Garmin Forerunner : ఆపిల్, శామ్‌సంగ్ వాచ్‌ల పని ఖతం.. భారత్ లోకి గార్మిన్ ఏఐ జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌లు

The Garmin Forerunner 70 and Forerunner 170 watches support Garmin Coach, daily suggested workouts, PacePro and more.

Garmin Forerunner : ఆపిల్, శామ్‌సంగ్ వాచ్‌ల పని ఖతం.. భారత్ లోకి గార్మిన్ ఏఐ జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌లు

Photo Credit: Garmin

Garmin Forerunner 170 will come in Black with Amp Yellow accents and Whitestone with Cloud Blue shades

ముఖ్యాంశాలు
  • భారత్ లోకి గార్మిన్ ఏఐ జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌లు
  • గార్మిన్ ఫోరన్నర్ 70, గార్మిన్ ఫోరన్నర్ 170 పేరుతో రెండు జీపీఎస్ వాచెస్
  • ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లలో ఇన్‌బిల్ట్ జీపీఎస్ ఉంది.
ప్రకటన

 Garmin Forerunner : ప్రముఖ ఫిట్‌నెస్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ గార్మిన్ రన్నర్లు, అథ్లెట్లను టార్గెట్ చేస్తూ సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి తెచ్చింది. గార్మిన్ ఫోరన్నర్ సిరీస్‌లో గార్మిన్ ఫోరన్నర్ 70, గార్మిన్ ఫోరన్నర్ 170 పేరుతో రెండు ప్రీమియం జీపీఎస్ రన్నింగ్ స్మార్ట్‌వాచ్‌లను గ్లోబల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సరికొత్త వాచ్‌లు జూన్ 2026 లో అధికారిక అనుమతులు పూర్తయిన తర్వాత భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. రన్నింగ్ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టే బిగినర్స్ కోసం, అలాగే ప్రొఫెషనల్ అథ్లెట్ల కోసం ప్రత్యేకమైన స్పోర్ట్స్ మోడ్స్, హెల్త్ ట్రాకర్లతో వీటిని రూపొందించారు.

అమోలెడ్ డిస్‌ప్లే.. ఐదు ఫిజికల్ బటన్ల క్లాసిక్ డిజైన్ 
గార్మిన్ ఫోరన్నర్ 70, ఫోరన్నర్ 170 రెండు మోడల్స్‌లోనూ మెరుగైన విజువల్స్ కోసం 1.2 అంగుళాల అమోలెడ్  డిస్‌ప్లేను అందించారు. ఇది 390 x 390 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో వస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం కెమికల్లీ స్ట్రెంథెండ్ గ్లాస్, గట్టి ఫైబర్ కేస్, చేతికి సౌకర్యంగా ఉండే సిలికాన్ స్ట్రాప్స్ ఇచ్చారు. ఈ వాచ్‌లు ఫుల్ టచ్ స్క్రీన్‌తో పాటు గార్మిన్ సిగ్నేచర్ స్టైల్ అయిన ఐదు ఫిజికల్ బటన్ల లేఅవుట్‌ను కలిగి ఉంటాయి. రన్నింగ్ చేసేటప్పుడు లేదా చెమట పట్టినప్పుడు టచ్ స్క్రీన్ కంటే ఈ బటన్లు చాలా సులభంగా పనిచేస్తాయి. వీటికి 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటం వల్ల ఈజీగా స్విమ్మింగ్ చేస్తూ కూడా వాడుకోవచ్చు.

అడ్వాన్స్‌డ్ జీపీఎస్ నెట్‌వర్క్ 
ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లలో ఇన్‌బిల్ట్ జీపీఎస్ ఉంది. ఇది గ్లోనాస్, గెలీలియో శాటిలైట్ సిస్టమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కొండల్లో, అడవుల్లో ట్రాకింగ్ చేసినా లొకేషన్ ఖచ్చితంగా చూపిస్తుంది. వీటిలో గుండె వేగాన్ని కొలిచే హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ చూపే పల్స్ ఆక్స్, బాడీ బ్యాటరీ, స్ట్రెస్ ట్రాకింగ్, స్లీప్ స్కోర్, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ప్రొఫెషనల్ ట్రైనింగ్ కోసం గార్మిన్ కోచ్, డైలీ సజెస్ట్ వర్కౌట్స్, రేస్ ప్రిడిక్టర్,రికవరీ టూల్స్ వంటి సుమారు 80 కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను ఇందులో పొందుపరిచారు. క్రికెట్ ఆడేవారి కోసం ప్రత్యేక క్రికెట్ మోడ్ కూడా ఉండటం విశేషం.

గార్మిన్ ఫోరన్నర్ 170 లో మరికొన్ని క్రేజీ ఎక్స్‌ట్రా ఫీచర్లు 
బేస్ మోడల్ ఫోరన్నర్ 70 తో పోలిస్తే ఫోరన్నర్ 170 లో మరికొన్ని అడ్వాన్స్‌డ్ సెన్సార్లు ఉన్నాయి. ఎత్తును కొలిచే బారోమెట్రిక్ ఆల్టిమీటర్, దిక్సూచి, గైరోస్కోప్, థర్మామీటర్ వంటి సెన్సార్లను ఇందులో చేర్చారు. కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కోసం గార్మిన్ పే సపోర్ట్, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్, సైక్లింగ్ పవర్ మీటర్లతో కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఫోరన్నర్ 170 లో ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ వేరియంట్ కూడా లభిస్తుంది. దీనిలో ఉండే 4GB ఇంటర్నల్ స్టోరేజ్‌లో పాటలను దాచుకుని, వర్కౌట్స్ చేసేటప్పుడు ఫోన్ లేకుండానే నేరుగా బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ ద్వారా మ్యూజిక్ వినొచ్చు.

ధరల అంచనా, బ్యాటరీ లైఫ్ వివరాలు
భారతదేశంలో ఈ వాచ్‌ల ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే అమెరికా మార్కెట్లో గార్మిన్ ఫోరన్నర్ 70 ధర 249.99 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 23,900) మరియు ఫోరన్నర్ 170 ధర 299.99 డాలర్లు (సుమారు రూ. 28,700) గా ఉంది. ఇండియాలో కూడా ఇంచుమించు ఇదే బడ్జెట్‌లో వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఫోరన్నర్ 70 స్మార్ట్‌వాచ్ మోడ్‌లో 13 రోజుల వరకు, కేవలం జీపీఎస్ మోడ్‌లో 23 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇందులో 512MB స్టోరేజ్ ఉంటుంది. మరోవైపు ఫోరన్నర్ 170 మోడల్ స్మార్ట్‌వాచ్ మోడ్‌లో 10 రోజుల వరకు, జీపీఎస్ మోడ్‌లో 20 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది.

#తాజా కథనాలు
  1. Sony : భారత్‌లోకి సోనీ బ్రావియా 3II స్మార్ట్ టీవీలు.. గూగుల్ జెమిని ఏఐ సపోర్ట్‌తో సరికొత్త సంచలనం
  2. Samsung : భారత్‌లో శాంసంగ్ సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ షురూ.. లీగల్‌గా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ సేల్
  3. Amazon : అమెజాన్ సమ్మర్ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.15 వేల వరకు డిస్కౌంట్
  4. Bad Boy Karthik : అనౌన్స్‌మెంట్ లేకుండానే ఓటీటీలోకి వచ్చేసిన నాగశౌర్య సినిమా.. ఎక్కడ చూడాలంటే ?
  5. Garmin Forerunner : ఆపిల్, శామ్‌సంగ్ వాచ్‌ల పని ఖతం.. భారత్ లోకి గార్మిన్ ఏఐ జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌లు
  6. Motorola : భారత్‌లో మోటొరోలా మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ సేల్స్ షురూ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్
  7. Google : టెక్ ప్రపంచంలో గూగుల్ కొత్త సంచలనం.. ల్యాప్‌టాప్ మార్కెట్లోకి Googlebook
  8. Smartphone Trends : ఇండియాలో మొబైల్ లవర్స్ మైండ్ చేంజ్.. ఇకపై ఆ డబ్బా ఫీచర్లు నమ్మరు బాబోయ్
  9. Smartphone : ఇండియాలో పడిపోయిన స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు.. జనం బడ్జెట్ ఫోన్లు కొనడం మానేశారా?
  10. Apple : యాపిల్ హిస్టరీలోనే మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. ఐఓఎస్ 27తో ఐఫోన్ల రూపమే మారిపోనుంది
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »