Vivo X300 E Launching on July 27: వివో నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. జీస్ కెమెరాతో వివో X300 E రాక!

Vivo X300 E launching on July 27 with  with Zeiss Camera: వివో తమ కొత్త స్మార్ట్‌ఫోన్ వివో X300 Eని జూలై 27న మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేయనుంది

Vivo X300 E Launching on July 27: వివో నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. జీస్ కెమెరాతో వివో X300 E రాక!

Photo Credit: Vivo

Vivo X300 E

ముఖ్యాంశాలు
  • వివో నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో వివో X300 E
  • జీస్ కెమెరాలు, 7015mAh భారీ బ్యాటరీతో రాబోతున్న 'వివో X300 E'
ప్రకటన

Vivo X300 E launching on July 27 with  with Zeiss Camera: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తమ పాపులర్ X సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. వివో తమ అధికారిక వెబ్‌సైట్‌లో  వివో X300 E స్మార్ట్‌ఫోన్ ప్రీ-సేల్స్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఇటీవల భారత మార్కెట్లోకి వచ్చిన X300 FE మోడల్‌తో పోలిస్తే దీని డిజైన్‌లో కొన్ని మార్పులు చేసినప్పటికీ, ప్రీమియం మెటల్ ఫ్రేమ్,  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇందులో కొనసాగించారు. ఈ ఫోన్ ప్రసిద్ధ కెమెరా ఉత్పత్తుల సంస్థ జీస్ భాగస్వామ్యంతో ప్రత్యేకమైన ఇమేజింగ్ సిస్టమ్‌తో వస్తోంది. V2612A మోడల్ నంబర్‌తో రానున్న ఈ ఫోన్ జూలై 27 నుంచి కస్టమర్లకు కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.  

వివో X300 E లాంచ్, కలర్ ఆప్షన్లు

వివో తమ కొత్త స్మార్ట్‌ఫోన్ వివో X300 Eని జూలై 27న మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేయనుంది. లాంచ్‌కు ముందే కంపెనీ అధికారిక సైట్‌లో ప్రీ-ఆర్డర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. డిజైన్ పరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ ఫోన్‌ను కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా క్లాసిక్ బ్లాక్, ఎలిగెంట్ వైట్ మరియు వైబ్రెంట్ ఆరెంజ్ రంగుల్లో లాంచ్ చేస్తున్నారు.  

అద్భుతమైన డిస్‌ప్లే, ప్రాసెసర్ సామర్థ్యం

డిస్‌ప్లే విషయానికి వస్తే, ఇందులో 6.59 ఇంచుల 1.5K ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 2750×1260 పిక్సెల్స్ రెసొల్యూషన్, HDR10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్, ఏకంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో 3nm ప్రాసెసింగ్ ఆధారిత ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ అమర్చారు. గ్రాఫిక్స్ కోసం Adreno 829 GPU తో పాటు 12GB/16GB LPDDR5X ఆల్ట్రా ర్యామ్, 256GB/512GB/1TB UFS 4.1 ఇన్-బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్లు లభిస్తాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.  

Portronics Pure Sound Pro X2 : ఇంటికే థియేటర్ అనుభూతి.. భారత్‌లో 'పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2' లాంచ్!

జీస్ కెమెరా సెటప్.. భారీ బ్యాటరీ

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో జీస్ బ్రాండింగ్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో f/1.57 అపార్చర్, OIS సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.2 అపార్చర్‌తో 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరా, f/2.65 అపార్చర్‌తో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.0 అపార్చర్‌తో 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. అంతేకాకుండా 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 7015mAh భారీ బ్యాటరీ ఇందులో ఉంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఆల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్స్ ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. iPhone Price Hike : 17 ఐఫోన్ కొనాలనుకునే వారికి ఆపిల్ ఊహించని షాక్.. ఒకేసారి 11 శాతం పెరిగిన ధరలు
  2. Google Pixel 11a : డిస్‌ప్లే, కెమెరాలో భారీ మార్పులు.. విప్లవాత్మక ఫీచర్లతో గూగుల్ కొత్త అఫోర్డబుల్ ఫోన్
  3. XElectron Projector : రూ.6,990కే ఇంటి వద్ద థియేటర్ ఎక్స్‌పీరియన్స్.. ఎక్స్‌ఎలెక్ట్రాన్ టెక్నో సి7 స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్
  4. Japan scientist Made Human Refrigerator: బాక్స్‌లో కూర్చుంటే చాలు.. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి జపాన్ శాస్త్రవేత్తల మాస్టర్ ప్లాన్
  5. Indias Air Taxi e200X: ట్రాఫిక్‌కు బై బై.. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ టాక్సీ!
  6. Vivo X300 E Launching on July 27: వివో నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. జీస్ కెమెరాతో వివో X300 E రాక!
  7. Portronics Pure Sound Pro X2: ఇంటికే థియేటర్ అనుభూతి.. భారత్‌లో 'పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2' లాంచ్
  8. Samsung Galaxy Unpacked Event on July 22: జూలై 22న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్.. కొత్త ఫోల్డబుల్ ఫోన్లు సిద్ధం
  9. Trump Media: ట్రంప్ ట్వీట్ ముందే కావాలా..? నెలకు రూ. 85 లక్షలు కట్టాల్సిందే!
  10. Oppo A7 Pro Max Features Leaked: మార్కెట్లోకి ఒప్పో A7 ప్రో మాక్స్ ఎంట్రీ.. 10,000mAh బ్యాటరీతో సరికొత్త రికార్డు!
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »