మోస్ట్ అవేటెడ్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్లా మోడల్ Y L డెలివరీలను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించింది.
Tesla
Tesla : ప్రపంచ ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ తన మోస్ట్ అవేటెడ్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్లా మోడల్ Y L డెలివరీలను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించింది. మునుపటి స్టాండర్డ్ మోడల్ Yతో పోలిస్తే ఇది సైజ్ పరంగా చాలా పెద్దదిగా ఉంటుంది. లగ్జరీ లుక్‌తో పాటు ఎక్కువ కేబిన్ స్పేస్, ప్రీమియం ఫీచర్లు ఆశించే పెద్ద కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎలక్ట్రిక్ కారును కస్టమర్ల ముందుకు తెచ్చారు.
భారత మార్కెట్లో సరికొత్త టెస్లా మోడల్ Y L ఎక్స్-షోరూమ్ ధరను దాదాపు రూ.61.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. టెస్లా తన సాంప్రదాయ డైరెక్ట్-టు-కన్జ్యూమర్(డీ2సీ) సేల్స్ మోడల్ ద్వారానే ఈ కార్లను నేరుగా కస్టమర్లకు విక్రయిస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్‌కు చెందిన ఈ సంస్థ, ఈ లగ్జరీ కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఫైనాన్స్, ఈఎంఐ ప్లాన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ప్రీమియం కార్ లవర్స్ సులభంగానే ఈ కారును సొంతం చేసుకోవచ్చు.
గత ఏడాది టెస్లా సంస్థ ఈ మోడల్ Y L కారును చైనా మార్కెట్లో మొదటిసారి పరిచయం చేసింది. ఇది స్టాండర్డ్ మోడల్ Y కారుకు లాంగ్-వీల్‌బేస్, త్రీ-రో వెర్షన్. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ప్రయాణీకుల సౌకర్యార్థం 6 సీట్లను అమర్చారు. ఎక్కువ మంది కూర్చోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి ఇందులో అద్భుతమైన స్పేస్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ Y L కార్లను చైనాలోని షాంఘై నగరంలో ఉన్న టెస్లా అడ్వాన్స్‌డ్ గిగాఫ్యాక్టరీలో అత్యంత ఆధునిక సాంకేతికతతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచే ఇవి నేరుగా భారత్‌కు దిగుమతి అవుతున్నాయి.
టెస్లా మోడల్ Y L కారు పర్ఫార్మెన్స్ పరంగా రోడ్లపై రాకెట్‌లా దూసుకెళ్తుంది. ఇది కేవలం 5 సెకన్ల వ్యవధిలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ స్పష్టం చేసింది. ఇక మైలేజ్ విషయానికి వస్తే.. సింగిల్ ఫుల్ చార్జ్‌పై ఈ కార్ డబ్ల్యూఎల్‌టీపీ సర్టిఫైడ్ ప్రకారం ఏకంగా 681 కిలోమీటర్ల భారీ రేంజ్ ఇస్తుంది. ఇటీవలే కంపెనీ భారత్‌లో రూ.50.89 లక్షల ధరతో ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను కూడా లాంచ్ చేసింది. దీనితో కలిపి ప్రస్తుతం ఇండియాలో టెస్లా బ్రాండ్ నుంచి ప్రీమియం RWD, L ప్రీమియం AWD అనే రెండు వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో లభించే బేస్ వేరియంట్‌లో 64 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
EPFO : ఆధార్ నంబర్ ఉంటే చాలు.. ఉమంగ్ యాప్ ద్వారా UAN తెలుసుకునే సింపుల్ ప్రాసెస్ ఇదే
భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టెస్లా బ్రాండ్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుండగా.. ఫోక్స్ వ్యాగన్, టెస్లా వంటి దిగ్గజాలకు వోక్స్ వ్యాగన్ రేంజ్ పోటీని ఇస్తూ వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ ఈవీ కంపెనీ సేల్స్ పరంగా దూసుకుపోతోంది. భారతీయ కస్టమర్ల బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా విన్‌ఫాస్ట్ తన ఎలక్ట్రిక్ వాహనాలలో కీలక మార్పులు చేయడమే దీనికి ప్రధాన కారణం. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు టెస్లా ఇండియాలో కేవలం 383 ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించగలిగింది. కానీ, ఇదే సమయంలో విన్‌ఫాస్ట్ కంపెనీ ఏకంగా 3,568 యూనిట్ల కార్లను విక్రయించి టెస్లా కంటే చాలా ముందంజలో నిలిచింది. లోకలైజేషన్ పెంచడం, ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచడం వల్లే విన్‌ఫాస్ట్ విక్రయాలు ఇండియాలో జోరుగా సాగుతున్నాయి.
ప్రకటన
ప్రకటన
Narwal S20, S20 Pro, S30 Wet and Dry Vacuum Cleaners With Up to 20,000Pa Suction Launched in India:Price, Features