EPFO : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో మారిన రూల్స్.. ఇకపై పాత పద్ధతి పనిచేయదు

పీఎఫ్ ఖాతాదారులకు అత్యంత కీలకమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను యాక్టివేట్ చేసుకునే విధానాన్ని, కొత్త యూఏఎన్ నంబర్‌ను క్రియేట్ చేసుకునే పద్ధతిని ఈపీఎఫ్‌ఓ పూర్తిగా మార్చేసింది.

EPFO : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో మారిన రూల్స్.. ఇకపై పాత పద్ధతి పనిచేయదు

Photo Credit: Pexels/Cup of Couple

UAN

ముఖ్యాంశాలు
  • ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో మారిన రూల్స్, ఇకపై ఆ పాత పద్ధతి పనిచేయదు
  • యూఏఎన్ (UAN) యాక్టివేషన్ నిబంధనలు పూర్తిగా మార్చేసిన ఈపీఎఫ్‌ఓ
  • ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ నుండి ఆ ఫీచర్లు అవుట్
ప్రకటన

EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన అధికారిక పోర్టల్‌లో భారీ మార్పులు చేసింది. ఇటీవల పీఎఫ్ సర్వీసులలో మెయింటెనెన్స్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ పనులను పూర్తి చేసిన తర్వాత ఈ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ముగిసిన తర్వాత ఎవరైనా పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సేవలు పొందాలని చూస్తే వారికి భారీ మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా, పీఎఫ్ ఖాతాదారులకు అత్యంత కీలకమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను యాక్టివేట్ చేసుకునే విధానాన్ని, కొత్త యూఏఎన్ నంబర్‌ను క్రియేట్ చేసుకునే పద్ధతిని ఈపీఎఫ్‌ఓ పూర్తిగా మార్చేసింది. పాత వెబ్‌సైట్ పద్ధతికి స్వస్తి పలుకుతూ కస్టమర్ల భద్రత కోసం సరికొత్త డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

యూఏఎన్ యాక్టివేషన్ కోసం ఉమాంగ్ యాప్ తప్పనిసరి 
మీరు గనుక మీ పీఎఫ్ అకౌంట్‌కు సంబంధించిన యూఏఎన్‎ను యాక్టివేట్ చేసుకోవాలని అనుకుంటే, ఇకపై ఆ సౌకర్యం ఈపీఎఫ్‌ఓ అధికారిక పోర్టల్‌లో లభించదు. అవును, ఈపీఎఫ్‌ఓ తన వెబ్‌సైట్ నుంచి యూఏఎన్ యాక్టివేషన్ ఆప్షన్‌ను పూర్తిగా తీసేసింది. దీని కోసం సబ్‌స్క్రైబర్లు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉమాంగ్ (UMANG) యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్రాసెస్‌లో ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేశారు. అంటే ముఖ గుర్తింపు ద్వారా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయడం ఇప్పుడు ఒక ముఖ్యమైన స్టెప్‌గా మారింది. కేవలం యాక్టివేషన్ మాత్రమే కాదు, కొత్త యూఏఎన్ నంబర్‌ను జనరేట్ చేసే ఆప్షన్‌ను కూడా వెబ్‌సైట్ నుంచి తొలగించి, పూర్తిగా ఉమాంగ్ ప్లాట్‌ఫారమ్‌కే షిఫ్ట్ చేశారు.

ఉమాంగ్ యాప్‌లో మీ యూఏఎన్‎ను యాక్టివేట్ చేసుకోండిలా 
* నూతన నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నంబర్‌ను సులభంగా యాక్టివేట్ చేసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి:
* మొదటగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి అధికారిక UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ సేవల్లో ‘EPFO Services' ను సెలెక్ట్ చేసుకోవాలి.
* ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే UAN Services through Face Authentication అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* దాని లోపల ఉన్న ‘UAN Activation' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ఇప్పుడు యూజర్లు తమ ఆధార్ కార్డు వివరాలతో కూడిన ఫేస్ అథెంటికేషన్ ‎ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
* ఈ వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత, స్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటిస్తూ మీ యూఏఎన్‌ను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
Google : గూగుల్ మ్యాప్స్, జెమిని ఏఐతో పాత దోస్త్ వేట.. టెక్నాలజీ సాయంతో ఇల్లు కనిపెట్టిన ఇస్మాయిల్
 

కొత్త UAN నంబర్ జనరేట్ చేయడం ఎలా?
ఒకవేళ మీరు కొత్తగా ఉద్యోగంలో చేరి ఉండి, సరికొత్త యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ను క్రియేట్ చేయాలనుకుంటే దానికి కూడా ఉమాంగ్ యాప్‌నే వాడాలి. అందుకోసం ముందుగా ఉమాంగ్ యాప్‌లోకి వెళ్లి ఈపీఎఫ్‌ఓ (EPFO) సెక్షన్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ ‘UAN Allotment and Activation' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్త నంబర్ కేటాయించే ముందు కూడా సిస్టమ్ ఖచ్చితంగా ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్‌ను అడుగుతుంది. మీ ఫేస్ స్కాన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత మాత్రమే కొత్త యూఏఎన్ నంబర్ జనరేట్ అవుతుంది.

అసలు ఉమాంగ్ యాప్ అంటే ఏమిటి? 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్ (UMANG) యాప్ అనేది ఒకే ప్లాట్‌ఫారమ్‌పై ఈపీఎఫ్‌ఓతో పాటు దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వందలాది డిజిటల్ సేవలను ప్రజలకు అందిస్తుంది. పీఎఫ్ ఖాతాలలో మోసాలను అరికట్టడానికి, సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈపీఎఫ్‌ఓ ఈ ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ వల్ల సబ్‌స్క్రైబర్ల డేటా దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉండదని, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పీఎఫ్ సేవలు సురక్షితంగా అందుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Oppo Find X10 : ఏకంగా 200ఎంపీతో మూడు వెనుక కెమెరాలు.. ఒప్పో ఫైండ్ X10 ప్రో మాక్స్ లీకైన క్రేజీ ఫీచర్లు
  2. iQOO : స్టూడెంట్స్ కోసం ఐకూ సరికొత్త ప్లాన్.. జూలై 24న మార్కెట్లోకి iQOO Z11 Lite ఎంట్రీ
  3. EPFO : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో మారిన రూల్స్.. ఇకపై పాత పద్ధతి పనిచేయదు
  4. Google : గూగుల్ మ్యాప్స్, జెమిని ఏఐతో పాత దోస్త్ వేట.. టెక్నాలజీ సాయంతో ఇల్లు కనిపెట్టిన ఇస్మాయిల్
  5. Google : గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ముఖ్యమైన ఫొటోలు డిలీట్ చేయకుండానే స్పేస్ ఖాళీ చేయండిలా
  6. Samsung : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ A56 5G ధర
  7. Phone Under Rs.30,000 : రూ.30 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్? మోటో G77 పవర్, వన్‌ప్లస్ నార్డ్, ఐకూ Z10R ల మధ్య అసలైన ఫైట్
  8. Moto G77 Power : భారత మార్కెట్లోకి మోటో కొత్త పవర్‌హౌస్.. నేటి నుంచే Moto G77 Power సేల్స్ షురూ
  9. Kia Syros EV : టాటా నెక్సాన్ ఈవీకి చెక్ పెట్టేందుకు వస్తున్న కియా సైరోస్ ఈవీ.. లీకైన లుక్స్ చూశారా?
  10. Voter List : ఇంటికొచ్చిన బీఎల్ఓలు ఆధార్, పాన్ అడుగుతున్నారా? ఎన్నికల సంఘం కీలక ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »