WhatsApp : వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచరల్.. ఇక డేటా లీక్ అయ్యే ఛాన్సే లేదు

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో సరికొత్త విప్లవాత్మక ఫీచర్‌ను తీసుకువస్తోంది. మనకు వచ్చే రకరకాల అనుమానాలపై మెటా ఏఐ అసిస్టెంట్‌తో చాట్ చేస్తూ ఉంటాం.

WhatsApp : వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచరల్.. ఇక డేటా లీక్ అయ్యే ఛాన్సే లేదు

Photo Credit: WhatsApp

The system is said to mask the users' IP addresses

ముఖ్యాంశాలు
  • వాట్సాప్‌లో మెటా ఏఐ కోసం ఇన్‌కాగ్నిటో చాట్ ఫీచర్
  • పర్సనల్ విషయాలు, డేటా లీక్ అవ్వకుండా ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీ
  • ప్రతిసారీ సరికొత్తగా చాటింగ్ ప్రారంభం
ప్రకటన

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో సరికొత్త విప్లవాత్మక ఫీచర్‌ను తీసుకువస్తోంది. మనకు వచ్చే రకరకాల అనుమానాలపై మెటా ఏఐ అసిస్టెంట్‌తో చాట్ చేస్తూ ఉంటాం. అయితే, కొన్ని పర్సనల్ విషయాలు, బడ్జెట్ ప్లానింగ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ లేదా ఆఫీస్ సీక్రెట్స్ వంటి సెన్సిటివ్ విషయాలను ఏఐతో పంచుకోవడానికి చాలా మంది భయపడుతుంటారు. ఈ భయాలకు స్వస్తి పలుకుతూ, వాట్సాప్ ఇప్పుడు ఇన్‌కాగ్నిటో చాట్ విత్ మెటా ఏఐ అనే అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్‌ను ప్రకటించింది. 

ఇన్‌కాగ్నిటో చాట్ అంటే ఏంటి?  
మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో హిస్టరీ సేవ్ అవ్వకుండా ఇన్‌కాగ్నిటో మోడ్ వాడుతుంటాం కదా, సరిగ్గా అలాగే వాట్సాప్‌లో కూడా మెటా ఏఐతో ప్రైవేట్‌గా మాట్లాడుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ మోడ్‌ను ఆన్ చేసి చాటింగ్ చేయడం వల్ల, ఆ సంభాషణల హిస్టరీ లేదా రికార్డులు ఏవీ మీ ఫోన్‌లో సేవ్ అవ్వవు. ఈ చాట్ సెషన్ ముగిసిపోగానే అందులోని మెసేజ్‌లన్నీ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. దీనివల్ల మీ పర్సనల్ విషయాలు ఇతరులకు తెలిసే అవకాశం అస్సలు ఉండదు.

మీ మెసేజ్ వాట్సాప్ కూడా చూడలేదు!
మెటా కంపెనీ ఈ ఇన్‌కాగ్నిటో చాట్‌ను తమ సరికొత్త  ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించింది. సాధారణంగా ఏఐ చాట్‌లు క్లౌడ్ సర్వర్లపై ప్రాసెస్ అవుతుంటాయి. కానీ ఈ కొత్త సిస్టమ్ ద్వారా మీ మెసేజ్‌లు మెటా కంపెనీ ప్రధాన సర్వర్లకు దొరకకుండా, అత్యంత సురక్షితమైన, ఐసోలేటెడ్ వాతావరణంలో ప్రాసెస్ చేయబడతాయి. దీనివల్ల మీరు ఏఐని ఏం అడిగారు, దానికి ఏఐ ఏం సమాధానం ఇచ్చింది అనే విషయాలను స్వయంగా మెటా కంపెనీ లేదా వాట్సాప్ కూడా చూడలేవని టెక్ దిగ్గజం స్పష్టం చేసింది.

Instagram : ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేసుకుంటే చాలు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎవరూ హ్యాక్ చేయలేరు


ప్రతిసారీ సరికొత్తగా చాటింగ్ ప్రారంభం 
ఈ సెక్యూరిటీ సిస్టమ్ కేవలం మెసేజ్‌లను డిలీట్ చేయడమే కాకుండా, యూజర్ల వ్యక్తిగత వివరాలైన ఐపీ అడ్రస్ వాటి వాటిని కూడా ఎవరికీ కనిపించకుండా దాచిపెడుతుంది. మీరు మెసేజ్ పంపుతున్నంత సేపు అవి పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటాయి. సాధారణ ఏఐ చాట్‌లు పాత విషయాలను గుర్తుపెట్టుకుని సమాధానాలు ఇస్తుంటాయి, కానీ ఈ ఇన్‌కాగ్నిటో చాట్ మాత్రం ప్రతిసారీ ఒక క్లీన్ స్లేట్‌తో, అంటే పాత విషయాల ఏ సందర్భం లేకుండా సరికొత్తగా ప్రారంభమవుతుంది. మీరు చాట్ బాక్స్ క్లోజ్ చేయగానే ఆ డేటా మొత్తం శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతుంది.

త్వరలోనే అందరికీ అందుబాటులోకి 
ఈ ఇన్‌కాగ్నిటో చాట్ ఫీచర్ అనేది పూర్తిగా వినియోగదారుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. రాబోయే కొన్ని నెలల్లో వాట్సాప్‌తో పాటు మెటా ఏఐ యాప్‌లో కూడా ఈ ఫీచర్ క్రమంగా అందరికీ రోల్ అవుట్ కానుంది. దీనితో పాటు వాట్సాప్ మరో క్రేజీ ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది, దాని పేరు సైడ్ చాట్ విత్ మెటా ఏఐ. ఈ ఫీచర్ ద్వారా మన ఫ్రెండ్స్‌తో లేదా గ్రూపుల్లో జరిగే నార్మల్ చాటింగ్‌ల లోపల నుంచే, ఆ చాట్ వివరాలు బయటపడకుండా ప్రైవేట్‌గా ఏఐ అసిస్టెంట్ సహాయాన్ని పొందవచ్చు.

#తాజా కథనాలు
  1. WhatsApp : వాట్సాప్ యూజర్లకు షాక్.. ఇకపై డబ్బులు కట్టాల్సిందేనా?
  2. Motorola : మార్కెట్లోకి మోటోరోలా మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
  3. Motorola : మోటోరోలా మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ లేటుగా ఎంట్రీ ఇవ్వడం వెనుక అసలు స్కెచ్ ఏంటి?
  4. WhatsApp : వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచరల్.. ఇక డేటా లీక్ అయ్యే ఛాన్సే లేదు
  5. Earbuds : జస్ట్ రూ.2000లకే దొరికే టాప్ 5 ఏఎన్‌సీ ఇయర్‌బడ్స్ ఇవే.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!
  6. Instagram : ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేసుకుంటే చాలు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎవరూ హ్యాక్ చేయలేరు
  7. Jio Vs Airtel : ఎయిర్‌టెల్, జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ.1000 లోపే అన్‌లిమిటెడ్ 5G, ఓటీటీల జాతర
  8. Upcoming Smartphones : మోటో, షియోమి, శామ్‌సంగ్ నుంచి మార్కెట్లోకి రాబోతున్న టాప్ మొబైల్స్ ఇవే
  9. Aadhaar : మీ ఆధార్ నంబర్, వేలిముద్ర ఉంటే చాలు.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసుకోవచ్చు ?
  10. Credit Card : మీ ఏటీఎం, క్రెడిట్ కార్డ్ పోయిందా..? అయితే వెంటనే ఈ పని చేయండి
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »