సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇస్తే సరిపోతుంది. కానీ ఈ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకుంటే, పాస్‌వర్డ్‌తో పాటు మీ మొబైల్‌కు వచ్చే ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ కోడ్‌ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Photo Credit: Pixabay/ Solen Feyissa
Here's how you can enable two-factor authentication on Instagram
Instagram : ఈ రోజుల్లో సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురవడం సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది కేవలం బలమైన పాస్‌వర్డ్ పెడితే సరిపోతుందని అనుకుంటారు. కానీ హ్యాకర్లు కొత్త కొత్త టెక్నాలజీలతో మీ అకౌంట్లను గుల్ల చేస్తున్నారు. ప్రముఖ ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల భద్రత కోసం టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్(2FA) అనే అదిరిపోయే ఫీచర్‌ను అందిస్తోంది. దీనిని ఆన్ చేసుకుంటే మీ పాస్‌వర్డ్ వేరే వాళ్లకు తెలిసినా కూడా అకౌంట్ ఓపెన్ చేయలేరు. ఈ ఫీచర్‌ని మొబైల్‌లో ఎలా ఆన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.
టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) అంటే ఏమిటి?
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇస్తే సరిపోతుంది. కానీ ఈ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకుంటే, పాస్‌వర్డ్‌తో పాటు మీ మొబైల్‌కు వచ్చే ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ కోడ్‌ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీ అకౌంట్‌కు డబుల్ లేయర్ సెక్యూరిటీ లభిస్తుంది. ఒకవేళ మీ పాస్‌వర్డ్ ఆన్‌లైన్‌లో లీక్ అయినా లేదా మీ ఫ్రెండ్స్‌కు తెలిసినా సరే.. మీ ఫోన్‌కు వచ్చే ఆ ఓటీపీ లేదా అథెంటికేషన్ కోడ్ లేనిదే వారు మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వలేరు.
కోడ్ పొందడానికి ఏ పద్ధతి బెస్ట్?
ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ కోడ్ పొందడానికి మనకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి థర్డ్ పార్టీ అథెంటికేషన్ యాప్స్ ఉపయోగించడం, రెండు ఎస్ఎమ్ఎస్ లేదా వాట్సాప్ ద్వారా ఓటీపీ పొందడం. అయితే గూగుల్ అథెంటికేటర్ లేదా డ్యూఓ మొబైల్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడటమే మంచిదని ఇన్‌స్టాగ్రామ్ సూచిస్తోంది. ఎందుకంటే ఈ యాప్స్‌లో వచ్చే కోడ్‌లు ప్రతి కొన్ని నిమిషాలకు ఆటోమేటిక్‌గా మారిపోతాయి. ఒకవేళ ఎవరైనా మీ ఫోన్‌ను రిమోట్ యాక్సెస్ ద్వారా చూస్తున్నా, పాత ఓటీపీలతో మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను హ్యాక్ చేయడం అస్సలు కుదరదు.
అథెంటికేషన్ యాప్ ద్వారా 2FA ఎలా ఆన్ చేయాలి?
థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌కు డబుల్ సెక్యూరిటీ పెట్టడం చాలా సులువు:
* మొదట మీ ఫోన్ లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.
* స్క్రీన్ కింద కుడి వైపు మూలలో ఉన్న మీ ప్రొఫైల్ పిక్చర్ పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు పైన కుడి వైపు ఉన్న మూడు అడ్డ గీతలను(Menu) ట్యాప్ చేసి సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీలోకి వెళ్లండి.
* అక్కడ Accounts Centre ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
* తర్వాతి పేజీలో పాస్‌వర్డ్ అండ్ సెక్యూరిటీ బటన్ నొక్కండి.
* ఇప్పుడు పైన కనిపించే టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* మీరు ఏ అకౌంట్‌కు సెక్యూరిటీ పెట్టాలనుకుంటున్నారో ఆ యూజర్‌నేమ్ సెలెక్ట్ చేసుకోండి.
* ఇక్కడ అథెంటికేషన్ యాప్ ఆప్షన్‌ను ఎంచుకుని నెక్స్ట్ నొక్కండి.
* ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఒక అథెంటికేషన్ కీని చూపిస్తుంది. దానిని కాపీ చేసి మీ గూగుల్ అథెంటికేటర్ యాప్‌లో పేస్ట్ చేయండి (లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి).
* ఆ యాప్ జనరేట్ చేసే 6 అంకెల కోడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంటర్ చేస్తే మీ అకౌంట్‌కు యాప్ బేస్డ్ సెక్యూరిటీ ఆన్ అయిపోతుంది.
Credit Card : మీ ఏటీఎం, క్రెడిట్ కార్డ్ పోయిందా..? అయితే వెంటనే ఈ పని చేయండి
వాట్సాప్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా సెక్యూరిటీ సెట్ చేసుకునే విధానం
మీకు యాప్స్ వాడటం కష్టంగా అనిపిస్తే నేరుగా మొబైల్ నంబర్‌కే ఓటీపీ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు:
* పైన చెప్పుకున్నట్లే మొదటి నుంచి 7వ స్టెప్ వరకు ఫాలో అయ్యి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ పేజీకి రండి.
* అక్కడ 'SMS' లేదా 'WhatsApp' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని 'నెక్స్ట్' క్లిక్ చేయండి.
* మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు లింక్ చేయాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి 'నెక్స్ట్' నొక్కండి.
* ఇప్పుడు మీ వాట్సాప్ నంబర్‌కు 6 అంకెల సెక్యూరిటీ కోడ్ వస్తుంది. (ఒకవేళ సాధారణ మెసేజ్ కావాలంటే కింద ఉండే 'Get code via SMS instead' నొక్కవచ్చు).
* ఆ కోడ్‌ను ఇన్‌స్టాగ్రామ్ బాక్స్‌లో ఎంటర్ చేసి నెక్స్ట్ నొక్కితే ప్రాసెస్ పూర్తవుతుంది. ఇకపై మీరు ఎప్పుడు కొత్త డివైజ్‌లో లాగిన్ అయినా మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఇన్‌స్టాగ్రామ్‌లో టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎందుకు ఆన్ చేయాలి?
ఇది ఆన్ చేయడం వల్ల మీ అనుమతి లేకుండా, మీ పాస్‌వర్డ్ తెలిసినా కూడా వేరే వాళ్లు మీ అకౌంట్ ఓపెన్ చేయలేరు.
2. థర్డ్ పార్టీ అథెంటికేషన్ యాప్స్ వాడటం మంచిదేనా?
అవును, ఎస్ఎమ్ఎస్ ఓటీపీల కంటే గూగుల్ అథెంటికేటర్ వంటి యాప్స్ వాడటం చాలా సురక్షితమని ఇన్‌స్టాగ్రామ్ స్వయంగా రికమండ్ చేస్తోంది.
3. ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ కోడ్‌లను ఎక్కడికి పంపుతుంది?
యూజర్ ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి సాధారణ ఎస్ఎమ్ఎస్ (SMS) లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా కోడ్‌లను పంపుతుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Amazfit Cheetah 2 Ultra
Starts from ₹54,999
JBL Tune 780NC Wireless Headphones
Starts from ₹7,999
iQOO 16 Renders Leaked Again; Could Feature New Rear Camera Design
Huawei Watch 6 and Watch 6 Pro Announced at IFA 2026; Watch GT 7 and GT 7 Pro Tag Along