భారతీయ మార్కెట్లోకి మోటోరోలా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ను జూన్ 4న విడుదల చేయనుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక స్టోర్లలో లభిస్తుంది.
Photo Credit: Motorola
Motorola Edge 70 Pro+ is expected to feature a Dimensity 8500 chipset
Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి జూన్ నెల సూపర్ గుడ్ న్యూస్ మోసుకొస్తోంది. మోటోరోలా, షియోమి, శామ్‌సంగ్, ఒప్పో, లావా వంటి దిగ్గజ బ్రాండ్లు తమ సరికొత్త మొబైల్స్‌ను మార్కెట్లో లాంచ్ చేయడానికి లైన్లో పెట్టాయి. ఫ్లాగ్‌షిప్ రేంజ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ల వరకు జూన్ మొదటి వారంలోనే సందడి చేయబోతున్న ఆయా ఫోన్ల వివరాలు, ఫీచర్లు, లాంచ్ తేదీలపై ఓ లుక్కేయండి.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+
భారతీయ మార్కెట్లోకి మోటోరోలా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ను జూన్ 4న విడుదల చేయనుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక స్టోర్లలో లభిస్తుంది. ఇది పాంటోన్ చికోరి కాఫీ, పాంటోన్ స్టార్మీ సీ, జిన్‌ఫాండెల్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. కెమెరా పరంగా ఇందులో సోనీ LYT-710 సెన్సార్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, 50x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండటం విశేషం. పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్, 16GB వరకు ర్యామ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని అంచనా.
లైకా కెమెరాతో షియోమి 17T
షియోమి ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న షియోమి 17T కూడా జూన్ 4నే భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఫోన్‌లో లైకా ట్యూన్డ్ కెమెరా సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్ గల 50 ఎంపీ పెరిస్కోప్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. అంతేకాదు, ఏకంగా 6,500mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీతో పాటు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కల్పించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8500-అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్‌లో 6.59 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు.
![]()
బడ్జెట్ ధరలో లావా బోల్డ్ N2 5G
తక్కువ బడ్జెట్‌లో 5G ఫోన్ కావాలనుకునే వారి కోసం దేశీయ బ్రాండ్ లావా నుంచి లావా బోల్డ్ N2 5G జూన్ 3న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ ఫోన్ అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానున్న ఈ మొబైల్ వెనుక వైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉండనున్నాయి. ఈ ఏడాది మొదట్లో రూ.7,499 ప్రారంభ ధరతో వచ్చిన లావా బోల్డ్ N2 4G మోడల్ కంటే ఇది ఎన్నో అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో వస్తోందని సమాచారం.
హ్యువావే నోవా 16 సిరీస్
ప్రముఖ చైనీస్ బ్రాండ్ హ్యువావే తన నోవా 16 సిరీస్‌ను జూన్ 1న చైనాలో అధికారికంగా విడుదల చేస్తోంది. ఈ సిరీస్‌లో నోవా 16, నోవా 16 ప్రో, నోవా 16 అల్ట్రా అనే మూడు మోడల్స్ రాబోతున్నాయి. ఇందులో అల్ట్రా వేరియంట్ అన్నింటికంటే పెద్ద స్క్రీన్, ఏకంగా 1TB వరకు భారీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. ఈ ఫోన్లు స్టారీ నైట్ బ్లాక్, స్కై బ్లూ, స్కై వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ప్రీ-బుకింగ్స్ జరుపుకుంటున్నాయి.
![]()
మార్కెట్లోకి శామ్‌సంగ్ గెలాక్సీ A27, గెలాక్సీ M47
శామ్‌సంగ్ కంపెనీ కూడా త్వరలోనే గెలాక్సీ A27, గెలాక్సీ M47 మోడళ్లను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ రెండు ఫోన్లలోనూ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. గెలాక్సీ M47 మోడల్ ధర దాదాపు రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉండవచ్చని టాక్. ఈ ఫోన్లలో 6.7 ఇంచుల డిస్ప్లే, 50 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ సెల్ఫీ కెమెరాలతో పాటు గెలాక్సీ M47లో 5,000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి.
ఒప్పో A6c
ఒప్పో నుంచి వస్తున్న బడ్జెట్ ఫోన్ ఒప్పో A6c జూన్ మొదటి వారంలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని బేస్ వేరియంట్ (4GB ర్యామ్ + 64GB స్టోరేజ్) ధర సుమారు రూ.13,999 ఉండవచ్చని, 128GB వేరియంట్ ధర రూ.16,999 ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల HD+ ఎల్‌సీడీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్, 13 ఎంపీ కెమెరా, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం 6,500mAh భారీ బ్యాటరీని అందించనున్నారు.
ప్రకటన
ప్రకటన