View-Once text feature in WhatsApp: మనం పంపే సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లు కూడా అవతలి వ్యక్తి ఒక్కసారి చదవగానే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయేలా వ్యూ వన్స్ టెక్స్ట్ మెసేజెస్ అనే ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది.
Photo Credit: Pexels/Anton
iOS beta reveals upcoming view-once text feature
View-Once Text Feature in WhatsApp: మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో నంబర్ వన్ స్థానంలో ఉన్న వాట్సాప్, తన యూజర్ల చాటింగ్ అనుభవాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు నిరంతరం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే, యూజర్లు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక విప్లవాత్మక ఫీచర్‌పై ఇప్పుడు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. మనం పంపే సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లు కూడా అవతలి వ్యక్తి ఒక్కసారి చదవగానే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయేలా వ్యూ వన్స్ టెక్స్ట్ మెసేజెస్ అనే ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది.
ఐఫోన్ బీటా వెర్షన్‌లో గుర్తింపు
ప్రముఖ వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ తన ఐఓఎస్ యాప్ పరిధిలో ఈ సరికొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఐఫోన్ కోసం తీసుకొచ్చిన వాట్సాప్ బీటా వెర్షన్ 26.24.10.16లో ఈ ఫీచర్ ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి ఇది డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. యాపిల్ టెస్ట్‌ఫ్లైట్ ప్రోగ్రామ్ ద్వారా సైన్ అప్ అయిన బీటా టెస్టర్లకు కూడా ఇంకా ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. గతంలో ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం కూడా ఇలాంటి ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
సెండ్ బటన్ లాంగ్ ప్రెస్‌తో సీక్రెట్ మెనూ
ఈ సరికొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. మీరు వాట్సాప్‌లో ఎవరికైనా ఒక రహస్య సమాచారాన్ని లేదా పాస్‌వర్డ్ లాంటి టెక్స్ట్‌ను పంపాలనుకున్నప్పుడు, ఎప్పటిలాగే మెసేజ్ టైప్ చేయాలి. ఆ తర్వాత నేరుగా సెండ్ బటన్ నొక్కకుండా, దానిని కాసేపు లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలా చేయగానే స్క్రీన్‌పై Send as view once అనే ఒక ప్రత్యేకమైన ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసి మెసేజ్ పంపితే.. అవతలి వ్యక్తి ఆ చాట్ ఓపెన్ చేసి మెసేజ్ చదివిన వెంటనే, అది శాశ్వతంగా మాయమైపోతుంది. మళ్లీ బ్యాక్ వచ్చి చూసినా ఆ మెసేజ్ కనిపించదు.
![]()
Photo Credit: WABetaInfo
నో స్క్రీన్‌షాట్.. నో ఫార్వర్డ్ రక్షణ
ఈ వ్యూ వన్స్ టెక్స్ట్ మెసేజ్‌లకు వాట్సాప్ అత్యంత కఠినమైన భద్రతా నియమాలను వర్తింపజేయనుంది. ఈ ఫీచర్ ద్వారా వచ్చిన మెసేజ్‌లను అవతలి వ్యక్తులు కాపీ చేయడం గానీ, ఇతరులకు ఫార్వర్డ్ చేయడం గానీ, సోషల్ మీడియాలో షేర్ చేయడం గానీ అస్సలు కుదరదు. అంతేకాదు, యాప్ లోపల ఈ మెసేజ్ ఓపెన్ అయినప్పుడు దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్ తీయడం లేదా స్క్రీన్ రికార్డింగ్ చేయడం వంటివి కూడా పూర్తిగా బ్లాక్ చేయబడతాయి. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా పటిష్టమైన రక్షణ లభిస్తుంది.
Price Hike : స్మార్ట్‌ఫోన్ కొనేవారికి బ్యాడ్ న్యూస్.. వివో, లావా మొబైల్స్ ధరలు భారీగా పెంపు
గ్రూప్ చాట్స్‌లోనూ అందుబాటులోకి
ప్రస్తుతం చాలా మంది యూజర్లు తమ రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడానికి.. ఒక పేపర్‌పై టెక్స్ట్ రాసి, దానిని ఫోటో తీసి వ్యూ వన్స్ మీడియాలాగా పంపుతున్నారు. అయితే వాట్సాప్ తెస్తున్న ఈ కొత్త ఫీచర్‌తో ఆ తిప్పలన్నీ తప్పనున్నాయి. నేరుగా టెక్స్ట్ మెసేజ్‌నే టెంపరరీగా పంపవచ్చు. ఈ అద్భుతమైన ఫీచర్ వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్ చాట్స్‌లోనూ అద్భుతంగా పనిచేస్తుందని సమాచారం. అయితే వాట్సాప్ ఛానల్స్‌లో మాత్రం ఈ ఫీచర్‌కు సపోర్ట్ ఉండదు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, డిసప్పియరింగ్ మెసేజెస్ తర్వాత వాట్సాప్ తెస్తున్న అతిపెద్ద ప్రైవసీ అప్‌డేట్ ఇదే కానుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Great Indian Festival 2026: Gaming Headset Deals Under Rs. 5,000
Amazon Great Indian Festival 2026 Sale: Best Gaming Monitors Under Rs. 20,000
Amazon Great Indian Festival 2026: Best Power Bank Deals