సరికొత్త టెక్నాలజీ ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి పాపులర్ యాప్స్‌ను ఉపయోగించే విఐ కస్టమర్లకు సరికొత్త డిజిటల్ అనుభవం కలగనుంది.
Photo Credit: Unsplash/NordWood Themes
Vi plans to bring SMV-based authentication for other apps
WhatsApp : భారతీయ టెలికాం రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న వోడాఫోన్ ఐడియా, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థతో ఒక కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వినియోగదారుల భద్రతను మరింత పెంచడంతో పాటు, సోషల్ మీడియా అకౌంట్లలో లాగిన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఈ రెండు కంపెనీలు కలిసి భారతదేశంలో సైలెంట్ మొబైల్ వెరిఫికేషన్ అనే సరికొత్త నెట్‌వర్క్ ఆధారిత వెరిఫికేషన్ పద్ధతిని ప్రవేశపెట్టాయి. ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి పాపులర్ యాప్స్‌ను ఉపయోగించే విఐ కస్టమర్లకు సరికొత్త డిజిటల్ అనుభవం కలగనుంది.
ఓటీపీ, పాస్‌వర్డ్‌లతో పనిలేని సరికొత్త విధానం
సాధారణంగా మనం వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ అవ్వాలంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి, లేదా మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓన్ టైమ్ పాస్‌వర్డ్‌ని మాన్యువల్‌గా టైప్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ సరికొత్త ఎస్‌ఎమ్‌వీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే విఐ కస్టమర్లు కేవలం తమ ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి పాస్‌వర్డ్ లేదా ఓటీపీ లేకుండానే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. దీనికోసం మెటా యాప్స్ నేరుగా విఐ సెల్యులార్ నెట్‌వర్క్‌కు ఒక వెరిఫికేషన్ సిగ్నల్‌ను పంపిస్తాయి. ఆ నెట్‌వర్క్ మీ నెంబర్ నిజమైనదే అని ధృవీకరించిన వెంటనే, యాప్ మీకు లాగిన్ యాక్సెస్ ఇచ్చేస్తుంది. ఒకవేళ నెట్‌వర్క్ ధృవీకరించడంలో విఫలమైతే యాప్ ఓపెన్ కాదు.
యూజర్ల సమయం ఆదా.. వేగవంతమైన రిజిస్ట్రేషన్
ఈ సరికొత్త సెక్యూరిటీ ప్రోటోకాల్ పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. దీనివల్ల కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకునే వారికి, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసేటప్పుడు, పాత అకౌంట్లను రికవరీ చేసేటప్పుడు, సెక్యూరిటీ చెక్స్ సమయంలో సమయం చాలా ఆదా అవుతుంది. వినియోగదారులు ఓటీపీ మెసేజ్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు, అలాగే వెరిఫికేషన్ కోడ్ కోసం ఒక యాప్ నుంచి మరో యాప్‌కు మారాల్సిన అవసరం కూడా ఉండదు. టెలికాం నెట్‌వర్క్ ద్వారా నేరుగా ఈ ప్రక్రియ జరిగిపోవడం వల్ల చాలా వేగంగా లాగిన్ పూర్తవుతుంది.
సైబర్ దొంగతనాలకు, ఫిషింగ్ దాడులకు చెక్
ఇటీవలి కాలంలో ఓటీపీలను దొంగిలించి అకౌంట్లను హ్యాక్ చేసే సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే, ఈ సైలెంట్ మొబైల్ వెరిఫికేషన్ విధానం వల్ల హ్యాకర్ల ఆటలు సాగవని విఐ స్పష్టం చేసింది. ఇందులో యూజర్లు ఎలాంటి ఓటీపీ లేదా పాస్‌వర్డ్ వివరాలను మాన్యువల్‌గా స్క్రీన్‌పై టైప్ చేయరు కాబట్టి, ఆ సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కే అవకాశమే లేదు. ఇది ఆన్‌లైన్ ఫిషింగ్ దాడుల నుంచి, డిజిటల్ ఐడెంటిటీ రిస్క్‌ల నుంచి విఐ కస్టమర్ల అకౌంట్లకు అత్యంత పటిష్టమైన రక్షణ కల్పిస్తుందని కంపెనీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో మరిన్ని యాప్స్‌లోకి ఈ టెక్నాలజీ
ప్రస్తుతానికి ఈ సరికొత్త సదుపాయాన్ని మెటా కంపెనీకి చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యాప్స్‌లో మాత్రమే ప్రవేశపెట్టినప్పటికీ, భవిష్యత్తులో దీనిని మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లకు, ఇతర ఎకోసిస్టమ్ పార్టనర్స్‌కు విస్తరించాలని వోడాఫోన్ ఐడియా యోచిస్తోంది. కేవలం లాగిన్ కోసమే కాకుండా ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి, అధునాతన అథెంటికేషన్ ప్రక్రియలకు, రిస్క్ ఆధారిత వెరిఫికేషన్ సొల్యూషన్స్ కోసం కూడా ఈ ఎస్‌ఎమ్‌వీ టెక్నాలజీని ఉపయోగించాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.
ప్రకటన
ప్రకటన
Marvel's Wolverine Will Be a Linear Adventure, Not an Open World Game, Says Insomniac
Googlebook Lineup Tipped to Include Eight Devices; Intel May Power Four Models