Aadhaar : మీ ఆధార్ నంబర్, వేలిముద్ర ఉంటే చాలు.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసుకోవచ్చు ?

దేశంలో ఆర్థిక చేరికను వేగవంతం చేయడానికి ఆర్‌బీఐ మద్దతు ఉన్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)  ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(AePS)ను అందుబాటులోకి తెచ్చింది.

Aadhaar : మీ ఆధార్ నంబర్, వేలిముద్ర ఉంటే చాలు.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసుకోవచ్చు ?

Photo Credit: Paytm

Here's everything you need to know about AePS transactions

ముఖ్యాంశాలు
  • బ్యాంకింగ్ రంగంలో పెను సంచలనం
  • ఇకపై మీ వేలిముద్రే మీ బ్యాంక్ అకౌంట్ కీ!
  • కార్డు లేకపోయినా ఆధార్ నంబర్‌తో రూ.లక్షలు డ్రా
ప్రకటన

Aadhaar : డిజిటల్ ఇండియా దిశగా భారత్ మరో అడుగు ముందుకు వేసింది. దేశంలో ఆర్థిక చేరికను వేగవంతం చేయడానికి ఆర్‌బీఐ మద్దతు ఉన్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)  ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(AePS)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త టెక్నాలజీతో ఏటీఎం కార్డు లేదా స్మార్ట్‌ఫోన్ లేకపోయినా, కేవలం మీ ఆధార్ నంబర్, వేలిముద్ర సాయంతో సులభంగా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు.

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) అంటే ఏమిటి?
యూపీఐ లావాదేవీలను పర్యవేక్షించే ఎన్‌పీసీఐ ఈ ఏఈపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పథకాల సబ్సిడీలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా చేరవేయడానికి  మొదట్లో దీనిని ఉపయోగించారు. అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ ద్వారా దేశంలోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇది ఒక ‘బ్యాంక్-లెడ్ మోడల్'. అంటే బ్యాంకులు నియమించే బిజినెస్ కరస్పాండెంట్లు మైక్రో ఏటీ పరికరాలతో నేరుగా ప్రజల వద్దకే వచ్చి ఈ సేవలను అందిస్తారు.

 AePS ద్వారా ఎలాంటి సేవలు పొందవచ్చు?
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు బ్యాంక్ ఖాతాలో డబ్బులు దాచుకోవాలన్నా, విత్‌డ్రా చేయాలన్నా ఇకపై నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.  AePS ద్వారా కింది సేవలను సులభంగా పొందవచ్చు:
* మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవచ్చు.
* అవసరమైనప్పుడు నగదును విత్‌డ్రా (డబ్బులు తీయడం) చేసుకోవచ్చు.
* మీ ఖాతాలో నగదును డిపాజిట్ చేయవచ్చు.
* ఒక ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నుండి మరొక అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
* మీ అకౌంట్ కి సంబంధించిన మినీ స్టేట్‌మెంట్  పొందవచ్చు.
* చిన్న వ్యాపారులకు BHIM Aadhaar Pay ద్వారా బయోమెట్రిక్ సాయంతో పేమెంట్లు చేయవచ్చు.

డెబిట్ కార్డు అవసరం లేదు..  
ఈ విధానం వల్ల సామాన్య ప్రజలకు ఎన్నో లాభాలు ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నంబర్ లింక్ (AEBA) అయి ఉంటే చాలు, మీకు ఎలాంటి డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డ్ అవసరం లేదు. స్థానిక వడ్డీ వ్యాపారుల దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి ఈ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ బీమా ప్రీమియంలను సైతం ఇంటి వద్దకే వచ్చే ఏజెంట్ల ద్వారా ఈ ఏఈపీఎస్ ఉపయోగించి చెల్లించవచ్చు. ప్రతి లావాదేవీకి వేలిముద్ర తప్పనిసరి కాబట్టి, ఇది అత్యంత సురక్షితమైనది.

 AePS సేవలు పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటి?
* ఈ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మీరు వినియోగించుకోవాలంటే మీ వద్ద కింది వివరాలు ఉండాలి:
* మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నంబర్ లేదా ఆధార్ వర్చువల్ ఐడీ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి.
* మీ బ్యాంక్ పేరు, అకౌంట్ వివరాలు తెలిసి ఉండాలి.
* ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు నమోదు చేసిన మీ వేలిముద్రలు (Biometrics) సరిపోలాలి.
* మీరు ఏ రకమైన లావాదేవీ (విత్‌డ్రా, డిపాజిట్ లేదా బ్యాలెన్స్ ఇంక్వైరీ) చేయాలనుకుంటున్నారో ఆపరేటర్‌కు చెప్పాలి.

 

Credit Card : మీ ఏటీఎం, క్రెడిట్ కార్డ్ పోయిందా..? అయితే వెంటనే ఈ పని చేయండి

ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి?  
మీ గ్రామాల్లో లేదా నగరాల్లో ఉండే మైక్రో ఏటీఎం, కియోస్క్ సెంటర్ లేదా ఏఈపీఎస్ టచ్ పాయింట్ ఆపరేటర్ (ATO) వద్దకు వెళ్లి ఈ కింది పద్ధతి ద్వారా సేవలు పొందవచ్చు:
* మొదటగా మీరు ఏ సేవ (డబ్బులు తీయడం లేదా బ్యాలెన్స్ చెక్) పొందాలనుకుంటున్నారో అక్కడ ఉన్న అసిస్టెంట్‌కు చెప్పండి.
* మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన ఆధార్ నంబర్‌ను వారికి అందించండి.
* ఆ తర్వాత బయోమెట్రిక్ స్కానర్ పరికరంపై మీ వేలిముద్ర వేసి గుర్తింపును ధృవీకరించుకోండి.
* వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, మీ బ్యాంక్ పేరు, అకౌంట్ వివరాలను చెప్పండి.
* ఒకవేళ మీరు డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటే, ఆపరేటర్ మీ చేతికి నగదుతో పాటు ఆ లావాదేవీకి సంబంధించిన రసీదును అందిస్తారు.

తరచుగా అడిగే ప్రశ్నలు  
1. డెబిట్ కార్డ్ లేకుండా ఏఈపీఎస్ ద్వారా డబ్బులు డ్రా చేయవచ్చా?
అవును, ఏటీఎం కార్డ్ లేకపోయినా మైక్రో ఏటీఎంలు లేదా లోకల్ బ్యాంకింగ్ ఏజెంట్ల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.

2. ఈ లావాదేవీల కోసం బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరా?
అవును, మీ ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానమై ఉంటేనే ఈ సేవలు పని చేస్తాయి.

3. AePS సేవలను వాడుకోవడానికి ఏమైనా ఛార్జీలు పడతాయా?
లేదు, ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలని ప్రభుత్వం, బ్యాంకులు నిర్ణయించాయి. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »