Sharp AQUOS R11 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్.. షార్ప్ ఆక్వోస్ ఆర్11 లాంచ్

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఫోన్ లో డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా విభాగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.

Sharp AQUOS R11 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్.. షార్ప్ ఆక్వోస్ ఆర్11 లాంచ్

Photo Credit: Sharp

Sharp AQUOS R11

ముఖ్యాంశాలు
  • ఫోటోగ్రఫీ ప్రియుల కోసం షార్ప్ అదిరిపోయే గిఫ్ట్
  • 3600 నిట్స్ బ్రైట్‌నెస్, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్
  • వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ రేటింగ్స్ తో పవర్ ఫుల్ బిల్డ్ క్వాలిటీ
ప్రకటన

Sharp AQUOS R11 : ప్రముఖ టెక్నాలజీ సంస్థ షార్ప్, ప్రీమియం మొబైల్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షార్ప్ ఆక్వోస్ ఆర్11ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఫోన్ లో డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా విభాగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మార్కెట్లో ఉన్న ఇతర లగ్జరీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేలా షార్ప్ ఈ డివైజ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది.

కళ్లు చెదిరే ప్రో ఐజీజో ఓఎల్ఈడీ డిస్‌ప్లే
డిస్‌ప్లే విషయానికి వస్తే, షార్ప్ ఆక్వోస్ ఆర్11 లో 6.5 ఇంచుల ప్రో ఐజీజో ఓఎల్ఈడీ స్క్రీన్ ను అందించారు. ఇది 2340 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో అద్భుతమైన విజువల్స్ ను అందిస్తుంది. ఈ స్క్రీన్ ప్రధాన హైలైట్ ఏమిటంటే.. ఇది ఏకంగా 3600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ను రీచ్ అవ్వగలదు. దీనివల్ల ఎంతటి తీవ్రమైన ఎండలోనైనా సరే స్క్రీన్ పై ఉన్న అక్షరాలు, వీడియోలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మోడ్రన్ లుక్ కోసం ఇందులో పంచ్-హోల్ డిజైన్ ను ఉపయోగించారు.

స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 పవర్‌ఫుల్ ప్రాసెసర్
హెవీ మల్టీటాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్ సులభంగా సాగిపోయేలా ఈ ఫోన్ లో క్వాల్కమ్ సంస్థకు చెందిన అత్యంత శక్తివంతమైన  స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను అమర్చారు. దీనికి తోడుగా 12GB రామ్, భారీ స్థాయిలో 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను అందించారు. ఈ కాంబినేషన్ వల్ల ఫోన్ అస్సలు లాగ్ అవ్వకుండా రాకెట్ వేగంతో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 5100mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంది, ఇది 36W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

లైకా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఈ ఫోన్ ఒక వరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కెమెరా తయారీ సంస్థ  లైకా పర్యవేక్షణలో రూపొందించిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను ఇచ్చారు. ఇందులో 50.3 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50.3 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 38.5 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ కెమెరా సిస్టమ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేటిక్ జూమ్ ఫీచర్ ను కూడా జోడించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో ఏకంగా 50.3 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ కెమెరా ఉండటం విశేషం.

Google : గూగుల్ అదిరిపోయే గుడ్ న్యూస్.. అధికారికంగా వచ్చేసిన సరికొత్త ఆండ్రాయిడ్ 17 ఓఎస్

ప్రశాంతమైన నిద్ర కోసం బ్రీతింగ్ లైట్ ఫీచర్
ఈ స్మార్ట్‌ఫోన్ లో అందరినీ ఆకట్టుకునే సరికొత్త ఫీచర్ బ్రీతింగ్ లైట్. కెమెరా మాడ్యూల్ లోపల ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ను ఇంటిగ్రేట్ చేశారు. ఇది ప్రకృతి సిద్ధమైన ఎనిమిది విభిన్న రంగుల్లో వెలుగుతుంది. ఈ లైటింగ్ ను ఫోన్ లోని వైట్ నాయిస్ మోడ్తో కలిపి ఆన్ చేసినప్పుడు.. అది యూజర్ల మానసిక ఒత్తిడిని తగ్గించి, రాత్రి వేళల్లో ప్రశాంతమైన నిద్ర పట్టేలా సహాయపడుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

ధర, లభ్యత, పటిష్టమైన రక్షణ
కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ లో లేటెస్ట్ వై-ఫై 7, బ్లూటూత్ 6.0 సపోర్ట్ ఉన్నాయి. ఫోన్ కి ఎలాంటి నీటి ప్రమాదాలు లేదా ధూళి వల్ల నష్టం జరగకుండా ఐపీఎక్స్5, ఐపీఎక్స్8, ఐపీఎక్స్9, ఐపీ6ఎక్స్ లాంటి అత్యున్నత రక్షణ రేటింగ్స్ ఇచ్చారు. షార్ప్ ఆక్వోస్ ఆర్11 స్మార్ట్‌ఫోన్ నేవీ బ్లూ, ఐవరీ ఎల్లో, టెర్రకోట రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. జపాన్ లో దీని అమ్మకాలు జూలై 9, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్కడ దీని ధర JPY 1,63,899గా నిర్ణయించారు, అంటే మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.96,000గా ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల జాతర.. దృశ్యం 3తో పాటు క్రేజీ సినిమాలు, సిరీస్‌లు
  2. OnePlus Nord Buds : వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్.. భారత్‌లో లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ
  3. Google : ఇకపై అవతలి వాళ్ల భాషతో టెన్షన్ లేదు.. రియల్ టైమ్‎లో వాయిస్‎ను మార్చేసే అద్భుత టెక్నాలజీ
  4. Redmi Turbo 5 : 100W ఫాస్ట్ చార్జింగ్, డైమెన్సిటీ 8500 ఆల్ట్రా ప్రాసెసర్.. భారత మార్కెట్లోకి రెడ్‌మి కొత్త పవర్‌హౌస్
  5. Sharp AQUOS R11 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్.. షార్ప్ ఆక్వోస్ ఆర్11 లాంచ్
  6. Samsung : ఒక్కసారి చార్జ్ చేస్తే 22 గంటల బ్యాకప్.. శాంసంగ్ ప్రీమియం లాప్‌టాప్ ఫీచర్లు అదరహో
  7. Airtel : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.4,000 విలువైన అడోబ్ ప్రీమియం సేవలు ఫ్రీ
  8. Hisense TV : స్మార్ట్ టీవీ లవర్స్ కి గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్స్‎తో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హైసెన్స్ E8S సిరీస్
  9. Smartphone Comparison : రూ.30 వేల బడ్జెట్‌లో మూడు బెస్ట్ ఆప్షన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
  10. Samsung : రూ.60 వేల లోపే శామ్‌సంగ్ ఫ్లిప్ ఫోన్.. అమెజాన్‌లో అదిరిపోయే బంపర్ డిస్కౌంట్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »