Xiaomi 17T : భారత్‌లోకి షావోమి 17టి ఎంట్రీ.. లైకా కెమెరా, పవర్‌ఫుల్ ఫీచర్లతో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్

భారత మార్కెట్లో షావోమి 17టి ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 12GB రామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధరను కంపెనీ రూ.59,999గా నిర్ణయించింది.

Xiaomi 17T : భారత్‌లోకి షావోమి 17టి ఎంట్రీ.. లైకా కెమెరా, పవర్‌ఫుల్ ఫీచర్లతో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్

Xiaomi's latest handset has an IP68-rated build and Gorilla Glass 7i protection

ముఖ్యాంశాలు
  • షావోమి 17టి స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది.
  • బేస్ వేరియంట్ అయిన 12GB రామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.59,999
  • షావోమి కొత్త ఫోన్లో ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీ
ప్రకటన

Xiaomi 17T : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమి భారతీయ వినియోగదారుల కోసం తన మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో సరికొత్త మొబైల్‌ను పరిచయం చేసింది. బుధవారం జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో షావోమి 17టి స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. షావోమి 17 లైనప్‌లో వస్తున్న ఈ సరికొత్త ఫోన్ అల్ట్రా-ప్రీమియం ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ కోసం ఇందులో లైకా బ్రాండింగ్ కెమెరాలను, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కోసం భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని అమర్చారు.

భారత మార్కెట్లో షావోమి 17టి ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 12GB రామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధరను కంపెనీ రూ.59,999గా నిర్ణయించింది. అలాగే హయ్యర్ వేరియంట్ అయిన 12GB రామ్ + 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ.64,999గా ఉంది. ఈ ఫోన్ సేల్స్ వచ్చే వారం అంటే జూన్ 10 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. కస్టమర్లు దీనిని షావోమి అధికారిక వెబ్‌సైట్, అమేజాన్ ఇండియా, లోకల్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

లాంచ్ ఆఫర్లలో భాగంగా షావోమి కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను ప్రకటిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ బ్యాంక్ కార్డ్ లేకపోతే పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి రూ.5,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ ఆఫర్లతో బేస్ వేరియంట్ ఎఫెక్టివ్ ధర రూ.54,999కి, టాప్ వేరియంట్ ధర రూ.59,999కి తగ్గిపోతుంది. అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ హోల్డర్లకు రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభించే అవకాశం ఉంది.

కస్టమర్లను ఆకర్షించడానికి షావోమి ఒక క్రేజీ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ఫోన్ కొన్న ఒక ఏడాది లోపు తిరిగి ఇచ్చేస్తే.. 60 శాతం అష్యూర్డ్ బైబ్యాక్ వాల్యూను కంపెనీ గ్యారెంటీ ఇస్తోంది. దీనివల్ల బేస్ వేరియంట్‌పై ఒక ఏడాది ఓనర్‌షిప్ కాస్ట్ కేవలం రూ.19,000 మాత్రమే అవుతుందని కంపెనీ లెక్కగట్టింది. ఇవే కాకుండా ఈ ఫోన్ కొనేవారికి 4 నెలల స్పాటిఫై ప్రీమియం, 3 నెలల యూట్యూబ్ ప్రీమియం, 3 నెలల గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్లు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ,  జీరో డౌన్ పేమెంట్ సదుపాయాలు కూడా ఉన్నాయి.

Motorola Edge 70 Pro+ : భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో ఎడ్జ్ 70 ప్రో+ లాంచ్

 
షావోమి 17టి ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని కెమెరా సెటప్. వెనుక భాగంలో లైకా ట్యూన్ చేసిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50-మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 800 ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ లైకా 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. ఈ పెరిస్కోప్ కెమెరా 115mm ఈక్వివలెంట్ ఫోకల్ లెంగ్త్‌ను కలిగి ఉండి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో వస్తుంది. దీనివల్ల ఎంత దూరం ఉన్న వస్తువునైనా బ్లర్ లేకుండా అత్యంత స్పష్టంగా ఫొటోలు, వీడియోలు తీయవచ్చు.

ఈ డ్యూయల్ సిమ్ (నానో+నానో) మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇందులో 6.59-ఇంచుల 1.5K అమోలెడ్  స్క్రీన్‌ను అమర్చారు. ఇది 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది కాబట్టి ఎండలో కూడా స్క్రీన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500-ఆల్ట్రా  ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్ హీట్ అవ్వకుండా ఉండటానికి కంపెనీ సొంత 3D ఐస్‌లూప్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా ఇందులో చేర్చారు.

చార్జింగ్ విషయంలో ఈ ఫోన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇందులో 6,500mAh సామర్థ్యం గల భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు. ఇది 67W హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, దీని ద్వారా ఇతర ఫోన్లను చార్జ్ చేసుకోవడానికి 22.5W రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, లేటెస్ట్ వైఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ (NFC), జీపీఎస్, నావిక్ సపోర్ట్ ఉన్నాయి. కారు బాడీకి ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్,  స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను అందించారు.

#తాజా కథనాలు
  1. Xiaomi TV : భారత్‌లోకి షావోమి సరికొత్త టీవీ FX మినీ ఎల్‌ఈడీ సిరీస్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
  2. Smartphone Comparison : భారత మార్కెట్లో మొబైల్స్ వార్.. షావోమి 17టి, వివో X200T, శాంసంగ్ గెలాక్సీ A57లలో ఏది బెస్ట్?
  3. Xiaomi 17T : భారత్‌లోకి షావోమి 17టి ఎంట్రీ.. లైకా కెమెరా, పవర్‌ఫుల్ ఫీచర్లతో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్
  4. WhatsApp : వోడాఫోన్ ఐడియా, మెటా సరికొత్త విప్లవం.. ఇక ఓటీపీ, పాస్‌వర్డ్ లేకుండానే వాట్సాప్ లాగిన్
  5. Solar Storm Alert : సూర్యుడిపై వరుస పేలుళ్లు.. భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుఫాను
  6. Motorola Edge 70 Pro+ : భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో ఎడ్జ్ 70 ప్రో+ లాంచ్
  7. Google : గూగుల్ జెమినిలో అదిరిపోయే ఫీచర్.. ఇక మీలాగే మాట్లాడే ఏఐ అవతార్ వచ్చేస్తోంది
  8. Lumio : స్మార్ట్ టీవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి లుమియో విజన్ 9, విజన్ 7 కొత్త వేరియంట్లు
  9. Google : ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు గుడ్‌న్యూస్.. గూగుల్ జెమిని యాప్‌లో సరికొత్త ఫీచర్
  10. Google : ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ బంపర్ గిఫ్ట్.. ఇకపై ఫేక్ కాల్స్ వస్తే ముందే అలర్ట్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »