LYNE : కేవలం రూ. 1,649 ధరకే.. 10,000mAh బ్యాటరీ సామర్థ్యం.. LYNE Startup 87 లాంచ్

LYNE Startup 87 పవర్ బ్యాంక్ (పవర్‌బాక్స్ 29 ప్రో) ధరను కంపెనీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంచింది.

LYNE : కేవలం రూ. 1,649 ధరకే.. 10,000mAh బ్యాటరీ సామర్థ్యం.. LYNE Startup 87 లాంచ్

Photo Credit: LYNE

LYNE Startup 87 Power Bank

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి లైన్ సరికొత్త పవర్ బ్యాంక్
  • 10,000mAh బ్యాటరీ సామర్థ్యంతో సరికొత్త గ్యాడ్జెట్
  • ఒకేసారి మూడు డివైజ్‌లను ఛార్జ్ చేసే అద్భుత అవకాశం
ప్రకటన

LYNE : ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లతో పాటు బడ్స్, వాచెస్ వంటి రకరకాల గ్యాడ్జెట్స్ వాడకం పెరగడంతో పవర్ బ్యాంకుల అవసరం చాలా ఎక్కువైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ స్మార్ట్ యాక్సెసరీస్, ఆడియో బ్రాండ్ లైన్ ఒరిజినల్స్ భారత మార్కెట్లోకి తన సరికొత్త లైన్ స్టార్టప్ 87 పవర్ బ్యాంక్‌ను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ తన స్టార్టప్ సిరీస్ పోర్ట్‌ఫోలియో కింద దీనిని తీసుకొచ్చింది. ఆఫీస్ వర్క్ చేసేవారికి, తరచూ ప్రయాణాలు చేసేవారికి, రోజువారీ అవసరాలకు ఉపయోగపడేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ధరల విషయానికి వస్తే.. LYNE Startup 87 పవర్ బ్యాంక్ (పవర్‌బాక్స్ 29 ప్రో) ధరను కంపెనీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంచింది. భారత మార్కెట్లో దీని ధర కేవలం రూ.1,649లుగా నిర్ణయించారు. ఈ సరికొత్త పవర్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆఫ్‌లైన్ రీటైల్ అవుట్‌లెట్లు, మొబైల్ యాక్సెసరీస్ స్టోర్లలో వినియోగదారులకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. రూ.2000 లోపు బడ్జెట్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చే పవర్ బ్యాంక్ కోసం చూసేవారికి ఇది ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

LYNE Startup 87 పవర్ బ్యాంక్ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఇందులో 10,000mAh సామర్థ్యం గల హై-కెపాసిటీ బ్యాటరీని అమర్చారు. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌ను కనీసం రెండు సార్ల కంటే ఎక్కువగా పూర్తి ఛార్జింగ్ చేయగలదు. ఈ పవర్ బ్యాంక్ ద్వారా వైర్డ్ ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు ఏకంగా 33W హై-స్పీడ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మీ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు,  ఇతర యూఎస్‌బీ డివైజ్‌లు చాలా తక్కువ సమయంలోనే క్విక్‌గా ఛార్జ్ అవుతాయి.

ఈ పవర్ బ్యాంక్‌లో ఉన్న అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. ఇది వైర్లతో సంబంధం లేకుండా 15W మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇచ్చిన స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అలైన్‌మెంట్ సిస్టమ్ వల్ల, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఐఫోన్లు, ఇతర ప్రీమియం ఫోన్లను దీనికి దగ్గరగా ఉంచితే.. అది అయస్కాంతంలా గట్టిగా అతుక్కుని చాలా సమర్థవంతంగా ఛార్జ్ చేస్తుంది. ఫోన్ కింద పడిపోతుందనే భయం అస్సలు ఉండదు.

Bitcoin : క్రిప్టో మార్కెట్లో ఒక్కసారిగా పెరిగిన జోష్.. రెండు వారాల గరిష్టానికి చేరిన బిట్‌కాయిన్

వినియోగదారులు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ఇందులో మూడు అవుట్‌పుట్ పోర్టులతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. అంటే మీ ఫోన్, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్ వంటి వాటిని ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇందులో ఇచ్చిన డిజిటల్ LED బ్యాటరీ ఇండికేటర్ డిస్‌ప్లే ద్వారా.. పవర్ బ్యాంక్‌లో ఇంకా ఎంత శాతం బ్యాటరీ మిగిలి ఉందో రియల్ టైమ్‌లో పక్కాగా చూసుకోవచ్చు.

డిజైన్ పరంగా LYNE Startup 87 పవర్ బ్యాంక్ చాలా ప్రీమియం లుక్‌తో, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనిని చాలా కాంపాక్ట్‌గా, లైట్ వెయిట్‌గా రూపొందించడం వల్ల జేబులో లేదా హ్యాండ్ బ్యాగుల్లో, ట్రావెల్ కిట్లలో చాలా సులభంగా సర్ది పట్టుకెళ్లవచ్చు. ఈ డివైజ్ స్టైలిష్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాంపాక్ట్ సైజులో లభిస్తూ, వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ పవర్ బ్యాంక్ ఇది.

#తాజా కథనాలు
  1. WhatsApp : నో స్క్రీన్‌షాట్, నో ఫార్వర్డ్.. వాట్సాప్‌లో ఒక్కసారి చదవగానే మాయమైపోయే సీక్రెట్ మెసేజ్ ఫీచర్
  2. Vacuum Cleaner : ఇంటి పనికి ఇక గుడ్‌బై.. భారత్‌లోకి డ్రీమీ సరికొత్త రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్
  3. LYNE : కేవలం రూ. 1,649 ధరకే.. 10,000mAh బ్యాటరీ సామర్థ్యం.. LYNE Startup 87 లాంచ్
  4. Social Media Ban : బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 16 ఏళ్ల లోపు వారికి నో ఫేస్‌బుక్, నో ఇన్‌స్టా
  5. Tesla : ఒక్క చార్జ్‌తో 681 కిలోమీటర్ల ప్రయాణం.. భారత్‌లో లగ్జరీ ఈవీ మోడల్ Y L డెలివరీలు షురూ
  6. Telegram : నీట్ ఎగ్జామ్ ముందర కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం
  7. Samsung : ఫోల్డబుల్ మొబైల్స్ లో శామ్‌సంగ్ సరికొత్త విప్లవం.. స్క్రీన్‌పై క్రీజ్ సమస్యకు శాశ్వతంగా చెక్
  8. WhatsApp : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. మీ అకౌంట్ హ్యాక్ అయితే రికవర్ చేసుకోవడం ఎలా?
  9. Cell Broadcast : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్ తాత్కాలికంగా నిలిపివేత
  10. Gmail Tips : జీమెయిల్‌లో దాగున్న సీక్రెట్ ఆప్షన్.. బ్లూ కలర్ సెండ్ బటన్ పక్కనే ఉంది గమనించారా?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »