కంపెనీ డ్రీమీ L50s ప్రో అల్ట్రా, డ్రీమీ L50 అల్ట్రా CE మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది
Photo Credit: Dreame Technology
Dreame Vacuum Cleaner
Vacuum Cleaner : బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా ఇంటి పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడేవారి కోసం మార్కెట్లోకి సరికొత్త గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ గృహోపకరణాల సంస్థ డ్రీమీ టెక్నాలజీ భారతీయ వినియోగదారుల కోసం రెండు అడ్వాన్స్‌డ్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లను అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ డ్రీమీ L50s ప్రో అల్ట్రా, డ్రీమీ L50 అల్ట్రా CE మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు డివైజ్‌లు కూడా ఆధునిక స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్‌కు తగినట్లుగా సరికొత్త ఏఐ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి.
ఫ్లాగ్‌షిప్ మోడల్ డ్రీమీ L50s ప్రో అల్ట్రా ఫీచర్లు
ఈ సిరీస్‌లో డ్రీమీ L50s ప్రో అల్ట్రా అనేది అత్యంత ప్రీమియం, ఫ్లాగ్‌షిప్ మోడల్. ఇది కంపెనీ ప్రత్యేకమైన వోర్మాక్స్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఇందులో ఏకంగా 30,000Pa సామర్థ్యం గల పవర్‌ఫుల్ సక్షన్ పవర్ ఉంటుంది. ఇది ఇంట్లోని మురికి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, చిన్న చిన్న ధూళి కణాలను చాలా పటిష్టంగా శుభ్రం చేస్తుంది. ఇందులో ఇచ్చిన ఈజీలీప్ టెక్నాలజీ సహాయంతో ఈ రోబో ఇళ్లలోని గడపలు లేదా 40mm వరకు ఉండే చిన్న చిన్న అడ్డంకులను సులభంగా దాటగలదు.
థర్మోహబ్, ఆటో కార్పెట్ క్లీనింగ్ మ్యాజిక్
L50s ప్రో అల్ట్రా మోడల్‌లో థర్మోహబ్ అనే అద్భుతమైన సిస్టమ్ ఉంది. ఇది ఏకంగా 100 డిగ్రీల సెల్సియస్ వేడి నీటితో తన మోప్‌ను తానే స్వయంగా క్లీన్ చేసుకుంటుంది. దీనివల్ల మురికితో పాటు బ్యాక్టీరియా కూడా పూర్తిగా నశిస్తుంది. అంతేకాదు, ఇందులో ఉండే ఏఐ అడ్వాన్స్‌డ్ అబ్స్టకల్ డిటెక్షన్ సిస్టమ్.. ఇంట్లో ఉండే దాదాపు 220 కి పైగా వస్తువులను స్పష్టంగా గుర్తించగలదు. ఈ రోబో ఇల్లు తుడుస్తున్నప్పుడు మధ్యలో కార్పెట్ వస్తే, దానిని వెంటనే గుర్తించి ఆటోమేటిక్‌గా తన సక్షన్ పవర్‌ను పెంచుతుంది. అలాగే కార్పెట్ తడవకుండా ఉండేందుకు తన మోప్‌ను పైకి లేపుతుంది.
Bitcoin : క్రిప్టో మార్కెట్లో ఒక్కసారిగా పెరిగిన జోష్.. రెండు వారాల గరిష్టానికి చేరిన బిట్‌కాయిన్
డ్రీమీ L50 అల్ట్రా CE మోడల్ ప్రత్యేకతలు
ఇక ఈ సిరీస్‌లో వస్తున్న రెండో మోడల్ డ్రీమీ L50... అల్ట్రా CE. ఇందులో కంపెనీకి చెందిన ఆరవ తరం టర్బోఫోర్స్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది 25,000Pa సక్షన్ పవర్‌ను అందిస్తుంది. ఇందులో కూడా ఆటోమేటిక్ డస్ట్ కలెక్షన్, వాటర్ రీఫిల్లింగ్, హాట్ ఎయిర్ డ్రైయింగ్, 80 డిగ్రీల సెల్సియస్ వేడి నీటితో మోప్ వాషింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఈ డివైజ్‌లో ఇచ్చిన డ్యూయల్ ఫ్లెక్స్ ఆర్మ్, మోప్ ఎక్స్‌టెండ్ రోబోస్వింగ్ ఫీచర్ల వల్ల.. ఇళ్లలోని మూలలు, గోడల అంచులను కూడా చాలా సులభంగా క్లీన్ చేయవచ్చు. ఇది కూడా కార్పెట్‌ను గుర్తిస్తే తన మోప్‌ను 10.5mm వరకు పైకి లేపగలదు.
ధరలు, వారంటీ, లభ్యత వివరాలు
ధరల విషయానికి వస్తే.. ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన డ్రీమీ L50s ప్రో అల్ట్రా ధర రూ.79,999 గా నిర్ణయించారు. అలాగే డ్రీమీ L50 అల్ట్రా CE మోడల్ ధర రూ.64,999 గా ఉంది. ఈ రెండు రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లు జూన్ 16 వ తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్, డ్రీమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్, క్రోమా, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు మోడల్స్‌పై కంపెనీ ఒక సంవత్సరం పాటు అధికారిక వారంటీని కూడా అందిస్తోంది. ఇంటిని శ్రమ లేకుండా క్లీన్ చేసుకోవాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్.
ప్రకటన
ప్రకటన
Honor 600 Smart 5G With 7,700mAh Battery Listed on French Website, Could Launch Soon: Price, Features
Rockstar Games Confirms GTA 6 Pre-Orders Will Begin June 25, Reveals New Cover Art