయాణం.. భారత్‌లో లగ్జరీ ఈవీ మోడల్ Y L డెలివరీలు షురూ
  8. Telegram : నీట్ ఎగ్జామ్ ముందర కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం
  9. Samsung : ఫోల్డబుల్ మొబైల్స్ లో శామ్‌సంగ్ సరికొత్త విప్లవం.. స్క్రీన్‌పై క్రీజ్ సమస్యకు శాశ్వతంగా చెక్
  10. WhatsApp : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. మీ అకౌంట్ హ్యాక్ అయితే రికవర్ చేసుకోవడం ఎలా?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »