ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇండోనేషియా వంటి దేశాలు పిల్లల కోసం సోషల్ మీడియా వినియోగంపై కఠినమైన ఆంక్షలు విధించాయి.
Social Media Ban
Social Media Ban : గడిచిన కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విప్లవం కారణంగా సోషల్ మీడియా పరిధి హద్దులు లేకుండా విస్తరించింది. అయితే, దీనివల్ల చిన్న పిల్లలపై జరుగుతున్న మానసిక, సామాజిక దుష్ప్రభావాలపై అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లకు చిన్నారులు అలవాటుపడి లతగా మార్చుకోవడం, సైబర్ నేరగాళ్ల బారిన పడటం వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో పిల్లల ఆన్‌లైన్ భద్రతను పక్కాగా అమలు చేయాలనే ఒత్తిడి టెక్ కంపెనీలపై పెరుగుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇండోనేషియా వంటి దేశాలు పిల్లల కోసం సోషల్ మీడియా వినియోగంపై కఠినమైన ఆంక్షలు విధించాయి.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంచలన ప్రకటన
పిల్లలను ఆన్‌లైన్ ముప్పుల నుండి కాపాడే దేశాల జాబితాలో ఇప్పుడు బ్రిటన్ కూడా అధికారికంగా చేరిపోయింది. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సోమవారం ఒక కీలక ప్రకటన చేస్తూ, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం సోషల్ మీడియాను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త చట్టపరమైన నిషేధం పరిధిలోకి ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఎక్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లన్నీ రానున్నాయి. అయితే, కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్ అయిన వాట్సాప్, సిగ్నల్ లని మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయించే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా చట్టాల తర్హాలోనే సరికొత్త రూల్స్
గత ఏడాది ఆస్ట్రేలియా ప్రభుత్వం పిల్లల ఆన్‌లైన్ రక్షణ కోసం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం తర్హాలోనే బ్రిటన్ కూడా ఈ నిబంధనలను రూపొందిస్తోంది. అయితే బ్రిటన్ ఒక అడుగు ముందుకు వేసి, పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే ప్రత్యేక ఫీచర్లపై కూడా స్పష్టమైన ఆంక్షలు విధించనుంది. దీని ప్రకారం, 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో లైవ్ స్ట్రీమింగ్ చేయడం లేదా చాటింగ్ ద్వారా కమ్యూనికేట్ చేయడాన్ని పూర్తిగా నిరోధిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని స్టార్మర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల డిజైన్లు పిల్లలను ఒక లతలా బానిసలుగా మార్చేలా ఉన్నాయని, దీనివల్ల వారిలో అసంతృప్తి, మానసిక సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Oppo : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒప్పో సెన్సేషన్.. ఈ ఏడాది చివర్లో మోస్ట్ పవర్‌ఫుల్ ఒప్పో ఫైండ్ X10 ప్రో లాంచ్
మలేషియాలో కఠినమైన నిబంధనలు
ఇటీవలే ఆసియా దేశమైన మలేషియా కూడా 16 ఏళ్ల లోపు పిల్లల కోసం సోషల్ మీడియాను అధికారికంగా బ్యాన్ చేసింది. ఈ నియమం ప్రకారం.. మలేషియాలో కనీసం 80 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉన్న ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సంస్థలు ఖచ్చితంగా యూజర్ల ఏజ్ వెరిఫికేషన్ బలమైన సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలి. 16 ఏళ్ల లోపు పిల్లలు కొత్త అకౌంట్లు తెరవకుండా ఈ సిస్టమ్ అడ్డుకుంటుంది. ఒకవేళ ఏ టెక్ కంపెనీ అయినా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, మలేషియా ప్రభుత్వం సదరు సంస్థపై ఒక కోటి రింగిట్ (దాదాపు 25 లక్షల అమెరికన్ డాలర్లు) వరకు భారీ జరిమానా విధించేలా చట్టాన్ని తెచ్చింది. హానికరమైన కంటెంట్ నుంచి పిల్లలను రక్షించడమే తమ లక్ష్యమని మలేషియా స్పష్టం చేసింది.
మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో
చిన్నారుల భవిష్యత్తు, ఆరోగ్యం విషయంలో గ్లోబల్ ట్రెండ్ మారుతుండటంతో మరికొన్ని ప్రముఖ దేశాలు కూడా ఇవే తరహా నిర్ణయాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఫ్రాన్స్, స్పెయిన్, డెన్మార్క్, థాయిలాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా తమ దేశాల్లో 16 ఏళ్ల లోపు పిల్లల కోసం సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించే లేదా పూర్తిగా నిషేధించే చట్టాలపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా టెక్ కంపెనీలు తమ బిజినెస్ మోడల్స్, యూజర్ వెరిఫికేషన్ విధానాలను పూర్తిగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Honor 600 Smart 5G With 7,700mAh Battery Listed on French Website, Could Launch Soon: Price, Features
Rockstar Games Confirms GTA 6 Pre-Orders Will Begin June 25, Reveals New Cover Art