జెమిని 3.1 ఫ్లాష్-లైట్, జెమిని 3.5 ఫ్లాష్, జెమిని 3.1 ప్రో మోడల్స్ వాడుతున్న వినియోగదారులందరికీ ఈ అప్‌డేట్ లభిస్తుంది.
Gemini thinking levels are available to paid and free users
Google : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ జెమినిలో సరికొత్త భద్రతా, సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టింది. వినియోగదారులకు మరింత ఖచ్చితమైన, లోతైన సమాధానాలను అందించడానికి వీలుగా జెమిని యాప్‌లో థింకింగ్ లెవెల్స్ అనే సరికొత్త ఫీచర్‌ను రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది. గూగుల్ జెమిని, ఏఐ స్టూడియో వైస్ ప్రెసిడెంట్ జోష్ ఉడ్‌వర్డ్ బుధవారం నాడు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి కొత్త ఫీచర్
ఈ సరికొత్త థింకింగ్ మోడ్‌లు కేవలం కంప్యూటర్ బ్రౌజర్లలోనే కాకుండా ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యాప్‌లలో కూడా అందుబాటులోకి వచ్చాయి. జెమిని 3.1 ఫ్లాష్-లైట్, జెమిని 3.5 ఫ్లాష్, జెమిని 3.1 ప్రో మోడల్స్ వాడుతున్న వినియోగదారులందరికీ ఈ అప్‌డేట్ లభిస్తుంది. భారత మార్కెట్లోని ఉచిత, పెయిడ్ వినియోగదారులు ఇద్దరికీ ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చినట్లు ఇప్పటికే పలు నివేదికలు ధృవీకరించాయి.
మూడు రకాల థింకింగ్ లెవెల్స్ ప్రత్యేకత
సాధారణంగా జెమిని మోడల్స్‌లో రెండు రకాల థింకింగ్ లెవెల్స్ డిఫాల్ట్‌గా ఉంటాయి. అయితే గూగుల్ ఏఐ అల్ట్రా సబ్‌స్క్రైబర్ల కోసం జెమిని 3.1 ప్రో మోడల్‌లో డీప్ థింక్ అనే మూడో స్థాయి థింకింగ్ లెవెల్‌ను కూడా గూగుల్ ప్రదర్శించింది. ఇది అత్యంత క్లిష్టమైన సమాంతర తార్కిక విశ్లేషణను చేయగలదని కంపెనీ పేర్కొంది. దీనివల్ల ప్రొఫెషనల్ యూజర్లకు గణితం, సైన్స్ వంటి కఠినమైన సబ్జెక్టులలో ఎంతో మేలు జరుగుతుంది.
Google : ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ బంపర్ గిఫ్ట్.. ఇకపై ఫేక్ కాల్స్ వస్తే ముందే అలర్ట్
సమయం తీసుకుని పక్కా ఆన్సర్ ఇచ్చే ఎక్స్‌టెండెడ్ థింకింగ్
గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా అడిగే ఎక్కువ శాతం ప్రశ్నలకు జెమిని లోని ‘స్టాండర్డ్' థింకింగ్ లెవెల్ సరిపోతుంది. కానీ, చాలా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ ఎక్స్‌టెండెడ్ థింకింగ్ మోడ్‌ను డిజైన్ చేసింది. ఈ మోడ్‌లో జెమిని ఏఐ యూజర్ అడిగిన ప్రశ్నపై సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుని ఆలోచిస్తుంది. కాస్త లేట్ అయినా సరే, చాలా లోతైన విశ్లేషణతో కూడిన పక్కా సమాధానాన్ని, మెరుగైన క్వాలిటీ రెస్పాన్స్‌ను ఇది జనరేట్ చేస్తుంది.
గూగుల్ ఐఓ 2026 సదస్సు తర్వాత కీలక మార్పులు
ఇటీవలే ముగిసిన గూగుల్ వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ గూగుల్ ఐఓ 2026లో కంపెనీ జెమిని 3.5 సిరీస్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇందులో మొదటి మోడల్ అయిన జెమిని 3.5 ఫ్లాష్ ఇప్పటికే అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. కాగా, ప్రస్తుతం ఉన్న జెమిని 3.1 ప్రో మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా రాబోతున్న మోస్ట్ పవర్‌ఫుల్ జెమిని 3.5 ప్రో మోడల్‌ను కూడా ఇదే జూన్ నెల చివరలో మార్కెట్లోకి తీసుకురావడానికి గూగుల్ సంస్థ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999